{"timeout":"7000","width":"990"}
  • శబ్దము యొక్క శక్తి
  • ఛందము మరియు క్రతువు
  • నిశ్శబ్దమును వినుట

శబ్దము యొక్క శక్తి

శాంతి కొరకు ప్రదర్శనలు చేయుట కన్నా, బృందములుగా ఓంకార నాదోచ్చారణ చేయుట వలన సూక్ష్మ లోకముల పై మంచి ప్రభావము కలిగి ప్రపంచ శాంతి సిద్ధించును.

ఛందము మరియు క్రతువు

అన్నిలయాత్మక కార్యములు మరియూ క్రతువులూ మన శరీరధాతువులలో సహజముగా మార్పులు తీసుకువచ్చుటే లక్ష్యముగా చేసుకొని, మనము త్వరితగతిన అభివృద్ధి చెందడానికి తోడ్పడతాయి.

నిశ్శబ్దమును వినుట

నిశ్శబ్దమును విన్నప్పుడు మనకి ఝంకార నాదము వినిపిస్తుంది. ఇది హృదయ కేంద్రములో వినిపించే నిశ్శబ్దము యొక్క స్వరము మరియూ నిశ్శబ్దమైన ధ్వని.

సువర్ణసోపానములు


“ధ్యానము చేయునది కాదు, జరుగునది.”

ధ్యానములు, క్రతువులు | ప్రార్థనలు మరియు అంశంసనములు

సంవత్సరపు ప్రార్థన A Clean Life
An Open Mind
A Pure Heart
An Eager Intellect
An Unveiled Spiritual Perception
A Brotherliness for One’s Co-Disciple
A Readiness to Give and Receive Advice and Instruction
A Loyal Sense of Duty to the Teacher
A Willing Obedience to the Behests of Truth
A Courageous Endurance of Personal Injustice
A Brave Declaration of Principles
A Valiant Defence of Those who are Unjustly Attacked
And a Constant Eye to the Ideal of Human Progression and Perfection
which the Secret Science depicts
These are the Golden Stairs up the steps of which the learner may climb
to the Temple of Divine Wisdom.

- Helena P. Blavatsky




పరిశుద్ధ జీవనము
మర్మములేని మనస్సు
నిర్మల హృదయము
జిజ్ఞాసువగు చిత్తము
మాటుపడని అతీంద్రియ గ్రహణము
సహాధ్యాయి యెడల సోదర భావము
సలహాలను, నియమములను స్వీకరించుటకును, ఇచ్చుటకును సంసిద్ధత కలిగియుండుట
దేశికుని యెడల విశ్వాసనీయమైన ధర్మానుష్టాన బుద్ధి
సత్యసూత్రములను అంగీకరించి విధేయుడగుట
వ్యక్తిగతముగా తనకు జరిగిన అన్యాయమును ధీరతతో సహించుట
తన సిద్ధాంతములను నిర్భీతిగా నుద్ఘాటించుట
అన్యాయమునకు గురిచేయబడిన వారిని తెగువతో కాపాడుట
గుప్తవిద్య సూచించు ఆదర్శములగు మానవ పురోభివృద్ధి
పరిపూర్ణతల యెడ నిరంతరము జాగరూకత కలిగి యుండుట అనునవి దివ్యజ్ఞానమను ఆలయమునకు సాధకుడు ఆరోహణ చేయుటకు వలసిన సువర్ణ సోపానములు.