{"timeout":"7000","width":"990"}
  • సహకారము
  • బృందమున పరస్పర చర్యలు
  • బృంద మార్గము
  • దైవ సహకారము

సహకారము

బృందములు ఒకదానికొకటి సహకరించుకొనేటట్లు చూసేలా అన్ని బృందములకు పరస్పరమూ సహజ పరితాపము ఉండవలెను. సహకరించడం నేర్చుకోండి – అది బాగా పనిచేస్తుంది.

బృందమున పరస్పర చర్యలు

బృందమున సభ్యుల యొక్క పరస్పర చర్యలకు స్నేహభావమే ఆధారమై ఉండవలెను. ఆక్షేపణ లేని సంభాషణము నేర్చుకొనుము.

బృంద మార్గము

సాధక బృందము ఒకే పనిని, ఒకే విధముగా, ఒకే సమయములో చేయడానికి ఉద్దేశించబడలేదు. అది, పరస్పర గౌరవము, సంపూర్ణ స్వాతంత్ర్యము తో బాటుగా దృష్టి మరియు భావతరంగముల యొక్క ఏకత్వము ద్వారా ఒకరికొకరికి సంబంధించినది.

దైవ సహకారము

శ్రేయస్సు కలిగించే పనిలో ఉన్నప్పుడు దేవతలు స్వచ్ఛందముగా, సమ్మతితో సహకారము అందించెదరని తెలిసినవారు ధన్యులు.

జగద్గురు పీఠము బృందములు మరియు కార్యక్రమములు

“ఏకీకరించు, విచ్ఛిన్నపరచకు.”

బృందముగా పనిచేయుట కుంభ యుగపు భావన. బృంద కార్యము అనునది ప్రతి ఒక్కరి స్వంత వ్యక్తిత్వమును తొలగించి, అందరిలోంచి పనిచేస్తున్న ఒకే వెలుగులో సమవిశ్వాసము గల సమూహమును ఆశిస్తుంది. బృందముగా పనిచేయుట అనెడి ప్రయోగము వలన పాల్గొనువారిలో అంతరంగమున విచ్చుకొనుట అనునది అనుసరించి వచ్చును.

బృందముల లోకి వచ్చుట, వెళ్ళిపోవుట అనునది వారి వారి ఇచ్ఛను బట్టి ఉండును, ఎటువంటి ఆంక్షలు ఉండవు.

జగద్గురు పీఠము సభ్యత్వము గురించి వివరములు

గమనిక

జగద్గురు పీఠము, ఇతర సంబంధీకృత వెబ్సైట్లలో ఉన్న సమాచారమునకు ఎటువంటి బాధ్యత తీసుకొనదు. అనుక్రమణిక యందున్న సైట్లు అన్నీ కార్యకర్తల చేత స్వతంత్రముగా రూపొందించబడినవి. అవాంఛనీయ వాడకము ఉన్న యెడల ఈ క్రింది email నకు తెలియజేయగలరు.