{"timeout":"7000","width":"990"}
  • శబ్దము యొక్క శక్తి
  • ఛందము మరియు క్రతువు
  • నిశ్శబ్దమును వినుట

శబ్దము యొక్క శక్తి

శాంతి కొరకు ప్రదర్శనలు చేయుట కన్నా, బృందములుగా ఓంకార నాదోచ్చారణ చేయుట వలన సూక్ష్మ లోకముల పై మంచి ప్రభావము కలిగి ప్రపంచ శాంతి సిద్ధించును.

ఛందము మరియు క్రతువు

అన్నిలయాత్మక కార్యములు మరియూ క్రతువులూ మన శరీరధాతువులలో సహజముగా మార్పులు తీసుకువచ్చుటే లక్ష్యముగా చేసుకొని, మనము త్వరితగతిన అభివృద్ధి చెందడానికి తోడ్పడతాయి.

నిశ్శబ్దమును వినుట

నిశ్శబ్దమును విన్నప్పుడు మనకి ఝంకార నాదము వినిపిస్తుంది. ఇది హృదయ కేంద్రములో వినిపించే నిశ్శబ్దము యొక్క స్వరము మరియూ నిశ్శబ్దమైన ధ్వని.

విఘ్నములను అధిగమించుట

ధ్యానము అనుభూతి

ఆత్మ ప్రకాశమును అనుభూతి పొందవలెనని ప్రతి ఒక్కరు కోరుకొందురు -
శాంతి, ప్రేమ, వికాసము, అంతరంగ స్పష్టత, సామరస్యము, జ్ఞానవృద్ధి …

కాని, తరచుగా మొదట …
అస్పష్టత, అలసట, నిద్ర,
ఆవేశములు పొంగుట,
ఆలోచనల దాగుడుమూతలు,
అవరోధింపబడిన శక్తి ప్రవాహము

అంతరంగము నందు దర్శింపలేని వెలుగు…

ఎందుకు?

ఆత్మ మరియు స్వభావము

స్వతస్సిద్ధముగా మనము ఆత్మ స్వరూపులము. అనుభూతి కొరకు ప్రతిదినము మనము - మనస్సు, ఇంద్రియములు మరియు భౌతిక ప్రపంచములోనికి దిగుచున్నాము. ఆత్మ స్వరూపులమై మన స్వభావము లేక వ్యక్తిత్వము ద్వారా బయటి ప్రపంచములోనికి ప్రకటిత మవుచున్నాము. అందువలన మన ఉనికి యొక్క ఎరుకను త్వరగా మరచిపోగలము. మనల్ని మనము మరచి, మనము ఏది కాదో దానిలోనికి కోల్పోబడతాము. ఆ స్థితిలో చాలా కాలము చిక్కుబడతాము. ఏ విధముగా దుమ్ము లేక మసిచే కప్పబడిన గాజు దీపపు కాంతిని బయటకు ప్రసరించనీయదో, ఆ విధముగా మనము అనేక మందపు పొరలచే కప్పబడి ఉండుటచే ఆత్మ కాంతి ప్రకాశింపదు.

ఆత్మ

ఆత్మ, అసలైన “నేను” బయట ఉండదు. వ్యక్తిత్వము లేక స్వభావము నందు జీవించువారికి, ఆత్మ బయట ఎక్కడో దూరముగా ఉన్నట్లుగా అనిపించును. ఆత్మ మన మనస్సు కంటే చాలా పెద్దది, కేవలము కొంత భాగము మాత్రమే భౌతిక రూపముతో జీవించును. ప్రధానమైన సాధన ఏమనగా, నిరంతరము మన మనస్సుకు మనము ఆత్మ స్వరూపులమని గుర్తుచేయుట, అన్నిటియందు ఆత్మ స్వరూపమును గ్రహించుట, ఆత్మ స్వరూపులుగా పనిచేయుట.

ఆత్మ మరియు స్వభావము

ఆత్మను, శరీర స్పృహ మరుగు పరచుటవలన, మనము మన శరీరమునందు ఖైదు చేయబడుదుము. వ్యక్తుల శరీరము, ఇంద్రియములు, ప్రవర్తన మరియు స్వభావములచే వారి ఆహారపు అలవాట్లు, మాటలాడుట, చూచుట, వినుట మొదలగునవి ప్రభావితము చేయబడును. దానివలన వారి ప్రవర్తనలో సమతుల్యత లోపించును. తినుట, త్రాగుట, ధన సంపాదన, సెలవు దినములు, ఆటలు మరియు కామమును అనుభవించుట మాత్రమే కాక ఇంకా ఎంతో విలువైన జీవితము కలదని ఆత్మ తలచుచుండును. స్వభావము యొక్క తరహాను మార్చి, ఆత్మానుభూతి పొందుటకు అంతరంగమునకు, బయటి అవరోధములకు ఎంతో ఘర్షణ జరుగును. ఒక స్నేహపూరితమైన సంబంధమును ఆత్మ, మనస్సు మరియు శరీరముల మధ్య కల్పించుకొన వలెను. స్నేహభావము సానుకూల్యతకు పునాది.

మనస్సు - బుద్ధి

మనస్సును ఉన్నత స్థితికైనను లేక అథోస్థితి కైనను మళ్ళింపవచ్చును. ఉన్నత స్థితిలో మనస్సును బుద్ధి అనియు, దిగువ స్థితిలో దానిని మనస్సు అనియు అందురు. మనస్సు పనులు నిర్వహించగలదు, బుద్ధి అన్నిటిని అవలీలగా ఆకళింపు చేసుకొనగలిగి ఉంటుంది. మనస్సు చురుకుగా బయట నిమగ్నమై ఉంటే ఉన్నతమైన స్ఫూర్తిని పొందలేదు. మనస్సు ప్రశాంతముగా ఉన్నచో, బుద్ధి యొక్క వెలుగు మనస్సను అద్దముపై ప్రతిబింబించ గలదు. మనస్సను పరికరము ఎంత శుభ్రముగా ఉంటే, అంతగా ఆత్మ యొక్క వెలుగు దానిపై ప్రతిబింబించగలదు. ఆత్మ వెలుగు శరీరము ద్వారా వెలుగొందినచో, అతడు ప్రకాశవంతుడై ఆకర్షణీయత కలిగి ఉండును. అతడు పరిసరములను ప్రభావితము చేయుచూ, వాటిచే ప్రభావితము కాడు.

అవరోధములు

బాహ్యజీవితము నందు సరియైన సర్దుబాట్లు చేసుకొనలేనిచో, ధ్యానము కుదరదు. అది ఒక భావనగా ఉండిపోవును. దురలవాట్లతో కూడి ఉన్నవానికి ధ్యానముతో అనుసంధానము కుదరదు, ముఖ్యముగా త్రాగుడు, మాదక ద్రవ్యముల అలవాటు. చాలామంది క్రమమైన వ్యాయామము లేక ఉందురు, ఎందుకనగా వారి జీవన విధానమే ఆటంకము. జీవితమున మన బాధ్యతలు, ధర్మములు సక్రమముగా నిర్వర్తించుచున్నచో, మనము మన జీవితమును సరియైన మార్గములో క్రమబద్ధీకరించుకొని అంతర్ముఖమవుటకు వీలగును. ఊర్థ్వలోకపు తరంగములను అందుకొనుటకు మనము మన జీవితమును చక్కని లయతో క్రమబద్ధీకరించుకొని, చాలా కాలము సాధన చేయవలెను.

మార్గమున 10 అవరోధములు

  1. అనారోగ్యము
  2. అశ్రద్ధ
  3. సంశయము లేక సంశయాత్మక బుద్ధి
  4. పొరపాట్లు - పద్ధతులను సరిగా అర్థము చేసుకోని కారణముగా - అతి వేగము లేక అతి నిదానమైన క్రియ
  5. శారీరక జడత్వము - బద్ధకము
  6. భోగలాలసత్వము
  7. మాయ వలన మళ్ళింపు మరియు ఆత్మవంచన
  8. దృఢ సంకల్పము లేకపోవుట
  9. అనేక ప్రణాళికలు లేక ఆలోచనల వల్ల ఏకాగ్రత లేకపోవుట
  10. పై చెప్పిన వాటివల్ల నిరాశ లేక నిరుత్సాహము.

ఒక అధిగమించలేని పర్వతము?

ప్రతి అవరోధమునకు పరిష్కారము కలదు. సూక్ష్మాతి సూక్ష్మముగా మనస్సు పొరలలో పేరుకుపోయిన వాటిని, ఆధ్యాత్మిక సాధనముల సహాయమున వాటి మూలాలను, విచారణ ద్వారా మరియు చేయు పనుల యందలి పొరపాట్లను చక్కదిద్దుకొనుట ద్వారా, తగు వ్యాయామము, ధ్యానము, ప్రార్థన, శబ్దము, రంగు మరియు సద్భావములతో కూడిన కార్యకలాపములు మొదలగు వాటితో అవరోధములను మన నుండి తొలగించి ఆత్మకు బలము చేకూర్చుకొన వచ్చును.

మార్గము

ఆధ్యాత్మిక సాధనా మార్గములన్నియు సాధన మొదలు పెట్టినప్పుడు చాలా చిన్నవిగాను, సాధారణముగాను అనిపించును. కానీ, మన జీవన విధానమును సరిదిద్దుకుంటూ ముందుకు సాగినచో కొంచెము కొంచెముగా మరికొన్ని ఇవ్వబడును. ఈ కార్యక్రమము మన స్వభావము నందు మార్పు వచ్చునంతవరకు జరుగును. వెలుగులోనికి ఈ విధమైన మార్పు క్రమ క్రమముగా జరుగుటకు ఎక్కువ కాలము మరియు సహనము కావలెను. ఈ మార్గమున శీఘ్రత ఉండదు, 5 నిమిషములలో జ్ఞానోదయము, వికాసము కలుగదు.

కేంద్రము చేరుటకు సూచనలు

  • నిత్యము అంతర్ముఖమై, ఆత్మతో అనుసంధానము చెందవలెను.
  • నిత్యము సద్గ్రంథములను పఠించవలెను.
  • నిత్యము ఇతరుల శ్రేయస్సుకొరకు కార్యకలాపములు చేయుచుండవలెను.