{"timeout":"7000","width":"990"}
  • శబ్దము యొక్క శక్తి
  • ఛందము మరియు క్రతువు
  • నిశ్శబ్దమును వినుట

శబ్దము యొక్క శక్తి

శాంతి కొరకు ప్రదర్శనలు చేయుట కన్నా, బృందములుగా ఓంకార నాదోచ్చారణ చేయుట వలన సూక్ష్మ లోకముల పై మంచి ప్రభావము కలిగి ప్రపంచ శాంతి సిద్ధించును.

ఛందము మరియు క్రతువు

అన్నిలయాత్మక కార్యములు మరియూ క్రతువులూ మన శరీరధాతువులలో సహజముగా మార్పులు తీసుకువచ్చుటే లక్ష్యముగా చేసుకొని, మనము త్వరితగతిన అభివృద్ధి చెందడానికి తోడ్పడతాయి.

నిశ్శబ్దమును వినుట

నిశ్శబ్దమును విన్నప్పుడు మనకి ఝంకార నాదము వినిపిస్తుంది. ఇది హృదయ కేంద్రములో వినిపించే నిశ్శబ్దము యొక్క స్వరము మరియూ నిశ్శబ్దమైన ధ్వని.

ఉదయము మరియు సాయంకాలము ధ్యానము


“ధ్యానము చేయునది కాదు, జరుగునది.”

ధ్యానములు, క్రతువులు | ధ్యానములు, ప్రార్థనలు
ప్రారంభదశలోని వారికి | పూర్తి ప్రార్థన - ఉదయము మరియు సాయంకాలము ధ్యానము
ధ్యానమునకు సూచనలు

Light

జగద్గురు పీఠము యొక్క సభ్యులచే ప్రతిదినము ఉదయము, సాయంకాలము చేయబడు ధ్యానము(ప్రార్థన).

ప్రారంభదశలోని వారికి


ప్రారంభదశలోని వారికి సాధారణ ధ్యానము.

Iఓం - ఓం - ఓం
IIనమస్కారమ్స్ మాస్టర్ సి. వి. వి.
నమస్కారమ్స్ మాస్టర్ సి. వి. వి.
నమస్కారమ్స్ మాస్టర్ సి. వి. వి. టు యువర్ లోటస్ ఫీట్
III15 నిముషములు మౌనము వహించి, అంతరంగములో ఏమి జరుగుచున్నదో గమనింపుము.

ఉదయము మరియు సాయంకాలము ధ్యానము - పూర్తి ప్రార్థన


Download పూర్తి ప్రార్థన యొక్క PDF (12 KB)
Download/వినండి ఉదయము ధ్యానము (MP3, 37.5 MB)
Download/వినండి సాయంకాలము ధ్యానము (MP3, 37.2 MB)
మైత్రేయ స్తోత్రము (MP3, 9.2 MB)

వివరముల కొరకు The Aquarian Master (English) పుస్తకములోని 3వ అధ్యాయము చూడగలరు.

జగద్గురు పీఠము యొక్క సభ్యులచే ప్రతిదినము ఉదయము, సాయంకాలము చేయబడు ధ్యానము (పూర్తి ప్రార్థన).

ప్రార్థన వివరణము
Iఓం నమః
శ్రీ గురుదేవాయ
పరమ పురుషాయ
సర్వదేవతా వశీకరాయ
సర్వారిష్ట వినాశాయ
సర్వ మంత్రఛ్ఛేదనాయ
త్రైలోక్యం వశమానయ
స్వాహా
(3 మార్లు)
ఓంకారమే సృష్టి యంతయూ వ్యాపించియున్నది. నా ఉనికి ప్రత్యేకముగా లేదు. ప్రణవమే నేనుగా ఉన్నాను.
అదియే నా గురుదేవులు
ఆయనే పరమ పురుషుడు
సర్వదేవతలు ఆయన యందు వశమై ఉన్నారు
సర్వ అరిష్టములను ఆయన నాశనము చేయగలరు
సర్వ మంత్రములను ఆయన ఛేదించగలరు
మూడులోకములు తమ వశము చేసుకొన్నవారు అయిన
గురుదేవుని ధ్యానించుచున్నాను.
IIఓం - ఓం - ఓం - ఓం - ఓం - ఓం - ఓం
IIIగురుబ్రహ్మ గురుర్విష్ణుః
గురుర్దేవో మహేశ్వరః
గురుస్సాక్షా త్పరంబ్రహ్మ
తస్మై శ్రీ గురవే నమః
గురువే బ్రహ్మ, గురువే విష్ణువు
గురుదేవులే మహేశ్వరుడు
గురువే సాక్షాత్తూ ప్రరబ్రహ్మము
అటువంటి శ్రీ గురుదేవునకు నమస్కారము

Download Learning Powerpoint (English) (2.7 MB)
IVనమస్కారమ్స్ మాస్టర్
నమస్కారమ్స్ మాస్టర్ కె. పి. కె.
నమస్కారమ్స్ మాస్టర్ ఇ. కె.
నమస్కారమ్స్ మాస్టర్ యం. యన్.
నమస్కారమ్స్ మాస్టర్ సి. వి. వి.
నమస్కారమ్స్ మాస్టర్ సి. వి. వి.
నమస్కారమ్స్ మాస్టర్ సి. వి. వి. టు యువర్ లోటస్ ఫీట్
ఈ నలుగురు పరమ గురువులు జగద్గురు పీఠము
దివ్య ప్రణాళికకు ముఖ్యమైన వారు.
V15 నిమిషములు మౌనము వహించి, అంతరంగములో ఏమి జరుగుచున్నదో గమనింపుము.
VIఓం భూర్భువస్సువః ఓం తత్సవితు ర్వరేణ్యం
భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్
(24సార్లు, ప్రారంభములో 12సార్లు గానము చేయవలెను.)
గాయత్రి: “లోకములను వెలిగించు సవిత అను వెలుగు మమ్ము వరించి
మా యందు బుద్ధిని ప్రచోదనము చేయవలెనని సమస్త వెలుగులకు మూలమైన భర్గోదేవుని ధ్యానము చేయుచున్నాము.”

వివరముల కొరకు Mantrams(English) పుస్తకమును చూడుడు.

Download Learning Powerpoint (English) (3.1 MB)
VIIశాంతి పాఠము
ఓం
శం నో మిత్ర శ్శం వరుణః
శం నో భవత్వర్యమా
శం న ఇంద్రో బృహస్పతిః
శం నో విష్ణు రురుక్రమః
నమో బ్రహ్మణే
నమస్తే వాయో
త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి
త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి
ఋతం వదిష్యామి
సత్యం వదిష్యామి
తన్మామవతు తద్వక్తారమవతు
అవతుమామ్ అవతు వక్తారమ్
ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః
ఓం
మిత్రుడు, వరుణుడు, అర్యముడు, ఇంద్రుడు,
బృహస్పతి, విష్ణువు మాకు సుఖశాంతులను కలిగించుగాక.
బ్రహ్మమునకు నమస్కారము.
ఓ వాయుదేవా! నీకు నమస్కారము.
నీవే ప్రత్యక్ష బ్రహ్మము.
నిన్నే వాగ్బ్రహ్మము రూపముగా పలుకుచున్నాము.
ఋతముగ, సత్యముగా నిన్నే పలుకుచున్నాము.
కనుక నీవు నన్ను, నన్ను పలికించు వానిని (గురు శిష్యులను) రక్షింపుము.

వివరముల కొరకు Mantrams (English) పుస్తకమును చూడుడు.

Download Learning Powerpoint (English) (6.9 MB)
VIII
(ఉదయము)

GREAT INVOCATION

From the point of light within the mind of God,
let light stream forth into the minds of men.
Let light descend on Earth.

From the point of love within the heart of God,
let love stream forth into the hearts of men.
May the Lord return to Earth

From the centre, where the will of God is known,
let purpose guide the little wills of men,
the purpose, which the Masters know and serve.

From the centre, which we call the race of men,
let the plan of love and light work out,
and may it seal the door where evil dwells.

From the Avatar of synthesis, who is around,
let his energy pour down in all kingdoms.
May he lift up the Earth to the kings of beauty.

Let Light and Love and Power restore the Plan on Earth.
(సాయంకాలము)

INVOCATION

May the Light in Me be the light before me
May I learn to see it in all.
May the sound I utter reveal the light in me
May I listen to it while others speak.

May the silence in and around me present itself,
The silence which we break every moment,
May it fill the darkness of noise we do
And convert it into the Light of our background.

Let virtue be the strength of my intelligence,
Let realisation be my attainment,
Let my purpose shape into the purpose of our earth,
Let my plan be an epitome of the Divine Plan.

May we speak the silence without breaking it.
May we live in the awareness of the background.
May we transact light in terms of joy.
May we be worthy to find place in the Eternal Kingdom OM.

Download Learning Powerpoint (English) (1.4 MB)

నాలోనఁ గల వెల్గు నా పరిసరముల
వారి రూపమున గన్పట్టుగాక!
నా యుచ్చరించెడి నాద మా వెల్గుగా
వినిపించి, కనిపించి వెలయుగాక!
నాలోన, వెలుపల నేలు నిశ్శబ్దంబు
ప్రేమగా సాక్షాత్కరించుగాక!
మా కంఠ శబ్దాల చీకట్లు వెల్గుగా
కఱగించి యది మమ్ము కలుపుగాక!

తెలివికిని సద్గుణమ్ముల బలము గూర్చి
నా ప్రణాళిక విశ్వ ప్రణాళికగను
వ్యాప్తమై విశ్వమూర్తి రూపంబునందు
నిలుచు గావుత శాశ్వత నిలయమగుచు.
IX లోకా స్సమస్తా స్సుఖినో భవంతు (3 మార్లు)
ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః

Download Learning Powerpoint (English) (1.4 MB)
Xమైత్రేయ స్తోత్రము
జగద్గురో నమస్తుభ్యం హిమాలయ నివాసినే
నమస్తే దివ్యదేహాయ మైత్రేయాయ నమోనమః (2 మార్లు)
హిమాలయ నివాసులైన జగద్గురువులకు నమస్కారము.
దివ్యదేహము కలిగిన వానికి నమస్కారము.
మైత్రేయులవారికి నమస్కారము.
నమో జ్ఞాన స్వరూపాయ మాయామోహ విదారిణే
నిర్మలాయ ప్రశాంతాయ మైత్రేయాయ నమోనమః
మాయ, మోహములను చెదరగొట్టగల జ్ఞాన స్వరూపులకు నమస్కారము,
నిర్మల, ప్రశాంత స్వరూపులైన మైత్రేయులవారికి నమస్కారము.
నమస్తే బోధిసత్త్వాయ నమస్తే పుణ్యమూర్తయే
పూర్ణానంద స్వరూపాయ మైత్రేయాయ నమోనమః
శుద్ధసత్వ స్వరూపులైన వారికి నమస్కారము.
పుణ్యమూర్తులైన వారికి నమస్కారము.
సంపూర్ణమైన ఆనంద స్వరూపులైన మైత్రేయులవారికి నమస్కారము.
సిద్ధిబుద్ధి ప్రయుక్తాయ సిద్ధిబుద్ధి ప్రదాయినే
భవభీతి వినాశాయ మైత్రేయాయ నమోనమః
పరిపూర్ణత, జ్ఞానము గుణములుగా కలవాడు, వాటిని ప్రసాదించువాడు,
జనన మరణ భయములను పోగొట్టు వాడు అయిన మైత్రేయులవారికి నమస్కారము.
నమస్తే కర్మనిష్ఠాయ యోగినాం పతయే నమః
బ్రహ్మజ్ఞాన స్వరూపాయ మైత్రేయాయ నమోనమః
కర్మాచరణమందు నిష్ఠ కలిగినవానికి నమస్కారము.
యోగులకు యోగి అయిన వానికి నమస్కారము.
బ్రహ్మజ్ఞాన స్వరూపులైన మైత్రేయులవారికి నమస్కారము.
నమస్తే గురుదేవాయ నమస్తే ధర్మసేతవే
నారాయణ నియుక్తాయ మైత్రేయాయ నమోనమః
గురుదేవులకు నమస్కారము, ధర్మమునకు వారధియైన వానికి నమస్కారము.
నారాయణునిచే నియమితులైన మైత్రేయులవారికి నమస్కారము.
నమస్తే కరుణాసింధో ప్రేమపీయూష వర్షిణే
జగద్బంధో నమస్తుభ్యం మైత్రేయాయ నమోనమః
ప్రేమామృతమును వర్షించువాడు,
కరుణా సముద్రుడు అయిన వానికి నమస్కారము.
సమస్త జగత్తుకు బంధువు అయిన వానికి నమస్కారము.
మైత్రేయులవారికి నమస్కారము.
జగద్బంధో నమస్తుభ్యం మైత్రేయాయ నమోనమః
మైత్రేయాయ నమోనమః
ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః
వివరముల కొరకు Lord Maitreya - The World Teacher (English) చూడండి.

Download Learning Powerpoint (English) (19.2 MB)