రుద్రాభిషేకము
“ధ్యానము చేయునది కాదు, జరుగునది.”
ధ్యానములు, క్రతువులు | క్రతువులు
Download\వినండి రుద్రాభిషేకము (MP3, 8.9 MB)
పుస్తకము: శ్రీ శివ పూజా విధానము | పుస్తకము: Rudra (English)
మన ప్రాచీన శాస్త్రముల ప్రకారము సూక్ష్మలోకమందలి జీవము భౌతికలోకములో నీరుగా వ్యక్తమయినది. నీరు ప్రాణశక్తిని సూచించును. అభిషేకము యొక్క ముఖ్య ఉద్దేశ్యము ఏమనగా అదృశ్య లోకములలో ఉన్న విద్యుచ్ఛక్తిని దృశ్య లోకములలోనికి వ్యక్తపరచుట. సూక్ష్మస్పందనలకు అధిపతి, దేవతలందరికంటే ప్రప్రధముడు అయిన రుద్రుడు, చీకటికి ఆవల ఉన్న వెలుగును స్థూలలోకములోనికి కనిపించే వెలుగుగా వ్యక్తపరచును. చీకట్లను పారద్రోలి, జీవుల అనుభవమునకు చీకటికి ఆవల ఉన్న వెలుగును స్థూలమునకు కొనివచ్చు దైవము రుద్రుడు. మర్త్యులైన జీవుల అజ్ఞానపు చీకట్లను నాశనము చేసి వారికి వెలుగు మార్గము చూపు దైవము రుద్రుడు. దైవమును, దివ్యప్రణాళికను అనుభూతి చెందుటకు రుద్రుడు సహాయము చేయును. రుద్రుడు అన్ని జీవుల యందునూ స్పందనగా ఉన్నాడు. ఇది రుద్రుని ఆరాధించు సాధకుడు తెలుసుకొనవలన విషయము.