{"timeout":"7000","width":"990"}
  • శబ్దము యొక్క శక్తి
  • ఛందము మరియు క్రతువు
  • నిశ్శబ్దమును వినుట

శబ్దము యొక్క శక్తి

శాంతి కొరకు ప్రదర్శనలు చేయుట కన్నా, బృందములుగా ఓంకార నాదోచ్చారణ చేయుట వలన సూక్ష్మ లోకముల పై మంచి ప్రభావము కలిగి ప్రపంచ శాంతి సిద్ధించును.

ఛందము మరియు క్రతువు

అన్నిలయాత్మక కార్యములు మరియూ క్రతువులూ మన శరీరధాతువులలో సహజముగా మార్పులు తీసుకువచ్చుటే లక్ష్యముగా చేసుకొని, మనము త్వరితగతిన అభివృద్ధి చెందడానికి తోడ్పడతాయి.

నిశ్శబ్దమును వినుట

నిశ్శబ్దమును విన్నప్పుడు మనకి ఝంకార నాదము వినిపిస్తుంది. ఇది హృదయ కేంద్రములో వినిపించే నిశ్శబ్దము యొక్క స్వరము మరియూ నిశ్శబ్దమైన ధ్వని.

ధనిష్ఠ ధ్యానము

“ధ్యానము చేయునది కాదు, జరుగునది.”

ధ్యానములు, క్రతువులు | ధ్యానములు మరియు సూచనలు
Current Astrological Dates / Astrological Calendar (English)
పుస్తకము: మాస్టర్ C.V.V. యోగము | పుస్తకము: Mystic Mantrams (English)
ధనిష్ఠ

జ్యోతిష చక్రము 27 నక్షత్రమండలములతో నిండి ఉన్నది. అవి చంద్రుని యొక్క 27 భవనములుగా చెప్పబడినవి. “నా తండ్రి అనేక భవనములు కలిగి ఉన్నాడు” అని పరమ గురువు జీసస్ చే చెప్పబడినది. చాంద్రమానము ప్రకారము చంద్రుడు ప్రతిరోజు ఒక్కొక్క భవనములో ఉండును. ధనిష్ఠ అను నక్షత్రమండలము ద్వారా కుంభరాశి యొక్క సమన్వయాత్మకమైన శక్తి తరంగములు భూమిని చేరును.

మాస్టరు సి.వి.వి గారు జన్మించినపుడు చంద్రుడు ధనిష్ఠా నక్షత్రము నందు ఉండుట, యాదృచ్ఛికము కాదు. ధనిష్ఠ అనగా “ధనపూరితమైన దివ్యవాయువు”. కుంభరాశి వాయుతత్వపు రాశి.

1990లో డా. కె. పార్వతీకుమార్ గారు చాలా లోతైన ధ్యాన స్థితిని చంద్రుడు ధనిష్ఠా నక్షత్రము నందు ఉండగా పొందినారు. తరువాతి ధ్యానము నందు కూడా వారు అటువంటి ధ్యాన స్థితినే పొందినారు. కనుకనే చంద్రుడు ధనిష్ఠ నక్షత్రము నందు ఉండగా, ఆరోజు రాత్రి 9 గంటల సమయమున ధ్యానము చేయమని ప్రతిపాదించి ఉన్నారు.

చంద్రుడు ధనిష్ఠా నక్షత్రము నందు ఉన్న ప్రతిసారి ఈ ధనిష్ఠ ధ్యానమును మాస్టరు సి.వి.వి గారిచే అందించబడిన మర్మ మంత్రములపై చేయవలెను. రాత్రి 9 గంటల సమయము దీనికి కేటాయించటమైనది. ఆ రోజున చాలా స్వల్పముగా, తేలికయైన ఆహారము స్వీకరించి ధ్యానమునకు కూర్చొనవలెను. ధ్యానము తరువాత ఎక్కువగా మాట్లాడకుండా, ప్రశాంతముగా, ఏకాంతముగా నిద్రించవలెను.

మాస్టరు సి.వి.వి గారిచే ఇవ్వబడిన ఈ మర్మ మంత్రములు సాధకుని యొక్క స్వభావము యందు అనూహ్యమైన మార్పులను కలిగించి, మనస్సు, ఇంద్రియములు, మరియు శరీరముల యందు అనుసంధానము త్వరితగతిన కలిగించును.

ఈ మంత్రములు ధ్వని ప్రాధాన్యత కలిగి ఉండుటచే వీటిని జాగ్రత్తగా, కనులు మూసుకొని, శబ్దమును సావధానముగా , శ్రద్ధగా ఆలకించుచూ ఉచ్చరింపవలెను. వీటిని ఉచ్చరించుటకు జాగ్రత్తగా, సావధానముగా కనులు మూసుకొని, చెవులు తెరచి ప్రయత్నింపవలెను. ఒకసారి ఉచ్చరించిన తరువాత 15 నిమిషములు మౌనముగా ఉండవలెను.

మర్మ మంత్రములు

ఈ క్రింది మంత్రములు రాత్రి 9 గంటలకు చంద్రుడు ధనిష్ఠా నక్షత్రము నందు ఉండగా చెప్పవలెను:

IMaster Namaskaram
Dip Deep
Axis Arranged Hours
Higher Bridge Beginning
Truth Levels
Nil None Naught Levels
Normal Temperament
Time Expand
Electric Hint
Ether Work Out
Equator Equal
Pituitary Hint
Hidden Circumference
Side Ways
Miller Form Centre
Vertical Levels
Meet Centres
Namaskaram Master CVV to your Lotus Feet
II15 నిమిషములు మౌనము వహించి, లోపల ఏమి జరుగుతున్నదో గమనింపుము
IIIలోకా స్సమస్తా స్సుఖినో భవంతు (3 మార్లు)
ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః