{"timeout":"7000","width":"990"}
  • సుహృద్భావ సంబంధము
  • సరళత్వము మరియూ నిశ్శబ్దము యందుండి సేవ చేయాలి
  • సేవ యందు అభిలాష
  • బృందములకు సేవ

సుహృద్భావ సంబంధము

ఇతరుల అవసరములను గుర్తించి సహాయము అందించడమే, సుహృద్భావ సంబంధము ఏర్పరచుకొనుటకు ఆధారము.

సరళత్వము మరియూ నిశ్శబ్దము యందుండి సేవ చేయాలి

మనము, ఫలితము కోరని ఏదో ఒక సేవ, సరళత్వము మరియూ నిశ్శబ్దము యందుండి చేయాలి. దాని వలన ఆనందము కలగడమే కాక వ్యక్తిగత కర్మయందు గల ఋణముల నుంచి విముక్తి కలుగుతుంది.

సేవ యందు అభిలాష

అన్ని వేళలా సేవ చేయుటకు ఇచ్ఛ కలిగి, సేవ చెయ్యడానికి తగు అవకాశములను గమనించుకుంటూ ఉండడమనే వైఖరి నే సత్సంకల్పమందురు.

బృందములకు సేవ

బృందమునకు మనము ఏమి చేశాము అన్నది ఒక్కటే సేవకి కొలమానము. మన ఇంటి దగ్గర లేక మనము పని చేసే దగ్గర సహజ బృందములు వాటంతట అవే తయారవుతాయి. 'బృందము' అను పదమును మనము సంకుచితముగా నిర్వచించరాదు.

ప్రచురణా కార్యక్రమములు


“నిశ్శబ్దముగా పనిచేయుట వలన మంచి సేవ జరుగును. దాని పరిమళము అది కలిగి ఉంటుంది.”
సేవారంగములు

పుస్తక ప్రచురణలు

పుస్తక ముద్రణ మరియు ఇతర మాధ్యమముల ద్వారా జ్ఞానమును అందించుట జగద్గురు పీఠము బృందములకు ఒక ముఖ్యమైన కార్యము.

1988 నుండి పుస్తక ప్రచురణలు మొదలైనవి: డా. ఎక్కిరాల కృష్ణమాచార్య గారి మొదటి పుస్తకము నుండి మొదలై డా. కె. పార్వతీకుమార్ గారి వరకు అనేక పుస్తకములు అనేక భాషలలో - ముఖ్యముగా తెలుగు, కన్నడ, హిందీ, ఆంగ్లము, జర్మన్, స్పానిష్, ఫ్రెంచ్, మరియు హిబ్రూ భాషలలో ముద్రింపబడినవి.

ప్రతిసంవత్సరము జగద్గురు పీఠము జ్యోతిష పంచాంగమును (English) ఆంగ్లము, జర్మన్, స్పానిష్, మరియు తెలుగు భాషలలో ముద్రించుచున్నది.

WTT-జర్మనీ పుస్తకములు

ధనిష్ఠ ముద్రణలు

ధనిష్ఠ అనగా ధనపూరిత దివ్యవాయువు. ధనమనగ దివ్య సంపద. అది కేవలము డబ్బుకాదు. డబ్బుతో సంపదను కొలువలేము, కొనలేము. సంపద జీవన వైభవమునకు సంబంధించినది. అన్ని కాలముల యందును జ్ఞానము గురువుల ద్వారా ప్రసరించినది. డా. కె. పార్వతీకుమార్ గారి కలము మరియు గళము నుండి జాలువారిన అనేన జ్ఞాన బోధలను ధనిష్ఠ సంస్థ ముద్రణ గావించుచూ పరిపూర్తి చెందుచున్నది. వారి బోధనలు ఆంగ్లము, జర్మన్, ఫ్రెంచ్, మరియు స్పానిష్ భాషలలో కూడా ముద్రింపబడినవి.

ధనిష్ఠ ఫలితమాశించని స్వచ్ఛంద సేవా సంస్థ.

ధనిష్ఠ ఎడిషన్స్ తెలుగు, హిందీ, మరియు ఆంగ్ల పుస్తకములు. భారతదేశములో మాత్రమే తపాలా.

ఎడిసియోన్స్ ధనిష్ఠ స్పానిష్ లో ఉన్న ఉచిత PDF పుస్తకములు

ఎడిషన్ కులపతి జర్మన్ పుస్తకములు. ఐరోపాలో మాత్రమే తపాలా.

పారాసెల్సెస్ - ఆరోగ్యము మరియు స్వస్థత

2003 సంవత్సరము నుండి 15/16 శతాబ్దమునకు చెందిన పెరాసెల్సెస్ అను యోగి జ్ఞాపకార్థం “పారాసెల్సెస్ - ఆరోగ్యము మరియు స్వస్థత” అను మాసపత్రిక నడపబడుచున్నది. ఈ పత్రిక ఆంగ్లము, జర్మన్, మరియు స్పానిష్ భాషలలో ముద్రింపబడుచున్నది. దానికి డా. కె. పార్వతీకుమార్ గారు సంపాదకులు.

పారాసెల్సెస్ - ఆరోగ్యము మరియు స్వస్థత (English)

ధ్వని ముద్రణ మరియు ప్రసారము

1983 వ సంవత్సరము నుండి అన్ని బోధనలను ధ్వని రూపముగా ముద్రించి వాటిని వివిధ సాధనములలో వినుటకు వీలుగా పొందుపరచటమైనది. అంతర్జాలము ద్వారా ఉచితముగా వినుటకు వీలుగా పొందుపరచటమైనది. దృశ్యరూపమున (video) కూడా అనేక బోధనలు పొందుపరచి వున్నవి. 2007 నుండి బోధనలు అంతర్జాలములో ప్రత్యక్షప్రసారము కూడా అందించబడుచున్నవి.

మాస్టర్స్ కాల్ ప్రత్యక్ష ప్రసారములు WTT వీడియో ఛానల్

డిజిటల్ ప్రసారములు

జ్ఞాన బోధనలను అందరికీ అందుబాటులోకి తీసుకురావటానికి, అనేక పుస్తకములు మరియు ఇతరములు అంతర్జాలము (internet)లో ఉచితముగా లభ్యమగును. కొన్ని ముద్రించబడిన పుస్తకములు ఉచితముగా కూడా పంచటమైనది. కొన్ని దేశములలో బృంద సభ్యులు అందించిన ఆర్థిక సహాయము వలన ఉచితముగా ఆధ్యాత్మిక గ్రంథాలయములు నడుపబడుచున్నవి.

డా. ఎక్కిరాల కృష్ణమాచార్య మరియు డా. కె. పార్వతీకుమార్ గారిచే చెప్పబడిన బోధనలు మరియు వారు నిర్వహించిన సదస్సులు కాసెట్లు మరియు సి.డి. ల రూపములో పొందుపరచబడినవి.

బోధనలు మరియు పుస్తకములను అందుబాటులో ఉంచుటకు అంతర్జాలము నందు దానికి సంబంధించిన పేజీలను (Websites) ఉంచటమైనది. డా. కె. పార్వతీకుమార్ గారి అనేక ప్రసంగములను దృశ్యరూపము (video)న WTT వీడియో ఛానల్ లో పొందుపరచటమైనది.

Facebook, blogs, Twitter, మరియు emails అను వివిధ మార్గముల ద్వారా సందేశములను అందించుచున్నారు.

పుస్తక దుకాణములు మరియు వెబ్సైట్లు

పుస్తక ప్రచురణ

ఎడిసియోన్స్ ధనిష్ఠ, స్పెయిన్ ద్వారా పుస్తకముల ప్రచురణ

స్వచ్ఛంద సేవకులకు స్వాగతము

రోజువారి సహకారము అందించుటకు మరియు అవసరమైన అర్హతలు పొందుటకు నచ్చి వచ్చు స్వచ్ఛంద సేవకులకు స్వాగతము. వివరముల కొరకు సంప్రదించండి.

మాస పత్రికలు

తెలుగులో నావాణి మరియు కన్నడములో జగద్గురువాణి అను మాస పత్రికలు ప్రచురింపబడుచున్నవి.

నావాణి మాస పత్రిక జగద్గురు పీఠము మొదటి పత్రిక. డా. ఎక్కిరాల కృష్ణమాచార్య గారిచే 1972 లో ప్రారంభించబడి, ప్రస్తుతము డా. కె. పార్వతీకుమార్ గారి సంపాదకీయములో నడచుచున్నది. ఇది విశాఖపట్టణములో ప్రచురించబడి పంపిణీ చేయబడుచున్నది.

సంప్రదించుటకు / చందా నావాణి Email navani_7@yahoo.com
Phone 0891-2701531
చిరునామా
జగద్గురు పీఠము, రిట్రీట్ సెంటర్
15-7-1, ఏంజిల్స్ ఎన్‍క్లేవ్, కృష్ణా నగర్
విశాఖపట్టణము, ఆంధ్ర ప్రదేశ్ - 530 002

జగద్గురువాణి అను పత్రిక 2001 నుండి బెంగళూరులో ముద్రింపబడి పంపిణీ చేయబడుచున్నది.

సంప్రదించుటకు / చందా జగద్గురువాణి Email info.jagadguruvani@mastersvoice.net
చిరునామా
సద్గురు తపోవనము
రాయల్ పార్క్ రెసిడెన్సీ, అంజనపుర పోస్ట్
అవలహళ్లి టెలిఫోన్ ఎక్స్చేంజి దగ్గర
జె. పి. నగర్, ఫేస్ 9
బెంగళూరు, కర్నాటక - 560 108

వైశాఖ వార్తా పత్రికను (English) 1987 లో ప్రతినెల జ్ఞాన బీజములను బృందములకు అందించుటకు ప్రారంభించిరి. తరువాతి సంవత్సరములలో అది బాగా పెరిగి పరమ గురువుల బోధలను, జ్ఞానమును అందరికి అందించుచున్నది. ఇది ఆంగ్లము, ఫెంచ్, జర్మన్ మరియు స్పానిష్ భాషలలో లభించును మరియు అంతర్జాలములో చదువుకొనుటకు కూడా అవకాశము కలదు.

అర్జంటెనా, బెల్జియం, జర్మనీ, భారతదేశము, స్పెయిన్, స్విట్జర్‍లాండ్, మరియు అమెరికా దేశముల యందు అనేక బృందములు దీనికి సహాయము చేయుచుందురు.

వైశాఖ మాస పత్రిక (English)

బృందముచే ముద్రణా కార్యక్రమము

సాధారణ కార్యక్రమములతో పాటు ప్రచురణ రంగములో నిరంతరము పని జరుగుతూ ఉంటుంది.

  • బోధనలకు ప్రతులు వ్రాయటము
  • పత్రికలకు కావలసిన వ్యాసములు వ్రాయుట మరియు వాటిని సంపాదించుట
  • భాషానువాదము మరియు వాటియందలి దోషములను దిద్దుట
  • సమన్వయము, సంస్థ మరియు నాణ్యతా నిర్వహణ
  • స్వచ్ఛంద సేవకులకు శిక్షణ
  • రూపకల్పన మరియు దానికి రూపము నిచ్చుట
  • క్రయ విక్రయాలు మరియు ప్రజా సంబంధాలు
  • ముద్రించి వాటిని జాగ్రత్త పరచుట మరియు పునఃముద్రణ
  • పుస్తక విక్రయ కేంద్రములకు పంపిణీ చేయుట

సాంకేతిక రంగములో వచ్చుచున్న అనేక మార్పుల వలన ముద్రణా కార్యక్రమము అనేక మార్పులు చెందుతూ దానికి కావలసిన లోతైన సాంకేతిక పరిజ్ఞానము మరియు శిక్షణను అందిస్తూ అనేక సవాళ్ళను ఎదుర్కొనుచున్నది.

ఇవి అన్నియు సూక్ష్మరూపము (digital)లో నిల్వచేయుటకు మరియు మరియు ముద్రించుట (e-publishing)కు కావలసిన మార్పులు జరుగుచున్నవి.