జగద్గురు పీఠము భౌగోళిక కేంద్రము
“ఈ సమూహము వ్యక్తుల బహిరంగ కలయిక కాదు. వారి హృదయముల అంతరంగ సమీకరణము.”
జగద్గురు పీఠము భౌగోళిక కేంద్రము అనగానేమి
జగద్గురు పీఠము భౌగోళిక కేంద్రము ( WTT గ్లోబల్) ఏ రాజకీయములకు గాని, సిద్ధాంతములకు గాని బద్ధము కాక, వ్యక్తికీ, బృందమునకు, ప్రాంతమునకు పరిమితము కాక, సక్రమమైన అవగాహనతో, సామరస్యముతో వ్యవహరించు సంస్థ. ఈ సంస్థ ఆశయములు:
- ఆధ్యాత్మిక విద్య ద్వారా మానవులలో ప్రజ్ఞా వికాసము కలిగించుటకు, తద్వారా పరిపూర్ణత్వము సాధించుటకు వలసిన అన్ని విషయములు సాధనాపరముగా తెలియజేయుట.
- మానవులకు గల బాధలను తొలగించుటకు (వైద్య, విద్య, ఆర్థిక విధానముల ద్వారా) తమవంతు సహకారము అందించుట.
- మానవులలో గల మానసిక, నైతిక విలువలను పెంపొందించుటకు కార్యక్రమములను ఏర్పరచుట.
- జాతి, మత, కుల వివక్షత లేక ఆధ్యాత్మిక విద్య యొక్క రహస్యము మరియు ఆవశ్యకతలను ప్రచోదనము గావించుట.
- సత్యదర్శనమునకై ఉన్ముఖులైన వారికి ఆధ్యాత్మిక శాస్త్ర విజ్ఞానమును ఆచరణాత్మకముగా ప్రసాదించుటకు నిరంతరము కృషి చేయుట.
సంస్థ యొక్క సాంఘిక చిరునామా బ్రూనెన్, కాంటన్ స్వెజ్, స్విట్జర్లాండ్.
భౌగోళిక కేంద్రమును సంప్రదించండి
కార్యనిర్వాహక వర్గము
జగద్గురు పీఠము భౌగోళిక కేంద్రము యొక్క కార్యనిర్వాహక వర్గము అన్ని దేశములలోని జగద్గురు పీఠము ప్రాంతీయ కేంద్రముల కార్యక్రమముల మరియు సమాచార సమన్వయమునకు సహకారము అందిస్తుంది.
కార్యనిర్వాహక వర్గము యొక్క కార్యక్రమములు:
- బృంద జీవనములను నిర్వహించుట.
- సంస్థ ఆర్థిక వ్యవహారములను నిర్వహించుట.
- జగద్గురు పీఠము యొక్క అన్ని అంతర్జాతీయ కేంద్రములకు సహకారము అందించుట.
- డా. కె. పార్వతీకుమార్ గారి ప్రబోధ యాత్రలను ఏర్పాటు చేయడము.
- పారాసెల్సుస్ కేంద్ర సంరక్షణము: Switzerland.
- "పారాసెల్సస్ – ఆరోగ్యము, స్వస్థత (English)" మాసపత్రిక ప్రచురణ.
- Publication of the వైశాఖ మాసపత్రిక (English), ఆధ్యాత్మిక పంచాంగము, మరియు పుస్తకముల ప్రచురణ.
- WTT వెబ్సైటును నిర్వహించుట.
- WTT-గ్లోబల్ పుస్తకముల ముద్రణ మరియు పంపిణీ.
జగద్గురు పీఠమునకు సంబంధించిన అన్ని బృందములు తమ భౌగోళిక కేంద్రము యొక్క శాసనములను మరియు నిబంధనలను నిర్వర్తించడానికి ప్రయత్నము చేస్తున్నాయి. అన్ని కార్యక్రమములను స్వచ్ఛందముగా, లాభాపేక్ష లేకుండా నిర్వహిస్తున్నాయి.
వార్షిక నివేదిక
జగద్గురు పీఠము భౌగోళిక కేంద్రము వారి వార్షిక నివేదిక జగద్గురు పీఠము స్ఫూర్తితో పాశ్చాత్య దేశములలో ఉన్న బృందములు నిర్వర్తిస్తున్న కార్యక్రమములకు ఒక విహంగదృశ్యము.
ఆన్లైన్లో చదవండి (English)
వార్షిక నివేదికను download చేసుకోండి (English)