{"timeout":"7000","width":"990"}
  • శబ్దము యొక్క శక్తి
  • ఛందము మరియు క్రతువు
  • నిశ్శబ్దమును వినుట

శబ్దము యొక్క శక్తి

శాంతి కొరకు ప్రదర్శనలు చేయుట కన్నా, బృందములుగా ఓంకార నాదోచ్చారణ చేయుట వలన సూక్ష్మ లోకముల పై మంచి ప్రభావము కలిగి ప్రపంచ శాంతి సిద్ధించును.

ఛందము మరియు క్రతువు

అన్నిలయాత్మక కార్యములు మరియూ క్రతువులూ మన శరీరధాతువులలో సహజముగా మార్పులు తీసుకువచ్చుటే లక్ష్యముగా చేసుకొని, మనము త్వరితగతిన అభివృద్ధి చెందడానికి తోడ్పడతాయి.

నిశ్శబ్దమును వినుట

నిశ్శబ్దమును విన్నప్పుడు మనకి ఝంకార నాదము వినిపిస్తుంది. ఇది హృదయ కేంద్రములో వినిపించే నిశ్శబ్దము యొక్క స్వరము మరియూ నిశ్శబ్దమైన ధ్వని.

అగ్ని ఆరాధన (హోమము)

“ధ్యానము చేయునది కాదు, జరుగునది.”

ధ్యానములు, క్రతువులు | క్రతువులు
Fire Ritual - Short Version (English)
Download/వినండి హోమము (MP3, 15.5 MB)
Download హోమము యొక్క పూర్తి సూచనల PDF (148 KB)
పుస్తకము: Agni - The Symbolism and the Ritual of Fire (English)

హోమము

అగ్నియే సృష్టికి కారణమై ఉన్నది. అగ్ని అనగా అన్నిటికిని ముందు ఉన్నది అని అర్థము. మొదటి సంకల్పమే అగ్ని. ఏమీ లేనట్లుగా కనిపించే స్థితి నుండి సృష్టి ఈవలకు వచ్చుటకు కారణము ఈ సంకల్పమే. వెలుగునకు ఇదే కారణము. ఈ వెలుగునే చైతన్యము అంటారు. “నేను” కు మరో పేరు అగ్ని. ఇది విశ్వమంతా వ్యాపించి సత్యమునకు వాహికయై ఉన్నది. అగ్ని లేనిదే ప్రాణము లేదు. అగ్నియే సృష్టి, స్థితి మరియు లయ కారకమై ఉన్నది. దేవతలందరు అగ్నితో, అగ్ని అందరితోను పనిచేయును. అగ్ని మనయందు వేడిమిగా, ప్రాణముగా మరియు ఆత్మగా ఉన్నది. అగ్నియొక్క అంతర్భాగమైన శక్తి వలననే సృష్టి నిలచియున్నది.

అగ్ని, విశ్వమందలి శక్తి తరంగములను పవిత్రము చేసి తీసుకురాగలదు. అగ్నిద్వారా చేరలేని ప్రదేశము లేదు. కనుకనే అగ్ని ఆరాధన ముఖ్యమైనది. అపరిశుద్ధమైన దానిని కాల్చివేయుటకు మాత్రమే కాదు, పవిత్రమైన దానిని ఊర్ధ్వము నుండి క్రిందకు కొనివచ్చుటకు కూడా అగ్నిని ఆరాధించవలెను.

మనయందలి శక్తి వ్యవస్థ యందు విశేషమైన అభివృద్ధిని పొందుటకు అగ్ని ఆరాధన ఎంతగానో ఉపయోగ పడుతుంది. అందువలన సమాజములో మంచి పనులకు ఉపయోగపడే విధముగా తయారగుట జరుగుతుంది. మన మనస్సులోని మలినములను, లోతుగా పేరుకుపోయిన అవలక్షణములను దగ్ధముచేయుటకు అగ్ని ఆరాధన ఎంతో ఉపయోగకరము. ఇది మన పూర్వకర్మను దగ్ధముచేసి వెలుగు మార్గములో పయనించుటకు మార్గమును సుగమము చేయును. మాయయొక్క ప్రలోభములో తిరిగి పడకుండా నిరోధించును.

అగ్ని ఆరాధనలో భాగంగా మొదట 7 సార్లు మంత్రమును జపించి అగ్నిని ప్రార్థించవలెను.

తరువాత 10 దిక్కుల నుండి అగ్నిని ఆవాహన చేయవలెను. తూర్పు దిక్కు నుండి ఇంద్రుని, ఆగ్నేయ దిక్కునుండి అగ్నిని, దక్షిణము నుండి యముని, నైరుతి దిక్కునుండి నిరృతుని, పడమర దిక్కునుండి వరుణుని, వాయవ్య దిక్కునుండి వాయువుని, ఉత్తర దిక్కునుండి కుబేరుని, ఈశాన్య దిక్కునుండి ఈశానుని లేక ఈశ్వరుని, ఊర్ధ్వము నుండి ఇంద్రావిష్ణువుని, అధో దిక్కు (క్రింద) నుండి అగ్నావిష్ణువుని ఆవాహన చేసి ప్రార్థన చేయవలెను. ప్రతి క్షణము ఈ పది దిక్కులనుండి మనలోనికి శక్తిప్రవాహము జరుగుచుండుటచే మనము పనిచేయుటకు వీలగును.

దశ (10) దిక్కుల దేవతారాధన తరువాత, గ్రహాది దేవతలను ఆరాధన చేయవలెను. చాంద్రమాన జ్యోతిష ప్రకారం ఏడు గ్రహములు - సూర్యుని నుండి శనైశ్చరుని వరకు, రాహువు మరియు కేతువు - మొత్తము నవగ్రహములు లేక గ్రహ ప్రజ్ఞలు. ఈ 7 గ్రహములు, విశ్వమందలి 7 శబ్దతరంగములతో, 7 జాతులతో మరియు 7 గ్రహ ప్రజ్ఞలతో సంబంధము కలిగి ఉంటాయి. ప్రతి గ్రహము ఒక ప్రత్యేకమైన శబ్దము ద్వారా ఆరాధింపబడుతుంది. ఈ ఆరాధన యందు అందరూ దేవతలూ శబ్దము ద్వారానే ఆరాధింపబడుదురు.

తరువాత విశ్వేదేవతలను ఆరాధింపవలెను. మొదటగా గాయత్రిని, ఎందుకనగా గాయత్రి సృష్టియొక్క ప్రణాళికయై ఉన్నది. గాయత్రి నుండే సృష్టి మొత్తము భావింపబడినది. కనుక గాయత్రిని మొదటగా ఆరాధించవలెను, ఎందుకనగా గాయత్రి విశ్వము జనించక ముందువున్న ప్రణాళికయై ఉన్నది.

తరువాత సృష్టియొక్క నాలుగు వ్యూహములను ఆరాధించవలెను. అవి అస్తిత్వము, ఎరుకతో కూడిన అస్తిత్వము, జ్ఞానము మరియు ప్రవర్తన లేక క్రియాత్మకము. నాల్గవదశలో అనగా క్రియాత్మకమైన శక్తి స్థితిలో మిగిలిన మూడూ ప్రతిబింబిస్తాయి. ఈ నాల్గవ స్థితిని భూమిపై అవతరించిన జగద్గురువుగా వేదముచే చెప్పబడినది. మూడవ స్థితిలో విష్ణువుగా, రెండవ స్థితిలో వాసుదేవుడుగా వేదము చెప్పుచున్నది. మొదటి స్థితిలో నారాయణుడై ఉన్నాడని వేదము వివరించినది.

ఈ వ్యూహములు అన్నియు గాయత్రి ఆరాధన తరువాత చేయవలెను. తరువాత జగన్మాతను ఆరాధించవలెను. శ్రీం, హ్రీం, క్లీం అను మంత్ర శబ్దముల ద్వారా జగన్మాతను ఆరాధించవలెను. ఐం అను శబ్దము కూడా జగన్మాత యొక్క మరియొక మంత్రము.

తరువాత మూలాధారమందలి గణపతిని ఆరాధన చేయవలెను. ఈయనయే బృహస్పతి. బృహ్మణస్పతి. విశ్వవ్యాపకమైన జ్ఞానము. మూలాధార కేంద్రము ఈ జ్ఞానముచే నింపబడి ఉన్నది. పదార్థములో కూరుకు పోయిన జీవాత్మను మూలాధారము సూచిస్తుంది. బృహస్పతి తత్వము వ్యాపనత్వము కలిగి, నియమ నిబంధనలతో కూడిన శనైశ్చర తత్వమునకు భిన్నముగా ఉండును. శనైశ్చరుడు నియంత్రించును, బృహస్పతి వికాసము, విముక్తి, విడుదల కలిగించును. ఇతడు “గం” అను మంత్రముచే ఆరాధింపబడును. అది పరిమితులను ఛేదించగలదు.

తరువాత గరుత్మంతుని ఆరాధించవలెను. రెండు రెక్కల పక్షి ఒకటి కలదు. అదియే ప్రాణము లేక స్పందన. ఇది సమతుల్యతలో ఉన్నచో సమస్తము సాధ్యమే. దీనిగురించి వేదములలో చాలా చెప్పబడినది. అతడే సుపర్ణుడు లేక గరుత్మంతుడు.

తరువాత కాలమును ఆరాధించవలెను. దీనికి ఫట్ అని శబ్దము ఉచ్చరింపబడినది. కాలమునకు సంబంధించిన మంత్రములు ఉచ్చరింపబడినవి.

తరువాత నరసింహాస్వామి ఆరాధన చేయవలెను. ఇతడు నర-సింహుడు. నర, సింహ అను శబ్దములు చాలా శక్తివంతమైన శబ్దములు. “స” మరియు “హ” అనునవి సింహ అను శబ్దమును కలిగించును. సోహం, హసౌం మరియు హంస అను శబ్దములు కూడా ఈ అక్షరముల వలనే వచ్చును. ఈ రెండు శబ్దములు ఆజ్ఞా కేంద్రమునకు, విశుద్ధి కేంద్రమునకు చెందిన ప్రాథమిక శబ్దములు. “న” అను శబ్దము విశ్వవ్యాపకమైన తత్వమునకు చెందినది. “ర” అను శబ్దము అంతర్యామి ప్రజ్ఞను బహిర్గతముగా విచ్చుకొనునట్లు చేయును. “ర” అనునది సృష్టి విచ్చుకొనుట లేక ముడుచుకొనుట అను ప్రక్రియకు చెందినది. “న” అనునది సృష్టి పరిణామ క్రియకు చెందినది.

ఆ తరువాత ఇతర విశ్వేదేవతలు అగ్ని ఆరాధనయందు ఆరాధింపవలెను.

ప్రతి ఆశ్రమము నందునూ అగ్నియొక్క ఆరాధన ఒక నియమముగా నిర్వహింపబడుతుంది. ఉన్ముఖత కలిగి, సాధారణ నియమ నిబంధనలను పాటించు వారెవరైననూ ఈ విధమైన అగ్ని ఆరాధన చేయవచ్చును.