{"timeout":"7000","width":"990"}
  • తేదీలు
  • మరిన్ని తేదీలు

తేదీలు

ప్రతి సంవత్సర పట్టికయందు అవే తేదీలు ఉండును గానీ, ఏ రెండు సంవత్సరములూ ఒకేలా ఉండవు. ప్రతి సంవత్సరమూ విభిన్నముగా వచ్చుచున్నది సూర్య భగవానుడు.

మరిన్ని తేదీలు

అనుష్ఠానము కొరకు కొన్నిముఖ్యమైన తేదీలు ఇవ్వబడిన కాలము యొక్క మూలము లోకి మనందరమూ ప్రవేశించెదము గాక.

కార్యక్రమములు మరియు ముఖ్య దినములు

మే కాల్

మే 29న మే కాల్ దినము జరిపెదరు

Master C.V.V. - May Call! 1988 వ సంవత్సరము నుండి మాస్టర్ సి. వి. వి. గారి యోగ మార్గమును, కుంభ చైతన్యమును మే కాల్ దినముల యందు డా. కె. పార్వతీకుమార్ గారు ప్రసారము చేయుచున్నారు.

డా. కె. పార్వతీకుమార్ గారి మే కాల్ సందేశములు (English) మాస్టర్ సి. వి. వి. గారి బోధనలను సూచిస్తాయి.

మే కాల్ గురించి మరిన్ని వివరములు

  • మే కాల్ ఉత్సవము: బెంగళూరులో: మే 27 సాయంత్రము నుండి మే 30 మధ్యాహ్నము వరకు. డా. కె. పార్వతీకుమార్ గారు పాల్గొనెదరు. వివరములకు సంప్రదించగలరు

డిసెంబర్ కాల్

Master C.V.V. - May Call! Vol.2 డిసెంబర్ 29 న డిసెంబర్ కాల్ జరిపెదరు

2011 డిసెంబర్ కాల్
డా. కె. పార్వతీకుమార్ గారి ప్రవచనములను (English) ఇక్కడ చూడవచ్చును
ప్రవచనము 1: 1/ 2/ 3/ 4
ప్రవచనము 2: 1/ 2/ 3/ 4
ప్రవచనము 3: 1/ 2/ 3/ 4

  • డిసెంబర్ కాల్: బెంగళూరు లో డిసెంబర్ 27 సాయంత్రము నుండి డిసెంబర్ 30 వరకు జరుగును. డా. కె. పార్వతీకుమార్ గారు పాల్గొనెదరు. వివరములకు సంప్రదించగలరు

సదస్సులు

  • పాశ్చాత్య బృందములతో: డా. కె. పార్వతీకుమార్ గారిచే నిర్వహించబడే సదస్సు, విశాఖపట్టణము. 02 - 09 జనవరి. వివరములకు సంప్రదించగలరు
  • సింహాచలంలో గురుపూజలు: 10 - 13 జనవరి వివరములకు సంప్రదించగలరు

నవంబరు 7 - సత్సంకల్ప దినోత్సవము

ఒంటరిగా గాని, బృందములుగా గాని, ప్రపంచవ్యాప్తముగా గాని సత్సంకల్పముతో జీవుల సేవకు, పేదలకు, అవసరమైన వారికి సహాయము చేయు కార్యక్రమములు మొదలు పెట్టుటకు ఈ రోజును నిర్ణయించటమైనది.

నవంబరు 7 డా. కె. పార్వతీకుమార్ గారి గౌరవార్థము సత్సంకల్ప దినముగా పిలువబడుచున్నది. జీవుల సేవ కొరకు ఆయన తన జీవితమును అంకితము చేసినారు.

1985లో ఆయన సత్సంకల్ప బృందము (Circle of Good Will) ను ఏర్పాటు చేసినారు. దీని ద్వారా ఎన్నో సామాజిక కార్యక్రమములు: మురికివాడలలో విద్యాలయములను ప్రారంభించుట, ఉచిత విద్య, ఆహారము, బట్టలు పంచుట, ఉచిత హోమియో శిబిరములు, ఆరోగ్య పరిరక్షణ, మరియు మనోధైర్యమును అందించుట మొదలగునవి చేయబడినవి.

ఈ సత్సంకల్ప బృందమునకు మార్గదర్శక సూత్రమేమనగా “మనచుట్టు వున్న జీవులకు నేనేమి చేయగలను?”

జగద్గురు పీఠము బృందములన్నియు ప్రపంచ వ్యాప్తముగా ఈ రోజున కలసి సత్సంకల్పముతో ఎటువంటి కార్యక్రమములు జరుపవచ్చునో ముచ్చటించుకొని మొదలు పెట్టెదరు.

నూతన సంవత్సరము

డా. కె. పార్వతీకుమార్ గారి 2012 నూతన సంవత్సర సందేశము (English) 1/ 2/ 3

పౌర్ణమి

పుణ్యదినములు 2024

సంవత్సరపు విషువత్ మరియు ఉత్తరాయణ, దక్షిణాయన సంక్రమణ పుణ్యదినములు

Event Month Day Time
(GMT)
ఉత్తర విషువత్ మార్చి 20 03:07
దక్షిణాయన సంక్రమణము జూన్ 20 20:51
దక్షిణ విషువత్ సెప్టెంబరు 22 2:44
ఉత్తరాయణ సంక్రమణము డిసెంబరు21 09:20

సాధకునకు విషువత్ పుణ్యదినముల ప్రాముఖ్యత గురించి డా. కె. పార్వతీకుమార్ గారి ప్రవచనము: 1/ 2

పండుగలు

విషువత్ పుణ్యదినములు నాలుగును సంవత్సరము నందలి నాలుగు పండుగ దినములు. ప్రకృతి యందలి ఈ దినములను అనుసరించమని గురుపరంపర మనలను కోరుచున్నది.

పండుగలు గురించి మరిన్ని వివరములు