{"timeout":"7000","width":"990"}
  • శబ్దము యొక్క శక్తి
  • ఛందము మరియు క్రతువు
  • నిశ్శబ్దమును వినుట

శబ్దము యొక్క శక్తి

శాంతి కొరకు ప్రదర్శనలు చేయుట కన్నా, బృందములుగా ఓంకార నాదోచ్చారణ చేయుట వలన సూక్ష్మ లోకముల పై మంచి ప్రభావము కలిగి ప్రపంచ శాంతి సిద్ధించును.

ఛందము మరియు క్రతువు

అన్నిలయాత్మక కార్యములు మరియూ క్రతువులూ మన శరీరధాతువులలో సహజముగా మార్పులు తీసుకువచ్చుటే లక్ష్యముగా చేసుకొని, మనము త్వరితగతిన అభివృద్ధి చెందడానికి తోడ్పడతాయి.

నిశ్శబ్దమును వినుట

నిశ్శబ్దమును విన్నప్పుడు మనకి ఝంకార నాదము వినిపిస్తుంది. ఇది హృదయ కేంద్రములో వినిపించే నిశ్శబ్దము యొక్క స్వరము మరియూ నిశ్శబ్దమైన ధ్వని.

పూర్ణిమ మరియు అమావాస్య ధ్యానములు

“ధ్యానము చేయునది కాదు, జరుగునది.”

ధ్యానములు, క్రతువులు | ధ్యానములు మరియు సూచనలు
సిద్ధము అగుట | పూర్ణిమ మరియు అమావాస్య ధ్యానముల విధానము
Current Astrological Dates / Astrological Calendar (English)
పుస్తకము: Full Moon Meditations (English)

పూర్ణిమా ధ్యానములు మనస్సు, ఇంద్రియములు, మరియు శరీరమునకు చాలా మంచివి - అనగా ఈ మూడిటి మధ్య అనుసంధానము జరుపుటకు ఆత్మకు పూర్ణిమ ఘడియలలో దిగివచ్చు దివ్యశక్తుల సహకారము సంపూర్ణముగా లభించును. ఈ ధ్యానములు చేయుటకు ఉన్ముఖులు అయిన వారు కొన్ని నియమములను పాటించవలెను. పూర్ణిమకు ముందు రోజు అల్పాహారము స్వీకరించవలెను. ప్రాపంచిక విషయములకు సాధ్యమయినంత దూరంగా ఉండవలెను. ఎవరైతే వారి భావము/ఆలోచన, వాక్కు, మరియు కర్మల యందు స్వచ్ఛత ద్వారా వారి శరీరము, మనస్సు మరియు ఇంద్రియముల మధ్య అనుసంధానము సాధిస్తారో, వారు పూర్ణిమ చంద్రుని యొక్క శక్తిని మరియు పరమగురువుల (Initiates) యొక్క సాన్నిధ్యమును అనుభవింపగలరు.

అందువలన పూర్ణిమ, మనలోని ఆత్మ యొక్క వెలుగును తెలుసుకొనుటకు ప్రకృతి మనకు ఇచ్చిన అపూర్వ అవకాశం. ఆత్మ యొక్క వెలుగు సృష్టి అంతటా వ్యాపించియున్నది. కాని దాన్ని తెలుసుకొనుటకు మన దేహము యొక్క అనుసంధానము (అనగా మానసిక, భావమయ, శారీరిక అనుసంధానము) అవసరము. పూర్ణిమా ధ్యానముల ద్వారా మనము ఇది సాధించగలము. తద్వారా మనము మనలోనే నిండి యున్న ఆత్మ యొక్క వెలుగును, ధ్వనిని మరియు సృష్టి యొక్క మాయను తెలుసుకొనవచ్చు/అనుభూతిచెందవచ్చు.

అమావాస్య మన కామమయ శరీరమును కరిగించుటకు ఉపకరిస్తుంది. అమావాస్య చంద్రుని శక్తి, మన కామమయ శరీరము యొక్క పునర్వ్యవస్థీకరణకు తోడ్పడుతుంది. మన కామమయ శరీరము దివ్యమయినది. దాన్ని మనము ప్రకృతి చేత నిర్దేశింపబడినట్లుగనే ఉపయోగించాలి. కోరిక లేకుండా ఏదియూ సాధించలేము. కోరిక, సంకల్పము యొక్క ప్రతిబింబము. అందు వలన జీవితంలో మంచి సంకల్పములు చేయుటకు కోరిక ఒక సాధనం కావాలి. అందుచేత మన కామమయ శరీరము లో అవసరమయిన సర్దుబాట్లు చేయుటకు అమావాస్య ధ్యానములు చాలా ఉపయోగకరము. పూర్ణిమ చంద్రుని శక్తి మన సూక్ష్మశరీర నిర్మాణమునకు ఉపయోగకరము. ఈ విధముగా మనము పూర్ణిమ మరియు అమావాస్య చంద్రులతో పని చేయవలయును.

అమావాస్య చంద్రుని శక్తి ఈ భావోద్వేగ ప్రవాహములను కరిగించి, కామమయ శరీరములో అవసరమయిన సర్దుబాట్లు చేయును. పూర్ణిమ చంద్రుని యొక్క శక్తి సూక్ష్మశరీర (బంగారు కాంతి శరీరము) నిర్మాణమునకు తోడ్పడును. కామమయ శరీరములో అవసరమయిన సర్దుబాట్లు జరుగకున్నచో బంగారు కాంతి శరీరమును నిర్మించుకొనుట అసాధ్యము. ఈ విధముగా మనము పూర్ణిమ మరియు అమావాస్య చంద్రునకు అనుసంధానమై ఉంటే వెలుగును చేరే మార్గము మనకు సుగమమగును.

పదమూడవ అవరోహణ చంద్ర దశ ముగింపు (కృష్ణ త్రయోదశి), అమావాస్య ఘడియల ప్రారంభ సమయమున, అమావాస్య ధ్యానము చేసినచో చాలా లాభదాయకము. అమావాస్య ఘడియల ప్రారంభదశ అస్సలు చంద్రుడు లేని స్థానము. పూర్ణిమ చంద్రుని అంత్యదశ, పూర్తి పూర్ణిమ చంద్రుడు ఉన్న స్థానము. కాబట్టి పదునాల్గవ అవరోహణ చంద్రదశ మరియు అమావాస్య ఘడియల ప్రారంభదశ, అమావాస్య చంద్రుడు ఉన్న స్థానము. కనుక మనము ఒక రోజు ముందు ఈ ధ్యానములకు సిద్ధము కావచ్చును.

అమావాస్య ఘడియలు దాటిన ఆరు గంటల వరకు ఆ చేతన మనతోనే ఉండును. ఇది పూర్ణిమకి కూడ వర్తించును. ఇలా మనము పూర్ణిమ మరియు అమావాస్య రోజుల యందు మన మనస్సును నిలిపి ఉంచి, ఆ ప్రజ్ఞను ధ్యానించవలెను . ఇది అమావాస్య, ఇది పూర్ణిమ అని తెలిసి ఉండుటయే ముఖ్యము. ఇలా తెలుసుకొని ఆయా శక్తుల యందు అవగాహన కలిగి, ధ్యానము చేయుట (contemplate) అవసరము. ఇలా క్రమముగా అభ్యాసము చేసినచో మన వ్యక్తిత్వంలో అవసరమైన మార్పులు జరుగును.

పూర్ణిమ మరియు అమావాస్య కు సిద్ధమగుట


మన శరీరము,బుద్ధి, ఇంద్రియములను అనుసంధానించుటకు ప్రతి పూర్ణిమ మరియు అమావాస్య ఒక అపూర్వ అవకాశం. ఒక సంవత్సరములో వచ్చే అన్ని పూర్ణిమలు మరియు అమావాస్యలు వేటికవే ప్రత్యేకము. దేని వైభవము దానిదే. విశ్వమంతా వ్యాపించియున్న వెలుగును భౌతికంగా దర్శించుటకు పూర్ణిమ చంద్రుని శక్తి తోడ్పడును. మన శరీరము తో సహా అంతా కాంతిమయమగును.

పూర్ణిమ మనకి చేకూర్చే లాభాలను బేరీజు వేసుకొనుట కంటే, పరిపూర్ణమైన నిశ్శబ్దమును పాటించుట చాలా మంచిది. మాటలను, చేతలను తగ్గించి, మనస్సును సాధ్యమైనంత ప్రశాంతముగా, స్థిరముగ ఉంచుకొనవలెను. తద్వారా బుద్ధిపై వెలుగు ప్రసరణ జరుగుతుంది. ప్రశాంతమైన మనస్సు వలన, సూర్యుని వెలుగు పరావర్తనము చెంది చంద్రుని వెలుగుగా సప్త ధాతువుల శరీరముపై ప్రసరిస్తుంది. తద్వారా పూర్ణిమ, అమావాస్య యొక్క మాహాత్మ్యమును అనుభూతి చెందవచ్చు.

మేషము 2024 - మీనము 2025 వరకు పూర్ణిమ మరియు అమావాస్య ధ్యానముల విధానము


Download ధ్యానము యొక్క PDF
శరవణభవాయ మంత్రం ఆడియో (MP3, 5.0 MB)
Download/వినండి ఎక్కిరాల కులాంబోధి (MP3, 0.8 MB)

పూర్ణిమ, అమావాస్యలు మానవ ప్రజ్ఞలో రెండు ముఖ్యమైన సమయములు. నిజమునకు భూమిమీది జీవుల యొక్క మానసిక కార్యకలాపములకు చంద్ర గమనము కారణమై ఉన్నది.

నీలో ధ్యానము జరుగుటకు అమావాస్య, పూర్ణిమ దినములు చాలా మంచివి. బయట, లోపల ఉన్న ఉన్నతమైన శక్తి తరంగములతో అనుసంధానము చెందుటకు ఈ రోజులు ఉత్తమమైనవి.

పూర్ణిమ, అమావాస్య ధ్యానముల తేదీల వివరముల కొరకు Astrological Calendar (English) చూడగలరు.


ప్రార్థన
Iఓం - ఓం - ఓం - ఓం - ఓం - ఓం - ఓం

గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః
గురుస్సాక్షా త్పరంబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః
IIనమస్కారమ్స్ మాస్టర్
నమస్కారమ్స్ మాస్టర్ కె.పి.కె.
నమస్కారమ్స్ మాస్టర్ ఇ.కె.
నమస్కారమ్స్ మాస్టర్ యం.యన్.
నమస్కారమ్స్ మాస్టర్ సి.వి.వి.
నమస్కారమ్స్ మాస్టర్ సి.వి.వి.
నమస్కారమ్స్ మాస్టర్ సి.వి.వి. టు యువర్ లోటస్ ఫీట్

(15 నిమిషములు మౌనము వహించి, అంతరంగములో ఏమి జరుగుచున్నదో గమనింపుము.)
III(ఈ క్రింది ప్రార్థనను మూడు సార్లు ఉచ్చరించి ధ్యానము చేయవలెను:)

వేనుడను గంధర్వరాజు తన సప్తతంతు వైన వీణ నుండి సప్త సంకేతములుగ గాంధర్వ శబ్దములను గావించుచు చిత్తము నంటి పెట్టుకొని వున్న కర్మవాసనల సమస్తమును తుడిచివేయు చున్నాడు.

కాల సర్పము తన పొలుసులను వదులు చేయుచున్నది. పూర్వ కర్మపు వాసనలుగ నున్న పొలుసు వలువబడు చున్నది. కర్మము పరిష్కరింపబడినది.
IVఓం శరవణభవాయ నమః (18మార్లు)

Vలోకా స్సమస్తా స్సుఖినో భవంతు (3 సార్లు)
ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః
VIఎక్కిరాల కులాంబోధి విధుమానంద రూపిణం
అనంతార్య తనూజాతం కృష్ణంవందే జగద్గురుం
శ్రీకృష్ణమాచార్యమనంత పుత్రం
సత్సాధుమిత్రం కరుణార్ద్రనేత్రం
గురుం గురూణాం పితరం పిత్రూణాం
అనన్యశేష శ్శరణం ప్రపద్యే