{"timeout":"7000","width":"990"}
  • శబ్దము యొక్క శక్తి
  • ఛందము మరియు క్రతువు
  • నిశ్శబ్దమును వినుట

శబ్దము యొక్క శక్తి

శాంతి కొరకు ప్రదర్శనలు చేయుట కన్నా, బృందములుగా ఓంకార నాదోచ్చారణ చేయుట వలన సూక్ష్మ లోకముల పై మంచి ప్రభావము కలిగి ప్రపంచ శాంతి సిద్ధించును.

ఛందము మరియు క్రతువు

అన్నిలయాత్మక కార్యములు మరియూ క్రతువులూ మన శరీరధాతువులలో సహజముగా మార్పులు తీసుకువచ్చుటే లక్ష్యముగా చేసుకొని, మనము త్వరితగతిన అభివృద్ధి చెందడానికి తోడ్పడతాయి.

నిశ్శబ్దమును వినుట

నిశ్శబ్దమును విన్నప్పుడు మనకి ఝంకార నాదము వినిపిస్తుంది. ఇది హృదయ కేంద్రములో వినిపించే నిశ్శబ్దము యొక్క స్వరము మరియూ నిశ్శబ్దమైన ధ్వని.

ప్రపంచ శాంతి కొరకు ప్రార్థన



“ధ్యానము చేయునది కాదు, జరుగునది.”

ధ్యానములు, క్రతువులు | ధ్యానములు మరియు సూచనలు
Download పూర్తి ప్రార్థన యొక్క PDF (247 KB)
Download/వినండి శ్రీం శ్రియః స్వాహా మంత్రము (MP3, 2.5 MB)
Download/వినండి పూర్తి ధ్యానము (MP3, 3 MB)

ప్రార్థన
3 సార్లు ఓంకారము
1May the Lord Sanat Kumara, the Lord of Justice,
prevail over the governments!
2May the Manu Vaivaswata
preside over the minds of men and wield them to goodwill!
3May the Maha Chohan steer the forces
of civility into varied groups of extreme ideology!
4May the Avatar of Synthesis round up
the extremism and bring in all-round human progress!
5May we join the Hierarchy of Masters
who lead us from darkness to light!
6May the Mother Earth cause
the needed adjustments for prevalence of peace and poise!
7May we pray the World Mother
through the symbol Sri Yantra, the sound Sreem and the colour voilet!

చిత్రము: Global Prayer for Peace

మంత్రము: శ్రీం శ్రియః స్వాహా - 16 సార్లు

రంగు: ఊదారంగు
ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః

సూచన

  1. ఈ ప్రార్థన 3 లేక 5 లేక 7 లేక 9 మంది కలసి ప్రతి ఆదివారము ఉదయము 11 గంటలకు చేయవలెను.
  2. అంతమంది కలసి చేయుటకు వీలు కానిచో, ఒక్కరుగా నైనను చేయవచ్చును.
  3. మంత్రము ఉచ్చరించునపుడు, పై చిత్రపటములో చూపించిన చిహ్నములో ఊదారంగును ఊహించి దర్శించవలెను. ఆ వర్ణము శంబల గ్రామము నుండి భూమిపైకి ధారా పాతముగా పడుచున్నట్లుగా ఊహించి దర్శనము చేయవలెను.
  4. విశ్వాసము, నమ్మకము కలిగిన వారు ఈ విధమైన ప్రార్థన 14 మార్చి 2016 న మొదలు పెట్టి 5 సంవత్సరములు సేవా భావముతో చేయవలెను.
  5. ప్రతి ఆదివారము ఉదయము 11 గంటలకు స్థానిక కాలము ననుసరించి చేయవలెను.
  6. “శ్రీం” అనునది ఇచ్ఛ, జ్ఞాన, క్రియా శక్తులకు మూలమైన జగన్మాతకు మూల మంత్ర శబ్దము.

ఆధ్యాత్మిక త్రికోణముగా ఏర్పడి ఉచ్చరించదలచిన వారికొరకు “అ, ఉ, మ్” మూడు అక్షరముల “ఓం”కారము ఇవ్వబడినది.