ధ్యానము యొక్క అవగాహన
“ధ్యానము చేయునది కాదు, జరుగునది.”
ధ్యానములు, క్రతువులు
ధ్యాన ప్రక్రియ
ధ్యానము చేయుట కాదు; ధ్యానము జరుగును. ఉన్నతమైన వెలుగు (ప్రచోదనము) ను, స్పందనను చేరుకొనుటకు ధ్యానమునందు ఉండవలెను. భావముల యొక్క మూలమును చేరుట, “నేను ఎవరు?” అని శోధించుట, అనునది ప్రాథమిక ధ్యానము.
ధ్యానము యొక్క రహస్యము ఏమనగా: మనము ధ్యాన స్థితిని పొందుటకు ప్రయత్నము అవసరము లేదు, కాని, ధ్యానము కాని ఇతర స్థితులను వదిలివేయవలెను. ధ్యానము ఎవరికి వారు చేసుకొనే ప్రయోగము. మనిషి పరివర్తన చెందు క్రమము.
విఘ్నములను అధిగమించుట
ప్రతి అవరోధమునకు పరిష్కారము కలదు. ఆత్మను, శరీర స్పృహ మరుగు పరచుటవలన, మనము మన శరీరమునందు ఖైదు చేయబడుదుము. వ్యక్తుల శరీరము, ఇంద్రియములు మరియు ప్రవర్తన, స్వభావములచే వారి ఆహారపు అలవాట్లు, మాటలాడుట, చూచుట, వినుట మొదలగునవి ప్రభావితము చేయబడును. దానివలన వారి ప్రవర్తనలో సమతుల్యత లోపించును.
ఊర్థ్వలోకపు తరంగములను అందుకొనుటకు మనము మన జీవితమును చక్కని లయతో క్రమబద్ధీకరించుకొని, చాలా కాలము సాధన చేయవలెను.
ఆధ్యాత్మిక మార్గములో అభివృద్ధి
ప్రాథమిక సూత్రముల జ్ఞానము కలిగి ఉండటము మార్గము కాదు, దానిని మెల్లమెల్లగా ఆచరించుట మార్గము. ప్రాథమిక సూత్రములను నిరంతరము పాటించినచో అంతర్గత మార్పులు కలిగి వికాసమునకు దారితీయును. అవరోధములను అధిగమించుటకు ఎటువంటి ప్రత్యేకింపులు లేకుండా, స్వలాభము చూసుకోకుండా ఇతరులకు సహాయము చేయుట అనునది ముఖ్య సూత్రము.
గురువు యొక్క ఆవశ్యకత
గురువు సమాచారము అందించి, మద్దతు ఇచ్చి సహాయము చేయును. మార్గము తెలిసి, ఇతరులకు తెలియచేయగలవానిని “గురువు” అని పిలుతురు. గురువుయొక్క సాన్నిధ్యము సాధకుడు లేక శిష్యునిలో మార్పు కలిగించును, అది అయస్కాంతము వద్ద ఇనుప ముక్కలో కలిగిన మార్పువంటిది. గురువు సాధకుని అంతరంగము నుండి మార్గనిర్దేశము చేయును.
సద్గురువు ద్వారా లభించు ఈశ్వర సాన్నిధ్యము జిజ్ఞాసువులో కావలసిన మార్పులను కలిగించును. తన చుట్టు చేరిన జీవులకు వారి నిజ స్వరూపమును గుర్తుచేసి, వారు అమరులని, వెలుగు స్వరూపులని ఎవరికి వారు అనుభవము ద్వారా తెలుసుకొనునట్లు వారికి మార్గదర్శకత్వము వహించుటయే వారి లక్ష్యము.
గురువు యొక్క ఆవశ్యకత గురించి వివరములు