{"timeout":"7000","width":"990"}
  • మన పుస్తకములు
  • వైశాఖ మాసపత్రిక

మన పుస్తకములు

ఆధ్యాత్మికత మరియు గూడార్థము గల అన్ని పుస్తకములు మనము చదువనక్కరలేదు. మనలను తరింపజేయడానికి సత్యమునెరిగిన వారి బోధనలు చాలును.

వైశాఖ మాసపత్రిక

వైశాఖ మాసపత్రిక పరమగురువులు అందించిన బోధనలను మూలసూత్రముల ద్వారా అందిస్తుంది.

తెలుగు ప్రచురణలు

మానవులను నడిపించుచున్న వెలుగే గురువు. ఒకే వెలుగు దేశదేశములలో అన్ని కాలములలో వివిధ రూపములలో దిగివచ్చి జీవులను వెలుగుబాటలో నడిపించుచుండును. అట్టి జగద్గురువు (వరల్డ్ టీచర్) పేరుతో స్థాపించబడిన ఒక ఆధ్యాత్మిక సేవా సంస్థ జగద్గురు పీఠము (ది వరల్డ్ టీచర్ ట్రస్ట్). ఆధ్యాత్మికత ఏ మతమునకు సంబంధించినది కాక, అన్నిమతములలోని ఆచరణీయతకు సంబంధించినది. కావున సర్వ మతములు సమ్మతములే. జగద్గురు పీఠము, విశాఖపట్నము అంతర్జాతీయ కేంద్రముగా, ప్రపంచములోని దేశదేశములలో పనిచేయుచున్నది.

జగద్గురు పీఠము ఒక ఆధ్యాత్మిక సేవా సంస్థ. జగద్గురు పీఠము సంస్థ డా. ఎక్కిరాల కృష్ణమాచార్య గారు (మాస్టర్ ఇ. కె.) మరియు డా. కె. పార్వతీకుమార్ (మాస్టర్ కె. పి. కె) గారు అందించిన జ్ఞానముతో ప్రత్యేకముగా స్ఫూర్తి పొందినది. వారి బోధనలు ప్రాక్-పశ్చిమములలోని జిజ్ఞాసువులను ప్రచోదనము గావించుచున్నాయి. డా. ఎక్కిరాల కృష్ణమాచార్య గారు మరియు డా. కె. పార్వతీకుమార్ గారు ద్వారా వెలువడిన కొన్ని తెలుగు ప్రచురణలు ఇక్కడ పిడిఎఫ్ (PDF) ఫార్మాట్లో ఇవ్వబడినవి.

మరిన్నివివరాలకు email ద్వారా సంప్రదించండి.

డా. ఎక్కిరాల కృష్ణమాచార్య గారి నుండి వెలువడిన తెలుగు ప్రచురణలు

డా. కె. పార్వతీకుమార్ గారి నుండి వెలువడిన తెలుగు ప్రచురణలు

పరిచయము

ధ్యానములు మరియు పూజల అవగాహన

జ్ఞాన బోధనలు

పరమ గురువుల బోధనలు

ఇతర తెలుగు ప్రచురణలు