{"timeout":"7000","width":"990"}
  • సుహృద్భావ సంబంధము
  • సరళత్వము మరియూ నిశ్శబ్దము యందుండి సేవ చేయాలి
  • సేవ యందు అభిలాష
  • బృందములకు సేవ

సుహృద్భావ సంబంధము

ఇతరుల అవసరములను గుర్తించి సహాయము అందించడమే, సుహృద్భావ సంబంధము ఏర్పరచుకొనుటకు ఆధారము.

సరళత్వము మరియూ నిశ్శబ్దము యందుండి సేవ చేయాలి

మనము, ఫలితము కోరని ఏదో ఒక సేవ, సరళత్వము మరియూ నిశ్శబ్దము యందుండి చేయాలి. దాని వలన ఆనందము కలగడమే కాక వ్యక్తిగత కర్మయందు గల ఋణముల నుంచి విముక్తి కలుగుతుంది.

సేవ యందు అభిలాష

అన్ని వేళలా సేవ చేయుటకు ఇచ్ఛ కలిగి, సేవ చెయ్యడానికి తగు అవకాశములను గమనించుకుంటూ ఉండడమనే వైఖరి నే సత్సంకల్పమందురు.

బృందములకు సేవ

బృందమునకు మనము ఏమి చేశాము అన్నది ఒక్కటే సేవకి కొలమానము. మన ఇంటి దగ్గర లేక మనము పని చేసే దగ్గర సహజ బృందములు వాటంతట అవే తయారవుతాయి. 'బృందము' అను పదమును మనము సంకుచితముగా నిర్వచించరాదు.

బాలభాను విద్యాలయములు

“ఆచరణాత్మకమగు పరమప్రేమయే సత్సంకల్పము”

సేవ | సేవా కార్యక్రమములు
భారత దేశమున జగద్గురు పీఠము యొక్క బృందములు

విలువలతో కూడిన విద్యా బోధన

బాలభాను విద్యాలయము

బాలభాను విద్యాలయము, విశాఖపట్నము యొక్క పట్టణ ప్రాంతమున నిర్వహించబడుచున్నది. ఇచ్చట అద్భుతమైన మౌలిక సదుపాయములు గలవు. అంతియే గాక, సాధారణ విద్యతో బాటుగా, ఆధ్యాత్మిక, నైతిక, సామాజిక విలువలు కూడా నేర్పించబడును. ఇక్కడి పాఠ్యాంశములలో నవీన శాస్త్ర పరిజ్ఞానము, సాంకేతికత తో పాటుగా ప్రాచ్య ఆధ్యాత్మికత మరియు పాశ్చాత్య వాస్తవికత యొక్క అపూర్వ సంయోగము కూడా జత చేసి బోధించబడును. ఈ విద్యాలయమున పై పాఠ్యాంశములతో పాటు, విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధి కొరకు, కంప్యూటర్ శాస్త్రము, యోగా, అన్నిరకముల క్రీడా వినోదములు, స్వరవాద్య సంగీతము తదితర పాఠ్య అంశములు ప్రాముఖ్యత ఇవ్వబడినవి.

ఈ విద్యాలయము, పదవ తరగతి వరకు బోధించుటకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము యొక్క అనుమతియే గాక, విలువల ప్రాధాన్యము తో కూడిన విద్యాబోధనకు గుర్తింపు పొంది ఉన్నది. విద్యాలయపు బాల బాలికలు, రాష్ట్ర విద్యా బోర్డు యొక్క పరీక్షలలో అద్భుతమైన ప్రజ్ఞను కనబరుస్తున్నారు. ఇప్పటి వరకు 10వ తరగతి పరీక్షలు వ్రాసిన 22 జట్లు 100% ఉత్తీర్ణత తో బాటు ప్రథమ శ్రేణి లో మంచి మార్కులతో విద్యార్థులు ఉత్తీర్ణులైనారు. విద్యాలయపు పూర్వ విద్యార్థులందరూ తమ తమ వృత్తులలో జయప్రదులై, జీవితములో చక్కగా స్థిరపడినారు.

మండలి యొక్క సమర్పణ బుద్ధి

బాలభాను విద్యాలయమునకు 1977 సంవత్సరము నుండి డా. కె. పార్వతీకుమార్ గారు మార్గదర్శియై ఉన్నారు. శ్రీమతి పార్వతీ వారణాసి గారు 1984 నందు విద్యాలయ ప్రధానోపాధ్యాయురాలిగా బాధ్యతలు స్వీకరించి కడుంగడు దీక్షతో పనిచేస్తున్నారు. ప్రస్తుతము ఆవిడ విద్యాలయ కార్యవర్గ సమితి లో ఉన్నారు. విద్యాలయ ప్రారంభము నుండీ ఉపాధ్యాయురాలిగా పనిచేయుచున్న శ్రీమతి శుభశ్రీ గారు, 2015 నుంచి ప్రధానోపాధ్యాయురాలిగా బాధ్యతలు స్వీకరించారు. ఆమెకు, విద్యాలయము మరియు సమాజ సేవలో ప్రత్యేక శ్రద్ధతో పనిచేసెడి అనుభవజ్ఞులు, అర్హులు, B.Ed పట్టభద్రులు ఐన శిక్షకుల అద్భుత సహాయ సహకారములున్నవి.

స్థాపన

డా. ఎక్కిరాల కృష్ణమాచార్య గారిచే 1977వ సంవత్సరమున, ఒకరి ఇంటి మీద వేసిన పూరిపాక లో, పది మంది విద్యార్థులతో ఈ బాలభాను విద్యాలయము ప్రారంభింపబడినది. అప్పట్లో గృహిణులు, పిల్లల తండ్రులు ఇందులో శిక్షకులుగా పనిచేసెడివారు. పసి పిల్లల లేత వయసునుండే సనాతన ధర్మము యొక్క మూలసూత్రములను బోధించవలెనని ఆ మహానుభావుడి యోచన, ఆశ. ఆనాటి నుంచీ ఈనాటి వరకూ విద్యాలయపు ముఖ్యోద్దేశ్యము అదే. మెల్లగా విద్యార్థుల సంఖ్య పెరిగి 1996వ సంవత్సరమున, మురళీనగర్, విశాఖపట్నమున, పచ్చని ప్రకృతి ఒడిలో, విద్యాలయము కొరకు ఒక అందమైన భవన నిర్మాణము జరిగినది. ఇప్పుడు విద్యాలయపు విద్యార్థుల సంఖ్య 400.

తెలుగు రాష్ట్రాలలోని శ్రీకాకుళం, మచిలీపట్టణం, కోడూరు, కడప లలో కూడా బాలభాను విద్యాలయములు నిర్వహించబడుతున్నవి.

బాలభాను విద్యాలయము

విద్యార్థులలో పరివర్తన

బాలభాను విద్యాలయములో విద్యార్థులు సమాజ దోపిడీదారులుగా కాక, సమాజ సేవకులుగా తీర్చిదిద్దబడుదురు. విద్యార్థులు బాధ్యత గల యువకులుగా, దిశా నిర్దేశకులై, సమాజానికి నిర్మాణాత్మకమైన సహాయ సహకారాలు అందించేవారుగా పరివర్తన చెందబడుదురు.

“బాలభాను” అనగా “బాల (ఉదయ) సూర్యుడు” అని అర్థం. అనగా, పిల్లలందరూ సూర్య భగవానుడి వలె నలుదెసలా విజ్ఞానపు వెలుగులు విరజిమ్మవలెనని ఆశించడమైనది.

బాలభాను విద్యాలయము