{"timeout":"7000","width":"990"}
  • శబ్దము యొక్క శక్తి
  • ఛందము మరియు క్రతువు
  • నిశ్శబ్దమును వినుట

శబ్దము యొక్క శక్తి

శాంతి కొరకు ప్రదర్శనలు చేయుట కన్నా, బృందములుగా ఓంకార నాదోచ్చారణ చేయుట వలన సూక్ష్మ లోకముల పై మంచి ప్రభావము కలిగి ప్రపంచ శాంతి సిద్ధించును.

ఛందము మరియు క్రతువు

అన్నిలయాత్మక కార్యములు మరియూ క్రతువులూ మన శరీరధాతువులలో సహజముగా మార్పులు తీసుకువచ్చుటే లక్ష్యముగా చేసుకొని, మనము త్వరితగతిన అభివృద్ధి చెందడానికి తోడ్పడతాయి.

నిశ్శబ్దమును వినుట

నిశ్శబ్దమును విన్నప్పుడు మనకి ఝంకార నాదము వినిపిస్తుంది. ఇది హృదయ కేంద్రములో వినిపించే నిశ్శబ్దము యొక్క స్వరము మరియూ నిశ్శబ్దమైన ధ్వని.

ధ్యానములు

“ధ్యానము చేయునది కాదు, జరుగునది.”

ధ్యానములు, క్రతువులు
ఎలా ప్రారంభించాలి?

ధ్యానమునకు సూచనలు

అంతరంగములో పెరుగుటకు ధ్యానమే ఆధారము. ఆత్మ యొక్క నిశ్శబ్దమైన వృద్ధి మౌనము నందు జరుగును. దీని ద్వారా ఆత్మ తన ఎరుకను తాను తెలుసుకొన గలుగుతుంది. ధ్యానము, ఆత్మ, అనాత్మల మధ్య అనుసంధానము కలిగించుటద్వారా యోగమును సిద్ధింప చేస్తుంది. అనేక రకములైన ధ్యానములు కలవు. ఈ క్రింద చెప్పబడిన ధ్యాన విధాన సూచనలు ప్రస్తుత కాలమునకు సరియైనవి.

ధ్యానమునకు మరిన్ని సూచనలు
ప్రార్థనలు మరియు అంశంసనములు

ప్రారంభదశలోని వారికి ధ్యానము

ప్రారంభదశలోని వారికి సాధారణ ధ్యానము.

ప్రారంభదశలోని వారికి

ఉదయము ధ్యానము

జగద్గురు పీఠము యొక్క సభ్యులచే ప్రతిదినము ఉదయము చేయబడు ధ్యానము (ప్రార్థన).

ఉదయము ధ్యానము

సాయంకాలము ధ్యానము

జగద్గురు పీఠము యొక్క సభ్యులచే ప్రతిదినము సాయంకాలము చేయబడు ధ్యానము (ప్రార్థన).

సాయంకాలము ధ్యానము

స్వస్థత చేకూర్చుటకు ధ్యానము

స్వస్థత కలిగించుట అనగా ఆత్మ శక్తిని దేహము నందు ప్రవహింపచేయుట కన్న వేరు కాదు. మనము ఆత్మగా పనిచేయునపుడు స్వస్థత జరుగును. అయస్కాంత తత్త్వము వలె స్వస్థతను కలిగించు శక్తి తరంగములు దేహమందలి రక్తాధిక్యతలకు, అడ్డంకులకు మరియు కణుతులకు ప్రసరింపబడి వాటిని తొలగించును. ప్రాణశక్తి ప్రసారమునకు అడ్డంకులు ఏర్పడినప్పుడు జబ్బులు కలుగును. ఆ అడ్డంకులను తొలగించినపుడు ఆరోగ్యము చేకూరును.

స్వస్థతను కలిగించుటకు కావలసిన శక్తి తరంగములను ధ్యానము చేసి మనము అందుకొనవలెను.

స్వస్థత చేకూర్చుటకు ధ్యానము గురించి వివరములు ఆరోగ్యము మరియు స్వస్థత సంబంధిత కార్యక్రమములు (English) బృందములుగా స్వస్థతా కార్యక్రమములు (English)

స్వస్థతా మంత్రము

స్వస్థతా ప్రార్థన

మనము ప్రపంచ వైద్యుల బృందముగా ఏర్పడుదాము…

స్వస్థతా ప్రార్థన గురించి వివరములు

ధ్యానము

అంతర్దర్శన ధ్యానములు

అంతర్దర్శన ధ్యానములు చేయుట వలన మానసిక మార్పులు కలుగుటకు అవకాశము కలదు. అది అనేక గూఢమైన అనుభూతులకు దారితీయును. చివరకు అది దైవ సన్నిధికి చేర్చును. ఈ ధ్యానములు భౌగోళికముగా సమస్త మానవ జాతికి సంబంధించినవి.

అంతర్దర్శన ధ్యానముల గురించి వివరములు

పూర్ణిమ ధ్యానములు

అంతరంగ ధ్యానమునకు పూర్ణిమ, అమావాస్య దినములు అత్యుత్తమమైనవి. ఈ దినములలో అంతరంగ మరియు బహిరంగ శక్తులతో అనుసంధానము చెందుటకు మంచి అవకాశము కలదు.

పూర్ణిమ ధ్యానము గురించి వివరములు

ధనిష్ఠ ధ్యానము

కుంభరాశి చైతన్యమును గ్రహించదలచు వారికి ధనిష్ఠ నక్షత్ర మండలము ఎంతో ముఖ్యమైనది.

ధనిష్ఠ ధ్యానము రాత్రి 9 గంటలకు చంద్రుడు ధనిష్ఠా నక్షత్రము నందు ఉండగా మాస్టరు మాస్టరు సి. వి. వి. గారు అందించిన మర్మ మంత్రములను ధ్యానము చేయవలెను.

ధనిష్ఠ ధ్యానము గురించి వివరములు