{"timeout":"7000","width":"990"}
  • శబ్దము యొక్క శక్తి
  • ఛందము మరియు క్రతువు
  • నిశ్శబ్దమును వినుట

శబ్దము యొక్క శక్తి

శాంతి కొరకు ప్రదర్శనలు చేయుట కన్నా, బృందములుగా ఓంకార నాదోచ్చారణ చేయుట వలన సూక్ష్మ లోకముల పై మంచి ప్రభావము కలిగి ప్రపంచ శాంతి సిద్ధించును.

ఛందము మరియు క్రతువు

అన్నిలయాత్మక కార్యములు మరియూ క్రతువులూ మన శరీరధాతువులలో సహజముగా మార్పులు తీసుకువచ్చుటే లక్ష్యముగా చేసుకొని, మనము త్వరితగతిన అభివృద్ధి చెందడానికి తోడ్పడతాయి.

నిశ్శబ్దమును వినుట

నిశ్శబ్దమును విన్నప్పుడు మనకి ఝంకార నాదము వినిపిస్తుంది. ఇది హృదయ కేంద్రములో వినిపించే నిశ్శబ్దము యొక్క స్వరము మరియూ నిశ్శబ్దమైన ధ్వని.

స్వస్థత చేకూర్చుటకు ధ్యానము

సాధన

నీలి రంగు పుస్తకము

ఆకాశ నీలము రంగు పుస్తకమును దగ్గర ఉంచుకొని, రోగి యొక్క పేరు, తేదీ, మరియు వ్యాధి యొక్క వివరములు వ్రాసుకొనవలెను. ఎప్పుడైనా మనకు తెలియని వారైనప్పటికిని, ఎవరైనా ఎదైనా అనారోగ్యముతో ఉన్నట్లు తెలిసినచో, ఆ వివరములు వెంటనే వ్రాసి పెట్టుకొనవలెను. కనుక ఈ ధ్యానము చేయువారు తప్పక ఒక పుస్తకమును దగ్గర ఉంచుకొనవలెను.

  1. శరీరమును, పరిసరములను శుచిగా ఉంచుకొని, ప్రతిదినము రాత్రి నిద్రపోవుటకు ముందు ఈ ప్రార్థన చేయవలెను.
  2. నిద్రా సమయమున గదిలో ఒక అగరువత్తి వెలిగించుకొని, తక్కువ వెలుతురు గల దీపమును ఉంచుకొనవలెను.
  3. ఆ రోజున మనకు తారసపడిన వ్యాధిగ్రస్తులను మానసికముగా తలచుకొని, వారి స్వస్థత కొరకు ఈ ప్రార్థనను రాత్రి సమయమున ఉచ్చరించవలెను.
  4. మనలను మాస్టరుగారికి సమర్పణ చేసుకొని, నిద్రలోనికి పోవు సమయమున “నేను నా భౌతిక దేహము నుండి, లింగ దేహము నుండి,ఇంద్రియములనుండి, మనస్సు నుండి లోపలకు మరలి విశ్వాత్మలో కరుగుచున్నాను” అని ఉచ్చరించవలెను.
  5. సాధ్యమైనంతవరకు అస్వస్థతతో బాధపడువారిని కలసి వచ్చుచుండవలెను. కాలానుకూలత కలిగినపుడు అటువంటి వారిని కలవటానికి నిరాకరించరాదు.

ప్రతి వ్యాధిగ్రస్తునికి వారానికొకసారి తప్పక ఈ స్వస్థత ధ్యానము చేయవలెను. గురువారము కాని, ఏకాదశి రోజున కాని చేయవచ్చును.

లఘు ప్రార్థనగా మాస్టరుగారికి ప్రార్థన చేసి, తరువాత రోగికి స్వస్థత చేకూరవలెనని మాస్టరుగారిని ప్రార్థించవలెను.

స్వస్థత ధ్యానము - పూర్తి పాఠము

మాస్టరుగారికి ప్రార్థన

Master please let us receive the influx of Thy Plenty of prana into our systems,
so that we may resist disease, decay and death,
realise the Highest Truth, the Pure Love and the Bliss of Existence
and serve humanity according to Thy Plan.

Master CVV Namaskarams

రోగి కొరకు ప్రార్థన

Master please rectify and develop the system of the patients
to whom I (we) offer the prayer.

“ఓం నమో నారాయణాయ” మంత్ర ధ్యానము (5 సార్లు)

మనచుట్టూ ఒక నీలివర్ణపు గోళమును నిర్మించుకొనవలెను
పైనుండి
క్రిందకు
12 సార్లు పైనుండి
క్రిందకు
కనుబొమ్మలు, నుదురు, తల పై భాగము
కనుబొమ్మలు, దవడ ముందు భాగం వరకు
మెడ, గొంతుక, భుజములు, చేతులు
శ్వాస నాళము, అన్నవాహిక, ఊపిరితిత్తులు, గుండె
ఉదరవితానము
పొట్ట నుండి నాభి వరకు
నాభి, మణిపూరకము
పొట్ట క్రింది భాగము, మర్మావయవములు
కటి వలయము, తొడలు నుండి మోకాళ్ళవరకు
మోకాళ్ళు
పిక్కలు, చీలమండలు
పాదములు
12 సార్లు క్రింది నుండి
పైకి
12 సార్లు
మొత్తము 36 సార్లు
ఈ క్రింద చెప్పినవి హృదయ పద్మము నుండి మొదలు పెట్టవలెను: పైనుండి
క్రిందకు
8 సార్లు పైనుండి
క్రిందకు
హృదయ (అనాహత) పద్మము (హృదయము మరియు విశుద్ధి కేంద్రముల మద్య)
సహస్రార కేంద్రము
ఆజ్ఞా కేంద్రము
విశుద్ధి కేంద్రము
అనాహత కేంద్రము
మణిపూరక కేంద్రము
స్వాధిష్ఠాన కేంద్రము
మూలాధార కేంద్రము
8 సార్లు క్రింది నుండి
పైకి
8 సార్లు
మొత్తము కలిపి 24 సార్లు
కుడి మరియు ఎడమ కన్ను ప్రతిదానికి 1 సారి 7 సార్లు
కుడి మరియు ఎడమ చెవి ప్రతిదానికి 1 సారి
కుడి మరియు ఎడమ నాసిక ప్రతిదానికి 1 సారి
నోరు 1 సారి
కుడి భుజము మణికట్టువరకు 1 సారి 6 సార్లు
5 వ్రేళ్ళు (బొటన వ్రేలు నుండి మొదలు) ప్రతిదానికి 1 సారి
ఎడమ భుజము మణికట్టు వరకు 1 సారి 6 సార్లు
5 వ్రేళ్ళు (బొటన వ్రేలు నుండి మొదలు) ప్రతిదానికి 1 సారి
కుడి కాలు చీలమండ వరకు మరియు 5 వ్రేళ్ళు ప్రతిదానికి 1 సారి 6 సార్లు
ఎడమ కాలు చీలమండ వరకు మరియు 5 వ్రేళ్ళు ప్రతిదానికి 1 సారి 6 సార్లు
పంచభూతములు (భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము) ప్రతిదానికి 1 సారి 5 సార్లు
పంచ జ్ఞానేంద్రియములు (కన్ను,చెవి,ముక్కు,నోరు,చర్మము) ప్రతిదానికి 1 సారి 5 సార్లు
పంచ కర్మేంద్రియములు (చేతులు, కాళ్ళు, నాలుక, మలద్వారము, మూత్రద్వారము) ప్రతిదానికి 1 సారి 5 సార్లు
పంచేంద్రియములు (చూచుట, వినుట, వాసన చూచుట, రుచి, స్పర్శ) ప్రతిదానికి 1 సారి 5 సార్లు
చతుర్వ్యూహములు
(తానుగా ఉండుట,
తానున్నానని ఎరుక కలిగి ఉండుట,
భావములు కలిగి ఉండుట,
క్రియ యందు ఉండుట)
ప్రతిదానికి 1 సారి 4 సార్లు
హృదయ పద్మము నందు 4 సార్లు 4 సార్లు
ఓం నమో నారాయణాయ మంత్ర జపము మొత్తము 124 సార్లు


శాంతి మరియు స్వస్థత ప్రార్థన


Download/వినండి ఓం తచ్ఛం యో మంత్రము (MP3, 781 KB)

ఓం తచ్ఛం యోరావృణీమహే
గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే
దైవీ స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః
ఊర్ధ్వం జిగాతు భేషజమ్
శం నో అస్తు ద్విపదే
శం చతుష్పదే
ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః

వివరణ:
ఓ పరమాత్మా! యజ్ఞ కార్యములలో యజ్ఞపతివైన నీ దివ్య వైభవమును కీర్తించగలిగేటట్లు, మాకు సంప్రాప్తించిన కష్టనష్టములు తొలగిపోయేటట్లు చేయమని ప్రార్థించుచున్నాము. సర్వుల క్షేమమును కాంక్షిస్తూ నిన్ను ప్రార్థిస్తున్నాము. ద్విపదులైన మానవులందరూ సుఖ, శాంతులతో జీవించుదురు గాక! చతుష్పాదులైన మా పశువులు క్షేమముగా ఉండుగాక! మాకు ఆధిభౌతిక, ఆధిదైవిక, ఆధ్యాత్మిక తాపత్రయ శాంతి లభించుగాక!