{"timeout":"7000","width":"990"}
  • శబ్దము యొక్క శక్తి
  • ఛందము మరియు క్రతువు
  • నిశ్శబ్దమును వినుట

శబ్దము యొక్క శక్తి

శాంతి కొరకు ప్రదర్శనలు చేయుట కన్నా, బృందములుగా ఓంకార నాదోచ్చారణ చేయుట వలన సూక్ష్మ లోకముల పై మంచి ప్రభావము కలిగి ప్రపంచ శాంతి సిద్ధించును.

ఛందము మరియు క్రతువు

అన్నిలయాత్మక కార్యములు మరియూ క్రతువులూ మన శరీరధాతువులలో సహజముగా మార్పులు తీసుకువచ్చుటే లక్ష్యముగా చేసుకొని, మనము త్వరితగతిన అభివృద్ధి చెందడానికి తోడ్పడతాయి.

నిశ్శబ్దమును వినుట

నిశ్శబ్దమును విన్నప్పుడు మనకి ఝంకార నాదము వినిపిస్తుంది. ఇది హృదయ కేంద్రములో వినిపించే నిశ్శబ్దము యొక్క స్వరము మరియూ నిశ్శబ్దమైన ధ్వని.

పండుగలు

“ధ్యానము చేయునది కాదు, జరుగునది.”

ఉత్తరాయణ సంక్రమణము, దక్షిణాయన సంక్రమణము, మరియు రెండు విషువత్ దినములు సంవత్సర చక్రములోని నాలుగు అతి ముఖ్యమైన పండుగలు. ప్రకృతికి అనుగుణముగా ఉన్న ఈ పండుగలను సద్గురువు శిష్యులైన మనము ఆచరించాలని పరమగురు పరంపర ఆశిస్తున్నది.


ధ్యానములు, క్రతువులు

వైశాఖ పూర్ణిమ

యోగులు ఏ విధముగా సంవత్సరము యొక్క సంకల్పము మరియు ప్రణాళికతో అనుసంధానము చెందుతారో, అదే విధముగా మనము కూడా సత్సంకల్ప కార్యములు చెయ్యడానికి వలసిన ఒక నూతన సంకల్పశక్తిని అందుకోవడానికి వృషభ పూర్ణిమ సమయములో సంధానము చెంది ఉండవలెను. వృషభాక్షము నుండి వెలువడే సంకల్ప విశ్వే శక్తులు చంద్రుడి ద్వారా ప్రతిబింబింపబడతాయి మరియు అందుకోబడతాయి. వృషభ పూర్ణిమ సమయములో చంద్రుడు వృశ్చిక రాశిలోని విశాఖ నక్షత్ర మండలము వద్ద ఉంటాడు. అందువలనే వృషభ పూర్ణిమను వైశాఖ పూర్ణిమ అని కూడా అంటారు. అనాదిగా హిమాలయములలో ఈ సమయమును వైశాఖ పండుగగా జరుపుకుంటున్నారు. గౌతమ బుద్ధుని వద్ద నుంచి ఈ సమయమును అతని జ్ఞానోదయపు పండుగగా కూడా జరుపుకుంటున్నారు.

వైశాఖ పూర్ణిమ గురించి వివరములు

మే కాల్ డే

29 మే 1910 నుంచి మాస్టర్ సి. వి. వి. గారు తాను ఊర్ధ్వ లోకముల నుంచి అందుకున్న కుంభ చైతన్యపు ప్రజ్ఞను భూగోళమునకు మరియు భూమి మీద ఉన్న జీవులకు ప్రసారము చెయ్యడము మొదలుపెట్టారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరము 29 మే దినమును బృంద ఉపదేశ పర్వదినముగా వేడుక జరుపుకుంటున్నారు. దీనినే “మే కాల్ డే” అని అంటారు.

మే కాల్ డే గురించి వివరములు

ఉత్తర విషువత్

మేష రాశి శూన్య డిగ్రీల కోణమునందు వచ్చే ఉత్తర విషువత్, సౌరమాన సంవత్సరమునకు ఆరంభము. ఈ సమయములో సూర్య భగవానుడు ఊర్ధ్వ లోకముల నుంచి ఒక నూతన ప్రేరణను మనకు అందజేస్తాడు. ఈ సమయము ఉచ్చస్థితుడైన సూర్యునకు మరియు అత్యుత్తమమైన జ్ఞానోదయమునకు సంకేతము.

ఉత్తర విషువత్ గురించి వివరములు

 రాశి చక్రము

దక్షిణాయన సంక్రమణము

ఉత్తరాయణ సంక్రమణము, దక్షిణాయన సంక్రమణము, మరియు రెండు విషువత్ దినములు సంవత్సర చక్రములోని నాలుగు అతి ముఖ్యమైన పండుగలు. ఈ ముఖ్యమైన సమయములలోని శక్తుల సహాయము వలన జ్ఞానము అనేక పొరలుగా మనలో వికసించే అవకాశమున్నది. ఈ పుణ్య సమయములతో అనుసంధానము చెందడము వలన సూక్ష్మ అవగాహనలు మనము పొందగలిగే అవకాశమున్నది.

దక్షిణాయన సంక్రమణము గురించి వివరములు

దక్షిణ విషువత్

విషువత్ దినములలో పగలు, రాత్రులు సమానముగా ఉంటాయి మరియు ప్రకృతిలో ప్రజ్ఞ, పదార్థముల సమతుల్యత ఉంటుంది. ఈ సమయములలో యోగపరమైన శక్తులు అత్యుత్తమముగా లభిస్తాయి, మరియు యోగ సాధనకు విశేషముగా అనుకూలముగా ఉంటాయి. సంవత్సరపు అర్థరాత్రము అయిన దక్షిణ విషువత్ దినమునందు వెలుగుతో అనుసంధానము చెందడము అతి ముఖ్యమైనది.

దక్షిణ విషువత్ గురించి వివరములు

ఉత్తరాయణ సంక్రమణము

ఒక రాశి నుంచి ఇంకొక రాశిలోకి సూర్యుని గమనమును, మరియు రోజులోని, మాసములోని, సంవత్సరములోని ముఖ్యమైన బిందువులలోకి సూర్యుని గమనమును మనము జాగ్రత్తగా గమనించవలెను. అలా చెయ్యడము వలన మనము శక్తులలో జరుగుతున్న మార్పులను అనుభవించి, వాటితో లయబద్ధముగా మనము అనుసంధానము చెందవచ్చును.

ఉత్తరాయణ సంక్రమణము గురించి వివరములు