{"timeout":"7000","width":"990"}
  • శబ్దము యొక్క శక్తి
  • ఛందము మరియు క్రతువు
  • నిశ్శబ్దమును వినుట

శబ్దము యొక్క శక్తి

శాంతి కొరకు ప్రదర్శనలు చేయుట కన్నా, బృందములుగా ఓంకార నాదోచ్చారణ చేయుట వలన సూక్ష్మ లోకముల పై మంచి ప్రభావము కలిగి ప్రపంచ శాంతి సిద్ధించును.

ఛందము మరియు క్రతువు

అన్నిలయాత్మక కార్యములు మరియూ క్రతువులూ మన శరీరధాతువులలో సహజముగా మార్పులు తీసుకువచ్చుటే లక్ష్యముగా చేసుకొని, మనము త్వరితగతిన అభివృద్ధి చెందడానికి తోడ్పడతాయి.

నిశ్శబ్దమును వినుట

నిశ్శబ్దమును విన్నప్పుడు మనకి ఝంకార నాదము వినిపిస్తుంది. ఇది హృదయ కేంద్రములో వినిపించే నిశ్శబ్దము యొక్క స్వరము మరియూ నిశ్శబ్దమైన ధ్వని.

సనత్కుమార మరియు మైత్రేయ మంత్రములు

“ధ్యానము చేయునది కాదు, జరుగునది.”

ధ్యానములు, క్రతువులు | ప్రార్థనలు మరియు అంశంసనములు
ధ్యానములు, మంత్రములు, క్రతువులు Workbook PDF ఆంగ్లములో
Download మంత్రముల PDF | మంత్రములను వినుటకు (MP3, 3.6 MB)
బృందముచే గానము చేయబడిన మంత్రములను వినుటకు (MP3, 1.1 MB)

Sanat Kumara
సమస్త యోగీజనతారకం తం |
సనత్కుమారం శరణం ప్రపద్యే ||

కృపాసముద్రమ్ సుగతస్యమిత్రమ్ |
తపశ్చరంతమ్ గిరిరాజపార్శ్వే ||

జగద్గురుమ్ సర్వమతప్రదీపమ్ |
నమామి మైత్రేయమ్ అగాధబోధమ్ ||

ఓం శాంతి, శాంతి, శాంతిః

వివరణ

సనత్కుమారుని మంత్రము

సమస్త యోగీజనతారకం తం |
సనత్కుమారం శరణం ప్రపద్యే ||

నీవు యోగులకు ముక్తిని ప్రసాదించువాడవు. మీ రక్షణలో మరియు మార్గదర్శకత్వములో నడచుట వలన నేను పూర్తిగా రక్షింపబడి, మార్గనిర్దేశము చేయబడి, వివేకవంతుడనై మార్పు చెందితిని.
అతడు సమస్త యోగులయొక్క సమాహార ప్రజ్ఞ; అతడు ఉన్నత లోకములనుండి దిగివచ్చెను. ఓ సనత్కుమారా, నిన్ను మేము శరణువేడుచున్నాము.

మైత్రేయ మంత్రము

కృపాసముద్రమ్ సుగతస్యమిత్రమ్ |
తపశ్చరంతమ్ గిరిరాజపార్శ్వే ||

మైత్రేయ మహర్షి కరుణా సముద్రుడు, వెలుగు మార్గమున నడవ తలచినవారికి మిత్రుడు.
అతడు ఎల్లపుడు ఆజ్ఞ మరియు సహస్రార కేంద్రముల నడుమ ఉన్నత స్థితిలో ఉండి, తనను అనుసరించువారికి దివ్య ప్రణాళికను ప్రసరింప జేయుచుండును. అతడు ఈశ్వర నివాసమునకు ప్రక్కన గల పర్వత ప్రాంతము నందు నివసించును. అతనికి ఏ విధమైన ప్రాధాన్యతలు లేవు.

జగద్గురుమ్ సర్వమతప్రదీపమ్ |
నమామి మైత్రేయమ్ అగాధబోధమ్ ||

అతడు జగద్గురువు. అన్ని మతములకు అతడు ఉన్నతిని కలిగించును.
మైత్రేయులవారికి నమస్కారము. అతని అంతరంగ లోతులను అర్ధము చేసుకొనుట అసాధ్యము.

ఓం శాంతి, శాంతి, శాంతిః


ఈ శ్లోకములు (మంత్రములు) విద్యారణ్య మహర్షి (1296 – 1391 CE ) ద్వారా అందింపబడినవి. వారమునకు ఒక్కసారి హోమము తరువాత తప్పక గానము చేయవలెను.

సనత్కుమారులు నిర్వహిస్తున్న కార్యక్రమములను నిత్యము మనము మననము చేసి మనయందు వాటిని ఎరుక కలిగి యండవలెను. ఈ విధముగా చేయుటవలన మరియు సనత్కుమారుని గురించి మరియు శంబల గురించి మాట్లాడుటవలన ఎంతో సేవ చేసినవారమవుదుమని పరమగురువుల అభిప్రాయము.

సనత్కుమారుని చుట్టూ ముగ్గురు మహాత్ములు కలరు. అందు మొదటి వారు మైత్రేయ మహర్షి. రెండవ వారు సుగత లేక తథాగతుడైన గౌతమ బుద్దుడు. మూడవవారు భరతజాతికి చిరపరిచుతులైన శంకరాచార్య. వీరు శంబల మరియు సనత్కుమారుల వారి చుట్టూ మొదటి త్రికోణముగా ఏర్పడిరి. వీరి చుట్టూ గురు పరంపర యున్నది. ఈ గురు పరంపరలోని కొందరు ముఖ్యమైన వారు మాత్రమే మనకు తెలుసు; మానవ జాతికి మార్గనిర్దేశము చేయు మహాత్ములందరి పేర్లు మనకు తెలియవు.

మైత్రేయ మహర్షి వయస్సు తెలియని వాడు. శ్రీ కృష్ణావతారమునకు ముందే సిద్ది పొందినవాడు. పరాశర మహర్షి యొక్క ముఖ్య శిష్యుడు. జగత్తు అంతటితో మైత్రి అను స్థితి పొందినవాడు. మైత్రేయ అనగా ముర్తీభవించిన మైత్రీ తత్వము లేక స్నేహ తత్వము.

సనత్కుమారుల వారు యోగులకు ముక్తిని ప్రసాదించును - యోగులకు, మనలాంటి వారికి కాదు. మనకు స్వతంత్రత కలిగించుట గురుపరంపర యొక్క పని. బహిర్ముఖులై జీవులకు సహాయము చేయవలెనని వారు సంకల్పించిరి. దానికి సమయము ఆసన్నమైనది. అది ఎలా? గురుపరంపర ఉన్నట్లుగా గుర్తించి, మనము ఎప్పటికప్పుడు వారిని స్మరించుట చేయవలెను. ఉభయ సంద్యల యందు మనము చేయు ప్రార్ధనలలో మైత్రేయ మహర్షిని స్మరించి వారి అనుగ్రహమును పొందవలెను.