{"timeout":"7000","width":"990"}
  • సుహృద్భావ సంబంధము
  • సరళత్వము మరియూ నిశ్శబ్దము యందుండి సేవ చేయాలి
  • సేవ యందు అభిలాష
  • బృందములకు సేవ

సుహృద్భావ సంబంధము

ఇతరుల అవసరములను గుర్తించి సహాయము అందించడమే, సుహృద్భావ సంబంధము ఏర్పరచుకొనుటకు ఆధారము.

సరళత్వము మరియూ నిశ్శబ్దము యందుండి సేవ చేయాలి

మనము, ఫలితము కోరని ఏదో ఒక సేవ, సరళత్వము మరియూ నిశ్శబ్దము యందుండి చేయాలి. దాని వలన ఆనందము కలగడమే కాక వ్యక్తిగత కర్మయందు గల ఋణముల నుంచి విముక్తి కలుగుతుంది.

సేవ యందు అభిలాష

అన్ని వేళలా సేవ చేయుటకు ఇచ్ఛ కలిగి, సేవ చెయ్యడానికి తగు అవకాశములను గమనించుకుంటూ ఉండడమనే వైఖరి నే సత్సంకల్పమందురు.

బృందములకు సేవ

బృందమునకు మనము ఏమి చేశాము అన్నది ఒక్కటే సేవకి కొలమానము. మన ఇంటి దగ్గర లేక మనము పని చేసే దగ్గర సహజ బృందములు వాటంతట అవే తయారవుతాయి. 'బృందము' అను పదమును మనము సంకుచితముగా నిర్వచించరాదు.

ధనిష్ఠ సంస్థ

“సేవలో మేము ఆనందించెదము”

ధనిష్ఠ సంస్థ యొక్క వెబ్సైటు
2020-21 ధనిష్ఠ వార్షిక నివేదిక (2.3 MB)
ధనిష్ఠ సంస్థను సంప్రదించుట
సేవ | సేవా కార్యక్రమములు
భారత దేశమున జగద్గురు పీఠము బృందములు | హోమియో మరియు వైద్య సేవలు

“ధనపూరిత వాయువు”

ధనిష్ఠ అనగా ధనపూరిత వాయువు.  జీవితము నందలి పరిపూర్ణత్వమును ధనముగా చూడవలెను  కానీ డబ్బుగా కాదు.  పరిశుద్ధమైన  గాలి, నీరు, జీవించు పరిస్థితులు, ఆరోగ్యకరమైన ఆహారము, చక్కని దుస్తులు, మరియు సరియైన విద్య మొదలగు వాటిని ఐశ్వర్యముగా భావించవలెను.  పేదలను సేవించి, వారికి ఆత్మస్థైర్యము నందించి, తమపై  తాము ఆధారపడి బాధ్యతాయుతమైన జీవితము గడుపు మానవులుగా తయారుచేయుటకు ఇటువంటి అవసరములను వారికి అందించు యత్నము చేయవలెను.  ధనిష్ఠ దానికి సంబంధించిన వారికి చక్కని జీవితమును  గడుపుటకు కావలసిన అన్ని సేవలను అందించును.

ధనిష్ఠ అను సంస్థ 1992 జులైలో డా.|| కె. పార్వతీకుమార్ గారిచే ప్రారంభించబడినది.  మొదటగా దీనినుండి ఆయన బోధనలు, రచనలు ప్రచురించబడినవి.  తరువాత అది పూర్తి స్థాయిలో ఒక స్వచ్ఛంద సేవా సంస్థగా రూపొందినది.  దీని ప్రధాన ఉద్దేశ్యమేమనగా బలహీనులకు, అర్హత కలవారికి అన్నివిధముల సహాయము మరియు విద్యను అందించుచు వారికి ఉన్నతమైన జీవన విధానమునకు కావలసిన మార్గము చూపించుట.

ధనిష్ఠ సంస్థ దానిని నడిపించు మార్గదర్శకులకు, దాతలకు మరియు ప్రభుత్వ అధికారులకు జవాబుదారియై యున్నది.  దేశ, విదేశములనుండి అందు విరాళములకు ధనిష్ఠకు పన్ను మినహాయింపు కలదు. చట్టము యొక్క పరిధిలో  ఈ సంస్థ చాలా వేగముగా పనిచేయుచున్నది.

Food distribution

ధార్మిక కార్యక్రమములు

వృద్ధులకు, పిల్లలకు కావలసిన సహాయము మరియు అన్నదానము వంటి అనేక సేవా కార్యక్రములను ధనిష్ఠ చేపట్టి నిరాటంకముగా చేయుచున్నది.

  • Hidden Sprouts మానసిక వికలాంగుల పాఠశాల యందు అన్నదానము మరియు దుస్తులను అందించుట

ప్రతి సోమవారము 100 మంది విద్యార్థులకు మధ్యాహ్న ఆహారము మరియు కాపలావాని నియామకము మొదలగునవి ధనిష్ఠచే అందించబడినవి.  మరియు ఆర్థికముగా వెనుకబడిన పిల్లలకు దుస్తుల పంపిణీ జరిగినది.

Clothes distribution at Hidden Sprouts

  • మచిలీపట్నము లోని చిలకలపూడిలో అన్నదానము

పౌర్ణమి రోజున పాండురంగ స్వామి ఆలయము వద్ద 150 మంది పేదలను ఆహారము అందించబడినది.

  • విశాఖపట్టణము నందలి కాళికాదేవి ఆలయము వద్ద అన్నదానము

ప్రతి అమావాస్యనాడు విశాఖపట్టణములోని కాళీ/భవతరణి ఆలయము వద్ద 100 మందికి ఆహారము అందించబడుచున్నది.

  • విశాఖపట్టణము, మధురవాడలోని వేద పాఠశాలలో అన్నదానము

5 నుండి 18 సం||లు గల 80 మంది విద్యార్థులున్న వేద పాఠశాలకు మాసమునకు కావలసిన ఆహార పదార్థములను ప్రతి మాసములో ధనిష్ఠ అందించుచున్నది.   వేదము నేర్చుకొనవలెనని జిజ్ఞాస కలిగి, ఆర్థికముగా వెనకబడిన పిల్లలకు సహాయము చేయుటయే దీని ముఖ్యోద్దేశ్యము.

Food distribution

  • విశాఖపట్టణము, సౌదామినీ భవనములోని యోగ గణపతి ఆలయములో అన్నదానము

గణేశ చతుర్థి సందర్భముగా ఆలయ ప్రాంగణములో 150 మందికి అన్నదానము జరిగినది.

  • మర్రిపూడి గ్రామములోని అమరేశ్వరస్వామి దేవాలయములో అన్నదానము

ఆలయ ప్రాంగణములో ప్రతి శనివారము రోజున 150 మంది పేదలకు  అన్నదానము జరుగుచున్నది.

  • కృష్ణానది పుష్కరములలో అన్నదానము

కృష్ణానది పుష్కరములు ప్రతి 12 సంవత్సరములకు ఒకసారి బృహస్పతి కన్యారాశిలోని ప్రవేశించిన రోజునుండి 12 రోజుల పాటు  జరుగును.  ధనిష్ఠ ఈ 12 రోజులలో దాదాపు 8000 మందికి పైన అన్నదానము చేయుచున్నది.

Food distribution

వృద్ధులకు సహాయము

సద్గురు సేవాశ్రమము, భీమిలి మరియు సెయింట్ జోసెఫ్ హాస్పటల్ వారిచే నడుపబడుతున్న వృద్ధాశ్రమములకు కావలసిన సహాయము ధనిష్ఠచే అందించ బడుచున్నది.  నిత్యావసరములకు కావలసిన  పాత్రలు, వంటకు గ్యాస్, ఆహార ధాన్యములు మరియు ఇతర అవసరములకు కావలసిన విరాళములను సంవత్సరమంతా అందించుచున్నది.

  • పొన్నూరులోని  వృద్ధులకు, అనాథలకు సహాయము నందించుట

అమ్మ సేవా నిలయము అనునది వృద్ధులకు  మరియు అనాథలకు  శరణాలయము.   ప్రతినెలా ధనిష్ఠ సేవా సంస్థ దానికి కావలసిన ఆహార పదార్థములు మరియు వృద్ధులకు,  అనాథ  పిల్లలకు కావలసిన అవసరములను సమకూర్చుచున్నది.

Assistance to old people

వైద్య సహాయము

  • మర్రిపూడి గ్రామములోని పాలీక్లినిక్

ధనిష్ఠచే బాధ్యత వహింపబడిన పాలీక్లినిక్ ప్రతిదినము పేదలకు మరియు అవసరమైన వారికి వైద్యసహాయము అందించుచున్నది.  స్వచ్ఛందంగా పనిచేయు వైద్యుల సహాయమున ఆయుర్వేదము, హోమియోపతి మరియు అల్లోపతి మందులు పంచబడుచున్నవి.

Medical assistance

  • బాపట్లలోని ఉచిత హోమియో చికిత్సాలయం

బాపట్లలోని పార్వతీ నిలయము మరియు దేశిరాజు వీధులందు ఇద్దరు హోమియో వైద్యులు మరియు ముగ్గురు స్వచ్ఛంద సేవకుల సహాయమున రెండు ఉచిత హోమియో చికిత్సాలయములు ధనిష్ఠచే నడుపబడుచున్నవి.  చుట్టుప్రక్కల ఉన్న గ్రామముల నుండి పేదలు వైద్యసహాయము కొరకు బాపట్ల వచ్చుదురు.  దూరప్రాంతముల నుండి మందు కొరకు వచ్చిన వారికి ఉచితముగా ఆహారము అందించబడుచున్నది.  100 నుండి 150 మంది రోగులు వీటియందు చికిత్స పొందుచున్నారు.

Homoeo dispensary Bapatly

ఇతర కార్యక్రమములు

  • పశుసంరక్షణ పథకము

గోవులను మరియు ఇతర జంతువుల సంరక్షణార్థము గోశాలలకు కావలసిన ఆర్థిక సహాయము ధనిష్ఠచే అందించబడుచున్నది.

Animal protection

  • వారణాశి లోని విశ్రాంతి స్థలము

శ్రీ శారదా పీఠము అను ధార్మిక సంస్థచే కలసి పనిచేయుచూ, వారణాశి వెళ్ళినవారికి కావలసిన విశ్రాంతి గదుల సదుపాయమును ధనిష్ఠ అందించుచున్నది.

Retreat at Varanasi

  • జ్ఞానబోధనాలయము, విశాఖపట్టణము

భారతదేశము, యూరప్, ఉత్తర మరియు దక్షిణ అమెరికా దేశములనుండి వచ్చు యోగసాధకులకు కావలసిన జ్ఞానబోధలు, ఉభయ సంధ్యల యందు ధ్యానములు మరియు జ్ఞానభాండాగారములను విశాఖపట్టణము నందలి జ్ఞానబోధనాలయము నందు ధనిష్ఠ నిర్వహించుచున్నది.

Wisdom Teaching Temple

విద్యా సహాయము

వివిధ పాఠశాలల నుండి వచ్చు పేద మరియు విశిష్టార్హత కలిగిన విద్యార్థులకు ధనిష్ఠ సహాయమును అందించుచున్నది:

  • ఉచిత విద్య

ప్రతి సంవత్సరము ఉచిత విద్య
- శ్రీ పొట్టి శ్రీరాములు ఉన్నత పాఠశాల, అనంతపురము నందు 10 మంది విద్యార్థులకు;
- బాలభాను విద్యాలయము, శ్రీకాకుళం నందు 10 మంది విద్యార్థులకు;
- శిశు విద్యామందిర్, విజయవాడలో 10 మంది విద్యార్థులకు;
- విశాఖపట్టణములోని వివిధ పాఠశాలలు మరియు కళాశాలల నుండి 18 మంది విద్యార్థులకు అందించబడుతున్నది.

Balabhanu Vidyalayam, Srikakulam

  • కంప్యూటర్ ల్యాబ్

కొంతమంది కంప్యూటర్ నిపుణులతో కలసి విద్యార్థుల ప్రయోజనము కొరకు అనంతపురములోని శ్రీ పొట్టి శ్రీరాములు ఉన్నత పాఠశాలలో పూర్తిస్థాయి కంప్యూటర్ ల్యాబ్ ఒకదానిని ధనిష్ఠ సమకూర్చినది.  ఆ పాఠశాల ఉపాధ్యాయులు మరియు ప్రధానోపాధ్యాయులవారు ధనిష్ఠ అందించిన సహాయమునకు ఎంతగానో సంతోషించినారు.

  • స్కూల్ బ్యాగ్‌ల పంపిణీ

ప్రతి సంవత్సరము, తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరములోని వివిధ ప్రభుత్వ పాఠశాలలకు  చెందిన 150 మందికి పైగా విద్యార్థులకు కావలసిన స్కూల్ బ్యాగ్‍లను పంచుట జరిగినది.

Distribution of School bags

  • విద్యాలయములకు సహాయము

విశాఖపట్టణములోని విశాఖ సేవా సదనమునకు కావలసిన  బల్లలను మరియు పాఠశాల భవనమునకు రంగులు వేయుటకు ఆర్థిక సహాయము ధనిష్ఠచే అందించబడినది.

Visakha Seva Sadan

  • వీధులలో తిరుగు పిల్లలకు సహాయము

వీధులలో యాచించుచూ తిరుగు పిల్లలను చేరదీసి వారికి తగిన పునరావాసము కలిగించు, యువ జనరేషన్ అను సంస్థకు కాలానుగుణముగా వలసిన వంట పాత్రలు మరియు నిత్యావసర సామాగ్రిని  ధనిష్ఠ అందించుచున్నది.

Generation Yuva

ప్రచురణా కార్యక్రమములు

డా||. కె. పార్వతీ కుమార్ గారి నుండి వెలువడిన అనేక విశ్వజనీన విజ్ఞాన బోధనలు మరియు పుస్తకములను ధనిష్ఠ సంస్థ 2017 వరకు 140 వివిధ శీర్షికలతో ప్రచురించుట జరిగినది.

ప్రచురణా కార్యక్రమముల గురించి మరికొన్ని వివరములు

Dhanishta Publications