Friends of World Teacher Trust (ఫ్రెండ్స్ ఆఫ్ వరల్డ్ టీచర్ ట్రస్ట్)
“ఈ సమూహము వ్యక్తుల బహిరంగ కలయిక కాదు. వారి హృదయముల అంతరంగ సమీకరణము.” జగద్గురు పీఠము | ఎలా ప్రారంభించాలి? కొన్ని సూచనలు Guidelines to Members | సంప్రదించుటకు
కమ్యూనికేషన్ వేదిక
“ఫ్రెండ్స్ ఆఫ్ వరల్డ్ టీచర్ ట్రస్ట్”(జగద్గురు పీఠం మిత్ర బృందము) అనునది మాస్టర్ CVV, మాస్టర్ EK and మాస్టర్ KPK నుండి వచ్చే WTT యొక్క ముఖ్యమైన బోధనలను అందరికీ అందించుటకు మరియు బోధించుటకు ఏర్పడిన వేదిక. గురు పరంపర బోధనలు, వరల్డ్ టీచర్ ట్రస్ట్ బోధనలు ట్రస్ట్ సభ్యులకే పరిమితమవ్వకుండా స్నేహితులు, బంధువులు మరియు భావసారూప్యత గల వ్యక్తులకు కూడా పరిచయం చేయబడి అందింపబడాలన్న ఆలోచనకు కార్యరూపమే ఈ కమ్యూనికేషన్ చానల్.
“ఫ్రెండ్స్ ఆఫ్ వరల్డ్ టీచర్ ట్రస్ట్” కార్యకలాపాల కోసం, శంఖం యొక్క చిహ్నాన్ని అంతర్జాతీయ స్థాయిలో ఉపయోగించడం కోసం డాక్టర్ కె. పార్వతి కుమార్ గారు ఎంపిక చేశారు. ఈ చిహ్నాన్ని ఉపయోగించడం యొక్క ప్రధాన లక్ష్యం గురు పరంపర నుండి వెలువడుతున్న విజ్ఞానమును, వారి అనుయాయులు/ సాధకుల నుండి అందింపబడుతున్న బోధనలను వేటికి అవిగా వర్గీకరించటమే
ప్రెజెంటేషన్ ఉపకరణాలు
“ఫ్రెండ్స్ ఆఫ్ వరల్డ్ టీచర్ ట్రస్ట్” కార్యకలాపాల బోధనలు లేదా వీడియో రికార్డింగ్‌ల ప్రదర్శన కోసం స్లయిడ్ టెంప్లేట్‌లు అందించబడతాయి. స్లయిడ్ల రూపకల్పన “ఫ్రెండ్స్” యొక్క ప్రెజెంటేషన్ లో భాగం. ఇంట్రో మరియు అవుట్రో స్లయిడ్‌లలో ముందే నిర్వచించిన లేఅవుట్ లోని పరిచయ వాక్యాలతో స్లైడ్, మరియు ప్రెజెంటేషన్ చివరన ముగింపు స్లైడ్ యథాతధంగా వినియోగించాలి.
బోధనలనందించే సోదరులు తమ ప్రెజెంటేషన్‌ల కోసం (మాక్ & విండోస్ ) ఈ టెంప్లేట్‌లను మరియు యూట్యూబ్ ఛానెల్‌ని ఉపయోగించుకొనగలరు.
ప్రారంభం మరియు చివరిలో క్రెడిట్‌లు మరియు ముగింపు పేజీ ల లేఅవుట్ టెంప్లేట్‌ను ప్రెజెంటేషన్ ఉపకరణాలు
(నందు పవర్‌పాయింట్ ఫైల్ లో కనుగొనవచ్చు)
యూట్యూబ్ ఛానెల్
“ఫ్రెండ్స్ ఆఫ్ వరల్డ్ టీచర్ ట్రస్ట్” కార్యకలాపాల ప్రదర్శన కోసం ఒక యూట్యూబ్ ఛానెల్ ప్రారంభింపబడినది “Friends of World Teacher Trust”.
ఇప్పటికే కొన్ని వీడియోలు అక్కడ ప్రచురించబడ్డాయి.
వివిధ భాషలలో మీ వీడియోలను ఎలా అప్‌లోడ్ చేయాలో తెలియజేసే మార్గదర్శకాలతో ఒక డాక్యుమెంట్ కూడా Friends of WTT: YouTube – how to upload నందు పొందుపరచబడినది.
సంప్రదించుటకు
ఒక చిన్న బృందం ఈ “ఫ్రెండ్స్ ఆఫ్ వరల్డ్ టీచర్ ట్రస్ట్” కార్యకలాపాలను సమన్వయిస్తున్నది. వారు బోధకులకూ, సాధకులకూ ఈ జ్ఞాన యజ్ఞములో ఆవశ్యకమైన సహాయ సహకారములను అందిస్తూ గురు పరంపరానుగత బోధనలకు, ఛానెల్ యొక్క ఆశయములకు విధి విధానములకు మీ వీడియో సముచితం గా ఉన్నదో లేదో గమనించి తగు సలహాలను, సూచనలనను, ప్రోత్సాహమును అందిస్తూ తోడ్పడగలదు. వారిని ఈ క్రింది ఈ-మెయిల్ లో సంప్రదిచవచ్చు.
Contact Friends of World Teacher Trust