{"timeout":"7000","width":"990"}
  • ధ్యానము
  • క్రతువులు
  • పవిత్ర స్థలములు
  • పరమగురువులు
  • బృంద జీవనము

ధ్యానము

ఆంతరంగికమైన ఎదుగుదలకు ధ్యానమే ఆధారము. ఆ నిశ్శబ్దపు క్షణములలోనే ఆత్మయొక్క నిశ్శబ్ద అభివృద్ధి సంభవించును.

క్రతువులు

ఆరాధన, ప్రార్థనలు, క్రతువులు, మరియు ధ్యానములు మొదలైనవన్నీ అందరిలోని 'ఒకే' వెలుగుతో సంబంధమేర్పరచుకొనుటకు సాధనములు మాత్రమే.

పవిత్ర స్థలములు

పవిత్ర స్థలములలోకి ప్రవేశించేటప్పుడు జాగరూకులమై ఉండాలి. నిశ్చితమైన అభిప్రాయములతో ప్రవేశించకూడదు. ఆ 'సమక్షము'నందు ఉండుట తప్ప ఏమీ చేయరాదు.

పరమగురువులు

పరమగురువుల జీవితములు, వారి చర్యలు, మరియు వారి బోధనల అధ్యయనము మనకు స్ఫూర్తినిచ్చి, మన ఆలోచనా ధోరణులలో మార్పులు తీసుకువస్తాయి.

బృంద జీవనము

బృంద చైతన్యమునకు, బృంద కార్యములకు, స హృదయము ఒక్కటే మార్గము.

ఎలా ప్రారంభించాలి? కొన్ని సూచనలు

“బృందమున కలవలసినది తలలు కాదు, హృదయాలు”

జగద్గురు పీఠము మాస్టర్ సి.వి.వి గారి యోగమార్గమును అనుసరించును. ఇది నవీన కాలమున నూతన యోగము.
ఈ యోగమార్గము గురించి కొన్ని సూచనలు.

జగద్గురు పీఠములో ప్రవేశము | జగద్గురు పీఠము ప్రచురణలు ధ్యానమునకు సూచనలు సేవ | సంప్రదించుటకు

మాస్టర్ సి.వి.వి యోగ మార్గము

జీవుడు త్వరగా తరించుటకు ఈ యోగ మార్గము మాస్టర్ సి.వి.వి గారిచే ఇవ్వబడినది. ఇది సమన్వయాత్మక యోగము అని కూడా పిలువబడును. అంతటా నిండియున్న ఒకే ఒక తత్వముతో అనుసంధానము చెందుటయే ఆయన అందించిన బోధనలలోని ముఖ్య సారాంశము. మృత్యువును అధిగమించుటయే ఈ యోగము యొక్క ముఖ్య గమ్యము.

మాస్టర్ సివివి గారి యోగమార్గములో ప్రార్థన అత్యంత ప్రధామై యున్నది. అది సామాన్యముగా ధ్యానము అని పిలువబడిననూ, ఆయన దానిని ధ్యానముగా చెప్పలేదు. ఈ ప్రార్థన ద్వారా మాస్టరుగారు మనయందు ప్రవేశింతురు. మన యందు కలుగ వలసిన మార్పులకు మరియు వృద్ది కొరకు కావలసిన అన్ని సంకల్పములను ఆయన మన హృదయ పద్మము నుండి మనకు అందింతురు.

ప్రతిదినము ప్రార్థన యందు మనము సమన్వయాత్మక శక్తితో అనుసంధానము చెందుటకు “మాస్టర్ సివివి నమస్కారము” అను మహా వాక్యమును మాస్టర్ సివివిగారు అందించిరి.

ఈ మార్గమును అనుసరించుటకు, క్రింది మూడు సూత్రములను ఇచ్చి యున్నారు:

  1. ఉదయము, సాయంత్రము ఉభయ సంధ్యల యందు పైన ఇవ్వబడిన మహా వాక్యముతో ప్రార్థన చేయవలెను.
  2. సేవ కొరకు జీవితమును అంకితము చేయవలెను.
  3. సోంత లాభము కొరకు పనిచేయుట మానవలెను.

ఇది అన్ని వేళల యందు సేవా భావముతో, ఇతరుల శ్రేయస్సు కొరకు పనిచేయు ఆశయము కలిగి యుండు విధానము.

మాస్టర్ సివివి గారి ప్రార్థన గురించి మరిన్ని వివరములు

నిరంతర సాధన

మన సౌకర్యము ననుసరించి మాస్టర్ గారి యోగమార్గమును అభ్యాసము చేయరాదు. మన అభిప్రాయములతో యోగము యొక్క మూలసూత్రములను కలపరాదు. ఎటువంటి మార్పులు చేయకుండా సాధన చేయవలెను.

12 గంటల వ్యవధిలో, దినమునకు రెండు పర్యాయములు ప్రార్థన తప్పక చేసినచో మాస్టర్ చైతన్యము మనయందు స్థిరపడును. మన సౌకర్యము కొరకు ఎన్నుకొనిన సమయమును మార్చరాదు. తేలికగా తీసుకొనకుండా, ప్రార్థన మానకుండా తప్పక చేయుట ముఖ్యము.

చెప్పిన ప్రకారము, క్రమము తప్పక ప్రతిదినము ప్రార్థనయందు మాస్టరుగారిని పిలచినచో, ఆయన మన యందు పని చేయుట ప్రారంభించి కావలిసిన బోధనలను లోపలి నుండియే అందించును. నేను ఈ పుస్తము చదవాలి, నేను అతన్ని కలవాలి, నేను అక్కడికి వెళ్ళాలి అన్న భావనలు మనకు కలుగును.

మన జీవితమునకు కావలసిన అన్ని సర్దుబాట్లు ఉభయ సంధ్యల యందలి ప్రార్థన ద్వారా జరుపబడును. ప్రార్థనను అశ్రద్ద చేసినచో మన ఆత్మోన్నతి కుంటు పడును.

ఈ యోగాను మనం కనీసం 12 సంవత్సరాలు భక్తితో సాధన చేయాలి.

పరిపూర్ణమైన యోగము

ఈ యోగము పరిపూర్ణమైన యోగము. దీనిని ఇతర సాంప్రదాయ లేక మతపరమైన అభ్యాసములతో కలపవలసిన పని లేదు. కాని ఇతర అభ్యాసములను చేయదలచినచో చేయవచ్చును. ఆప్పుడు ఈ యోగము వల్ల పొందిన శక్తి ఇతర అభ్యాసములను బాగుగా చేయుటకు ఉపయోగపడును.

ఈ యోగమును సాధన చేయునపుడు, ఇతర అభ్యాసములను దీనితో కలపరాదు. ఇతర యోగములను విడిగా సాధన చేయవచ్చును.

మొదటి ప్రాధాన్యత

ఈ యోగములోనికి ప్రవేశించిన తరువాత దీనికి మొదటి ప్రాధాన్యత ఇవ్వవలెనని తెలియవలెను. మన జీవితము నందు అన్నివిషయముల కంటే ఈ యోగమే ప్రాధాన్యమై యుండవలెను. ఈ విధమైన దృక్పధము మన యందు యోగము త్వరగా పూర్తి అగుటకు అవకాశము కలిగించును.

ఈ యోగము చేయు సమయమున, మనము సహజమైన సాధారణ జీవితము గడుపుచు ఇతరములను వేటినీ అశ్రద్ధ చేయరాదు. కనుక ఈ యోగము పై అతి విశ్లేషణ చేయరాదు. యోగమనగా మనము సహజముగా ఉండుటయే. సహజత్వము సమన్వయమునకు దారితీయును

శరీరము, ఆరోగ్యము మరియు నిద్ర

ఈ యోగము శరీరమునకు సంబంధించిన ఆసనములకు చెందినది కాదు; ఇది శరీరము కన్నా ఎక్కువ మనసుతో పనిచేయును. భౌతిక ఆసనముకన్నా, మానసిక స్ధిరత్వము అత్యంత ముఖ్యము.

అయినప్పటికీ, సూక్ష్మ మరియు కారణ శరీరములు వృద్ధిపొందుటకు భౌతిక శరీరమే ఆధారము. కనుక మనము భౌతిక శరీరమును అశ్రద్ధ చేయక, చక్కని ఆరోగ్యమును దృఢత్వమును కాపాడుకొన వలెను. ఆరోగ్యము సరిగా లేనిచో యోగాభ్యాసమును కొనసాగించలేము. కనుక కనీస ఆరోగ్యమును కలిగియుండుట మన బాధ్యత.

మనము ఆహారము, పని, భాషణము, విశ్రాంతి, విహారం మరియు నిద్రల యందు మితము వహించాలి. అన్ని సమయముల యందు మనము ఆరోగ్యముగా ఉండుటకు అనువైన దినచర్యను కలిగి యుండవలెను. మన శరీరము, కార్యకలాపములు మరియు నిద్ర ఏవీ కూడా మన యోగాభ్యాసమునకు అడ్డుకాకూడదు.

మనము నిద్రించునపుడు మన మనస్సు, స్వభావము మరమ్మత్తు చేయబడును. కనుక ఈ యొగాభ్యసము చేయు సాధకులకు నిద్ర ఎంతో ముఖ్యమైనది. మనము నిద్రకుపక్రమించినపుడు, ప్రార్థన చేసి, మనయందు కావలసిన మార్పులకొరకు మనము మాస్టారుగారి సాన్నిధ్యమునకు వెళ్లుచున్నాము అని తెలిసియుండవలెను. “నీవు నిద్రించునపుడు, నీ సూక్ష్మ శరీరమును, భౌతిక శరీరము నుండి వేరుచేసి నీ యందు కావలసిన జ్ఞానమును అందించు” నని మాస్టారు గారు చెప్పి యున్నారు.

కొన్ని హెచ్చెరికలు

చంచలమైన ఆవేశపూరిత మనస్తత్వము గలవారికి ఈ యోగము సరియైనది కాదు. ఉదారమైన సేవకు అంకితమై భావావేశములను తొలగించుకొనవలెను.

కనీసపు ఆర్ధిక స్థిరత్వము లేకుండా మనము ఈ యోగము నందు ప్రవేశించరాదు. మనము ఆర్ధికంగా ఇతరులపై ఆధారపడి యుండరాదు. ఆర్థికంగా, మన ప్రాథమిక అవసరాలను తీర్చగల కార్యాచరణను కలిగియుండవలెను. అలా కానిచో, మొదట దాని కోసం పని చేయాలి. లేకపోతే, మనసుకు స్థిరత్వం లేక సాధన యందు ఊగిసలాడుతుంది.

ఈ యోగము మనకు భౌతికంగా, ఆర్థికంగా, ఇంటా, బయటా కూడా అన్నివిధములుగా స్థిరత్వము పొందుటకు సహాయపడును, ఎందుకంటే యోగమునకు అన్నీ ముఖ్యమే. మాస్టర్ సివివి గారి యోగ మార్గములో కనీస సరదాలు కూడా నిషేదించబడలేదు. వివాహము చేసుకోకుండా, కుటుంబము లేకుండా, ఉద్యోగం చేయకుండా - మరి ఎట్లా జీవించాలి అని అలోచించ నవసరము లేదు.

సంఘ వ్యతిరేక అంశాలను కలిగి ఉన్న వ్యాపారం లేదా ఉద్యోగం ఏదైనా అటువంటి దానిని మనం చేయరాదు మరియు అలాంటి కార్యకలాపాలకు మనము మద్దతు ఇవ్వకూడదు లేదా ప్రోత్సహించకూడదు. సంఘ వ్యతిరేకమైన కార్యక్రమముల వలన మనయందు భయము పెరిగి మరుగున దాక్కొనవలసి వచ్చును. భయం ఉన్నచోట, యోగాభ్యాసం నిరోధించబడుతుంది.

మనం సమయం, శక్తి మరియు డబ్బును అవసరానుగుణంగా ఖర్చు చేయాలి. అదే సమయంలో, మన వైఖరిలో కఠినంగాకాని లేక మొండిగాకాని ఉండక, సరళంగా వీలుకలిగి యుండవలెను.

మనం ఇతరుల వ్యవహారాల పట్ల ఆసక్తిగా ఉండకూడదు లేదా ఇతరుల గురించి అభిప్రాయాలు కలిగి ఉండకూడదు. ఇతరులు వారి జీవితాల గురించి మాట్లాడేటప్పుడు, మనం శ్రద్ధగా వినాలి, ఉదాసీనంగా ఉండకూడదు. మన బృందములో లేదా మన కుటుంబంలోని ప్రతి దాని గురించి మనకు తెలియజేయాలని అనుకోకూడదు. మనం తెలుసుకోవలసిన దాని గురించి ప్రకృతి తెలియజేస్తుంది

జ్ఞానం మార్గం

ఈ యోగ మార్గాన్ని అనుసరించాలని నిర్ణయించుకున్నప్పుడు, మనం దానిని గుడ్డిగా అనుసరించకూడదు, కానీ మనం ఏమి చేస్తున్నామో అర్థం చేసుకోవాలి. సాధన చేసే ముందు జ్ఞానం ఎంతో అవసరము.

మాస్టర్ సివివి గారి యోగ మార్గం సూటియైన జ్ఞాన మార్గం, కేవలము విశ్వాసంతో కూడిన మార్గం మాత్రమే కాదు, మాస్టర్ గారిపై మనకు ఉన్న విశ్వాసం మనల్ని మాస్టారుగారు మార్గదర్శకత్వము చేయటానికి ఉపయోగ పడుతుంది.

Master CVV

మాస్టర్స్ బోధలను చదవండి

ప్రతిరోజూ మాస్టర్స్ యొక్క కొన్ని బోధనలను మనం కనీసం 10 నుండి 30 నిమిషాలు చదవాలి; లేకపోతే మన శ్రద్ద తగ్గుతుంది. చదివినవి నోట్స్ రాసుకోవాలి. ఇది క్రమంగా మన మనస్సును వికసింపజేసి, బుద్ధి లోకంలోకి ప్రవేశించటానికి మార్గము సుగమము చేస్తుంది.

A tip: Masters of Wisdom జీవితమే ఒక బోధన. వారి జీవిత చరిత్రలు ఉత్తేజపరిచి చాలా జ్ఞానాన్ని ఇస్తాయి.
మాస్టర్ సివివి: The Aquarian Master; మాస్టర్ యమ్.యన్ - The Fiery Flame; మాస్టర్ ఇకె; మాస్టర్ కెపికె.

నావాణి మాస ప్రత్రిక పరమగురువుల బోధనలను సరళమైన రీతిలో అందించును.

సంప్రదించుటకు / చందా Email navani_7@yahoo.com
Phone 0891-2701531
చిరునామా
జగద్గురు పీఠము, రిట్రీట్ సెంటర్
15-7-1, ఏంజిల్స్ ఎన్క్లేవ్, కృష్ణా నగర్
విశాఖపట్టణము, ఆంధ్ర ప్రదేశ్ - 530 002

సహాయపడుతూ కలిసి పనిచేయడం

ఇతరులకు సహాయం చేసే వైఖరి మనలో ఉండాలి. మనం సహాయము చేయగలిగినపుడు తప్పించుకొనకూడదు , కానీ మనకు సాధ్యమైనంత మాత్రమే సహాయం చేయాలి. జీవితము యెడల విచక్షణతో కూడిన వైరాగ్యమును కలిగియుండుట ముఖ్యము.

భిన్నత్వంలో ఏకత్వం చూడటం నేర్చుకోవాలి. సాధ్యమైనంతవరకు కలిసి పనిచేయాలి. సహకరించే ప్రయత్నంలో, ఎలా చేయాలో తెలియని పనిని మనం అంగీకరించకూడదు. మనం పనిచేసేముందు తెలుసుకొని చేయాలి.

సందేహ నివృత్తి

ఈ యోగా గురించి మనకు ఏమైనా సందేహాలు ఉంటే, సీనియర్ సభ్యుల వద్దకు వెళ్లి ఈ సందేహాన్ని తెలియాచేసి దాన్ని నివృత్తి చేసుకోవాలి. మనస్సులో సందేహంతో కొనసాగకూడదు.

మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే లేదా సమూహంలో చేరాలనుకుంటే, మమ్మల్ని సంప్రదించండి.

అనేక అంశాలపై సమాచారాన్ని సులభంగా కనుగొనడానికి మీరు వెబ్సైట్ యొక్క కుడి ఎగువ భాగంలో ఉన్న శోధన ఫంక్షన్ను కూడా ఉపయోగించవచ్చు.