{"timeout":"7000","width":"990"}
  • శబ్దము యొక్క శక్తి
  • ఛందము మరియు క్రతువు
  • నిశ్శబ్దమును వినుట

శబ్దము యొక్క శక్తి

శాంతి కొరకు ప్రదర్శనలు చేయుట కన్నా, బృందములుగా ఓంకార నాదోచ్చారణ చేయుట వలన సూక్ష్మ లోకముల పై మంచి ప్రభావము కలిగి ప్రపంచ శాంతి సిద్ధించును.

ఛందము మరియు క్రతువు

అన్నిలయాత్మక కార్యములు మరియూ క్రతువులూ మన శరీరధాతువులలో సహజముగా మార్పులు తీసుకువచ్చుటే లక్ష్యముగా చేసుకొని, మనము త్వరితగతిన అభివృద్ధి చెందడానికి తోడ్పడతాయి.

నిశ్శబ్దమును వినుట

నిశ్శబ్దమును విన్నప్పుడు మనకి ఝంకార నాదము వినిపిస్తుంది. ఇది హృదయ కేంద్రములో వినిపించే నిశ్శబ్దము యొక్క స్వరము మరియూ నిశ్శబ్దమైన ధ్వని.

క్రతువులు

“ధ్యానము చేయునది కాదు, జరుగునది.”

ధ్యానములు, క్రతువులు
గణపతి పూజ గురించి వివరములు
పుస్తకము: Book of Rituals (English)

అగ్ని ఆరాధన (హోమము)

అగ్నియే సృష్టికి కారణమై ఉన్నది. అగ్ని అనగా అన్నిటికిని ముందు ఉన్నది అని అర్థము. ఇది విశ్వమంతా వ్యాపించి సత్యమునకు వాహికయై ఉన్నది. అగ్ని లేనిదే ప్రాణము లేదు. అగ్నియే సృష్టి, స్థితి మరియు లయ కారకమై ఉన్నది. అగ్ని, విశ్వమందలి శక్తి తరంగములను పవిత్రము చేసి తీసుకురాగలదు.

మనయందలి శక్తి వ్యవస్థ యందు విశేషమైన అభివృద్ధిని పొందుటకు అగ్ని ఆరాధన ఎంతగానో ఉపయోగ పడుతుంది. అందువలన సమాజములో మంచి పనులకు ఉపయోగపడే విధముగా తయారగుట జరుగుతుంది. మన మనస్సులోని మలినములను, లోతుగా పేరుకుపోయిన అవలక్షణములను దగ్ధముచేయుటకు అగ్ని ఆరాధన ఎంతో ఉపయోగకరము. ఇది మన పూర్వకర్మను దగ్ధముచేసి వెలుగు మార్గములో పయనించుటకు మార్గమును సుగమము చేయును. మాయయొక్క ప్రలోభములో తిరిగి పడకుండా నిరోధించును.

హోమము గురించి వివరములు
లఘు హోమము (English)

హోమము

గణపతి పూజ

దైవీ తత్త్వములన్నియు ఒకచోట కేంద్రీకృతమైన తత్త్వమును గణపతి అందురు.

గణపతి అనుగ్రహించినచో మన భావము, భాష మరియు ప్రవర్తన సరళీకృతమగును.

గణపతి పూజ

రుద్రాభిషేకము

మన ప్రాచీన శాస్త్రముల ప్రకారము సూక్ష్మలోకమందలి జీవము భౌతికలోకములో నీరుగా వ్యక్తమయినది. నీరు ప్రాణశక్తిని సూచించును. అభిషేకము యొక్క ముఖ్య ఉద్దేశ్యము ఏమనగా అదృశ్య లోకములలో ఉన్న విద్యుచ్ఛక్తిని దృశ్య లోకములలోనికి వ్యక్తపరచుట.

సూక్ష్మస్పందనలకు అధిపతి, దేవతలందరికంటే ప్రప్రధముడు అయిన రుద్రుడు, చీకటికి ఆవల ఉన్న వెలుగును స్థూలలోకములోనికి కనిపించే వెలుగుగా వ్యక్తపరచును. చీకట్లను పారద్రోలి, జీవుల అనుభవమునకు చీకటికి ఆవల ఉన్న వెలుగును స్థూలమునకు కొనివచ్చు దైవము రుద్రుడు.

రుద్రాభిషేకము గురించి వివరములు



రుద్రాభిషేకము

వివాహ సంస్కారము

వివాహ సంస్కారము ద్వారా ఆత్మ పరిశుద్ధమయి, పరివర్తన చెందుట సులభమగును. అంతేగాక ముఖ్యముగా, స్త్రీ-పురుష శక్తుల మధ్య సమతుల్యత సాధించుటకు ఈ సంస్కారము చాలా అవసరము. ఈ సంస్కారము మనిషిని పవిత్రీకరించుటకు ఒక సాధనము. సంస్కారము ఒక నిర్దేశిత మార్గమును సూచించును. దానిని విధి విధానములతో అనుసరించిన మనుషులు తమలో అవసరమైన పరివర్తన సాధించగలరు.

వివాహ సంస్కారము యొక్క ముఖ్య ఉద్దేశ్యము స్త్రీ-పురుష శక్తుల మధ్య సమన్వయము సాధించుట. తద్వారా ఆ స్త్రీ, పురుషులు తమ జీవితమున అన్ని దశల యందు ప్రేమను అనుభూతి చెందగలరు. ఒక జంట భౌతిక, భావమయ, మానసిక, బుద్ధిమయ, మరియూ ఆనందమయ కోశములందు ఏకత్వము సాధించినచో వారు ఒకటవుదురు. అనగా, ఎక్కడ పరిపక్వత అవసరమో అక్కడ ఒకరు ఇంకొకరిని తమలోకి స్వీకరింతురు.

వివాహ సంస్కారము గురించి వివరములు

వివాహ సంస్కారము