గురుపరంపర మూలములు
“ఈ సమూహము వ్యక్తుల బహిరంగ కలయిక కాదు. వారి హృదయముల అంతరంగ సమీకరణము.”
మాస్టర్ సి. వి. వి. | మాస్టర్ యమ్. యన్.
మాస్టర్ ఇ. కె. | మాస్టర్ కె. పి. కె.
WTT వీడియో ఛానల్
జగద్గురు పీఠము ఈ గురుపరంపర వాహికగా వారి మార్గదర్శకత్వములో నిర్వహించబడుతున్నది:
- మాస్టర్ సి. వి. వి. (1868-1922) విశ్వమానవ శ్రేయస్సు, విశ్వాంతరాళమును పరిరక్షించుటకు “భృక్త రహిత తారక రాజ యోగము” ప్రసాదించిరి.
- శ్రీ మైనంపాటి నరసింహం (మాస్టర్ యమ్. యన్., 1883-1940) మాస్టర్ సి. వి. వి. గారి వద్ద 1919 లో ఉపదేశము పొందిరి. వేలాది కుటుంబములలో యోగము నిర్వర్తింప చేసి, యోగము ద్వారా కర్మ బంధములనుండి విముక్తులను గావించిన సిద్ధ పురుషులు.
జగద్గురు పీఠమునకు స్ఫూర్తిని కలుగచేసి, తమ జీవన విధానము, బోధనల ద్వారా ఆరాధ్యులైన వారు:
- డా. ఎక్కిరాల కృష్ణమాచార్య (మాస్టర్ ఇ. కె., 1926-1984) జగద్గురు పీఠమును స్థాపించిన వినూత్న యోగి.
- డా. కంభంపాటి పార్వతీకుమార్ (మాస్టర్ కె. పి. కె., 1945-2022), ప్రెసిడింట్ WTT-గ్లోబల్ 1984-2022.
జగద్గురు పీఠము, ప్రవచన పాఠములను, యోగజీవన రహస్యములను, మానవాళికి అందుబాటులోనికి తెస్తున్నది. ఈ విజ్ఞానము ప్రాక్పశ్చిమ దేశములలోని బృందములను సత్ప్రవర్తన మార్గమున నడిపించుచున్నది.