{"timeout":"7000","width":"990"}
  • ధ్యానము
  • క్రతువులు
  • పవిత్ర స్థలములు
  • పరమగురువులు
  • బృంద జీవనము

ధ్యానము

ఆంతరంగికమైన ఎదుగుదలకు ధ్యానమే ఆధారము. ఆ నిశ్శబ్దపు క్షణములలోనే ఆత్మయొక్క నిశ్శబ్ద అభివృద్ధి సంభవించును.

క్రతువులు

ఆరాధన, ప్రార్థనలు, క్రతువులు, మరియు ధ్యానములు మొదలైనవన్నీ అందరిలోని 'ఒకే' వెలుగుతో సంబంధమేర్పరచుకొనుటకు సాధనములు మాత్రమే.

పవిత్ర స్థలములు

పవిత్ర స్థలములలోకి ప్రవేశించేటప్పుడు జాగరూకులమై ఉండాలి. నిశ్చితమైన అభిప్రాయములతో ప్రవేశించకూడదు. ఆ 'సమక్షము'నందు ఉండుట తప్ప ఏమీ చేయరాదు.

పరమగురువులు

పరమగురువుల జీవితములు, వారి చర్యలు, మరియు వారి బోధనల అధ్యయనము మనకు స్ఫూర్తినిచ్చి, మన ఆలోచనా ధోరణులలో మార్పులు తీసుకువస్తాయి.

బృంద జీవనము

బృంద చైతన్యమునకు, బృంద కార్యములకు, స హృదయము ఒక్కటే మార్గము.

"మంద్రజాలము" వీడియో డాక్యుమెంటరీ


“ఈ సమూహము వ్యక్తుల బహిరంగ కలయిక కాదు. వారి హృదయముల అంతరంగ సమీకరణము.”

మాస్టర్ సి. వి. వి. | మాస్టర్ యమ్. యన్. మాస్టర్ ఇ. కె. | మాస్టర్ కె. పి. కె.
WTT వీడియో ఛానల్
మంద్రజాలము

కుంభ యుగపు చైతన్యమును ఆపాదించుకొని, భూమి, భూమి జీవులలో గ్రహగతుల ప్రభావము చక్క జేసి, వారి సూక్ష్మ దేహములకు అమరత్వము ప్రసాదించు రాజయోగ మార్గము నిచ్చుటకు అవతరించిన గురు పరంపర: మాస్టర్ సి. వి. వి (1868-1922), మాస్టర్ యమ్. యన్. (1883-1949), మాస్టర్ ఇ. కె. (1926-1984), మాస్టర్ కె. పి. కె. (1945 జననం).

వీరి జీవన విశేషాలు, ప్రబోధనలు తెలియజెప్పు ఈ దృశ్య శ్రవణ మాలిక (వీడియో డాక్యుమెంటరీ) ను జగద్గురు పీఠము అందించుచున్నది.




వీడియోలు
భాగము 1: మాస్టర్ సి. వి. వి. - కుంభ చైతన్య ప్రజ్ఞ భూమి జీవుల ఉద్ధరణమునకు వేగాన్ని జోడించే ప్రయోజనము కొఱకై పరబ్రహ్మమే తనకు తానుగా సంకల్పించుకొని శారమేయ మండలము ద్వారా 1910 వ సంవత్సరములో “హేలీ” తోక చుక్కను ఆధారము చేసుకొని కుంభ చైతన్యముగా భూమికి చేరుట జరిగినది. అది అందుకున్న కుంభ చైతన్య ప్రజ్ఞ “మాస్టర్ సి. వి. వి.”; వీరిని నీలగిరులలోని అగస్త్య అంశగా, అనంత ప్రాణప్రసారము కొరకు అవతరించిన తేజోమూర్తిగా, అవతార మూర్తిగా గుర్తించిరి. దివ్యజ్ఞాన సమాజం వారు అగస్త్యుల వారిని బృహస్పతి అవతారముగా కీర్తింతురు.

వీరు అందించిన “భృక్తరహిత తారక రాజ యోగము” జీవుల గ్రహస్థితులను చక్కపరిచి, త్వరితగతిన పురోగతి, శ్రేయస్సు కల్గించుచున్నది. కుంభ యుగమున శబ్ద తరంగములు బ్రహ్మానుభూతి వరకు జీవులను కొనిపోగలవు అని తెలియజేసి, “సి. వి. వి.” అనే బీజాక్షరాల ద్వారా కుంభ చైతన్య ప్రజ్ఞను మనకు అందించారు.
భాగము 2: మాస్టర్ ఇ. కె. (పూర్వ చరిత్ర, బాల్యము, యోవనము) మాస్టర్ ఇ.కె. వారి పితరులు శ్రీ అనంతాచార్యులవారి సన్నిహిత మార్గదర్శకత్వములో వేద విజ్ఞానము, సృష్టి నిర్మాణ రహస్యములు అధ్యయనము చేసి బాల్యము నందే పరిణతిచెందిరి. వారికి చిన్నతనమునే మాతృ వియోగము సంభవించినది. గాయత్రీ మాతను తన తల్లిగా నిరంతరము ఆరాధన చేయుటతో, ఆ విశ్వ మాత వాత్సల్యము చైతన్యముగా ఆయనకు లభించినది. వారు సహజకవిగా పద్యము, రచనలు జలధారలా చేసేవారు.
భాగము 3: మాస్టర్ ఇ.కె. - నూతన యోగ ప్రవేశ ప్రయాణము. మాస్టర్ యమ్. యన్. - అగ్ని జ్వాల మాస్టర్ ఇ.కె. గారి 24 వ ఏట, గాయత్రీ ఉపాసనా మార్గ సాధనలో మాస్టర్ సి. వి. వి. గారి అనుగ్రహ సందర్శనము లభించినది. ఈ అనుగ్రహము తదుపరి ప్రణాళికకు బీజమైనది. 1953 లో వారు, తమ జీవన ప్రయోజనము “సత్సంకల్ప కర్మ” గా జీవుల నుద్ధారణ చేయుటగా గుర్తించిరి. 1958 లో వారికి అనుగ్రహముగా, పరమ గురువుల పరంపరతో అనుసంధానము జరిగినది.

సూక్ష్మ లోకములలో మాస్టర్ ఇ. కె. గారికి మాస్టర్ యమ్. యన్. గారి తోడ్పాటు, సహచర్యము లభించినవి. మాస్టర్ యమ్. యన్. విశ్వాంతరాళమున అగ్ని ప్రజ్వలనగా యోగ సంతర్పణ చేసినవారు. వీరు మాస్టర్ సి. వి. వి. గారి ప్రతి చైతన్య ప్రతిరూపము మాత్రమే.
భాగము 4: మాస్టర్ ఇ. కె. - బోధన, స్వస్థత కార్యక్రమములు పరమ గురుపరంపరగా పిలువబడు “The Hierarchy”, మాస్టర్ ఇ. కె. గారిని తమ ప్రణాళికా నిర్వహణకు ప్రముఖముగా ఎంచుకొనిరి. కుంభరాశి చైతన్య విస్తరణ, అవగాహన కల్పించటముతో పాటుగా ఒక బోధకునిగా, స్వస్థత చేకూర్చు వైద్యునిగా, సృష్టి రహస్యములను, వేదవిజ్ఞానమును నూతన యుగ జీవులకు అందించుట తన కర్తవ్యముగా నిర్వహించిరి. హోమియో వైద్య సిద్ధాంతములు, పురాణ గ్రంథముల పరిచయము, విశ్లేషణ, వివరణలతో అర్ధశతకమునకు మించి గ్రంథములు ఇచ్చిరి.

వీరి ద్వారా 1977 నుండి బృందముల నిర్వహణ, ప్రవచనములు, స్వస్థత ప్రసారములు జరుగుట మొదలైనవి. చిత్తశుద్ధితో వీరి శిష్యబృందములు ఆ యోగ త్రయిని పాటించుచు, కొనసాగించుచున్నారు.
భాగము 5: మాస్టర్ ఇ. కె. గారితో మాస్టర్ కె. పి. కె. గారి సహచర్యము మాస్టర్ ఇ. కె. గారి ద్వారా వెలువడుచున్న దివ్య ప్రణాళికకు వాహికగా “జగద్గురు పీఠము” 1971 నవంబరు 18 వ తేదీన ఆవిర్భవించినది. జగద్గురువు మైత్రేయ మహర్షి పేరున ఈ సంస్థ నెలకొల్పబడినది. క్రమముగా ఈ సంస్థ కార్యకలాపములు, సేవలు అభివృద్ధి చెందుతూ జగద్వ్యాప్తమై విస్తరించినవి. ఈ క్రమములో మాస్టరు ఇ. కె. గారు 18 సంవత్సరముల పర్యంతం డా. కె. పార్వతీకుమార్ (మాస్టర్ కె. పి. కె.) గారితో కలిసి, వారికి సహచర్యము ప్రసాదించి, వారితో ఐరోపా ఖండ పర్యటనలలో కలిసి కార్యక్రమములు నిర్వహించుట జరిగినది.
భాగము 6: మాస్టర్ ఇ. కె. దేహత్యాగము. మాస్టర్ కె. పి. కె.: భౌగోళిక వ్యాప్తి మాస్టర్ ఇ. కె. గారు తమ ప్రాక్పశ్చిమ సంధాన కార్యక్రమములో భాగస్వామిగా మాస్టర్ కె. పి. కె. గారిని ఆహ్వానించిరి. 1984 లో మాస్టర్ ఇ.కె. గారి దేహత్యాగము వలన వారు మొదలిడిన పలు కార్యక్రమములు అసంపూర్తిగా నిల్చిపోయినవి.

ఈ బాధ్యతలు మాస్టర్ కె. పి. కె. గారు స్వీకరించిరి. వీరు ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక రంగముల యందు ఆధ్యాత్మికతను నేర్పుగా, ఓర్పుగా, సహజముగా మేళవించి సఫలీకృతులైన నేర్పరులు, బహుముఖ ప్రజ్ఞాశాలి. వీరందించిన సహచర్య శిక్షణ, స్ఫూర్తితో వందకుపైగా బృందములు ఐరోపా, ఉత్తర, దక్షిణ, మధ్య అమెరికా ఖండముల యందు 24 దేశములలో స్వయం సమృద్ధి, సేవా కార్యక్రమములు, యోగ సాధన యందు పనిచేయుచున్నవి.