మాస్టర్ సి. వి. వి.
“ఈ సమూహము వ్యక్తుల బహిరంగ కలయిక కాదు. వారి హృదయముల అంతరంగ సమీకరణము.”
కంచుపాటి వెంకటరావు వెంకాస్వామిరావు
జగద్గురు పీఠము గురుపరంపర మూలములు
దక్షిణ భారతదేశము నందలి, దేవాలయముల నగరముగా ప్రసిద్ధి గాంచిన క్షేత్ర రాజము, “కుంభకోణము” అను పట్టణమున “కంచుపాటి వెంకటరావు వెంకాస్వామిరావు” అను నామధేయముతో మాస్టర్ సి. వి. వి. గారు 1868 వ సంవత్సరము ఆగష్టు 4 వ తేదీన అవతారమూర్తిగా ఉదయించారు. కుంభకోణము పేరులో కుంభ రాశికి కోణ దృష్టిలో యున్న వాయు రాశి అయిన మిథున రాశిలో ఈ యోగము ఉపదేశింపబడుట ఒక రహస్య సంకేతము.
మాస్టరు గారికి 12 సంవత్సరముల వయస్సులో సౌ. రుక్మిణి అను బాలికతో వివాహము జరిగినది. ఆమె ద్వారా ముగ్గురు కుమార్తెలు మరియు ముగ్గురు కుమారులు కలిగారు. ఆయనకు 36 సంవత్సరముల వయస్సులో భార్యా వియోగము సంభవించినది. తరువాత వారికి 38 సంవత్సరముల వయస్సులో సౌ. వెంకమ్మ గారితో ద్వితీయ వివాహం జరిగినది. తద్వారా ముగ్గురు కుమారులు మరియు ఒక కుమార్తె కలిగిరి.
మాస్టరు గారు సంస్కృతము, తెలుగు, తమిళము, మరియు ఆంగ్ల భాషలలో అనర్గళంగా సంభాషించేవారు. వేదవిద్యలలోను మరియు సంగీతములోను వారు అత్యంత ప్రావీణ్యులు. నగరంలో మేయరుగా అత్యంత ప్రధాన పాత్ర పోషించి, బహుముఖ ప్రజ్ఞాశాలిగా, అత్యంత ప్రముఖులుగా గుర్తింపు పొందారు.
వారు బాహ్యమునకు వ్యాపారవేత్తగా, అతి సామాన్యముగా, సాధారణ జీవనము సాగించినట్లుగా కనిపించినప్పటికీ, ప్రధానముగా వారు భూమికి, భూమి జీవులకు ఉద్ధరణము కల్గించే మహత్తర కార్యక్రమము వర్తింపచేయుటకు దిగివచ్చిన అవతారమూర్తి.
భూమి జీవుల ఉద్ధరణమునకు వేగాన్నిజోడించే ప్రయోజనము కొఱకై పరబ్రహ్మమే తనకు తానుగా సంకల్పించుకొని శారమేయ మండలము ద్వారా 1910 వ సంవత్సరములో “హేలీ” తోక చుక్కను ఆధారము చేసుకొని కుంభ చైతన్యముగా భూమికి చేరుట జరిగినది. ఆ కుంభ చైతన్య ప్రజ్ఞను అందుకున్నవారు “మాస్టర్ సి. వి. వి.”. వీరు నీలగిరులలో నివసించు అగస్త్య అంశగా, అనంత ప్రాణప్రసారము కొరకు అవతరించిన తేజోమూర్తి, అవతారమూర్తి. దివ్యజ్ఞాన సమాజం వారు అగస్త్యులవారిని బృహస్పతిగా గుర్తింతురు.
వీరు అందించిన “భృక్తరహిత తారక రాజ యోగము” జీవుల గ్రహస్థితులను చక్కపరిచి, త్వరితగతిన పురోగతి, శ్రేయస్సు కల్గించుచున్నది. కుంభ యుగమున జీవులు బ్రహ్మానుభూతి పొందుటకు శబ్ద తరంగములే ఆధారము అని తెలియజేసి, “సి. వి. వి.” అనే బీజాక్షరాల ద్వారా కుంభ చైతన్య ప్రజ్ఞను మనకు అందించారు.
మాస్టర్ సి. వి. వి. గారు 1922 సంవత్సరము మే నెల 12 వ తేదీన ముందుగా తెలియజేసిన సమయములో తమ దేహత్యాగము చేసిరి.
జగద్గురు పీఠము, మాస్టర్ సి. వి. వి. గారి పర్యవేక్షణలో, అంతరంగ ప్రణాళికగా, యోగసాధన నిర్వహించుచున్నది. ఈ నూతన యోగ ప్రవక్తగా మాస్టరు గారి నిర్దేశములు:
- బృందములను విజ్ఞానము మరియు ఆత్మ చైతన్యపు ప్రసార వాహికలుగా తీర్చి దిద్దుట.
- “మాస్టర్ సి. వి. వి. నమస్కారం” అను మంత్రోచ్చారణ, దాని శబ్ద తరంగముల ద్వారా జీవుల పంచభూతాత్మకమైన దేహము, మరియు అంతరంగ మానసిక, సూక్ష్మ శరీరములను శుభ్ర పరచుట.
- జీవుల యందు అస్వస్థతలను నిర్మూలించి, పరిపూర్ణ సూక్ష్మ శరీర నిర్మాణము గావించుట.
- జీవుల యందలి వ్యక్తిగత “కుండలిని” మేల్కొలిపి, ఇతర జీవుల కుండలినితోను, విశ్వ కుండలినితోను సమన్వయము గావించుట.
మాస్టరు గారు నిర్దేశించిన ధ్యానము:
- అంతర్యామిగా ఉన్న బ్రహ్మమును గుర్తించవలెను. ధ్యానములో పరిమితులను దాటి, మొదటగా తన గురు రూపము కాంతులను ఆధారము చేసికొనియున్ననూ, క్రమముగా శబ్దము, రంగు, రూపము, ఆలోచనలను దాటి కేవలము బ్రహ్మము యందు ధ్యానము స్థిరపడవలెను.
- ధ్యానము, ప్రార్థనలకు ఒక నియమిత సమయము కేటాయించుకొనవలెను. ఉదయ, సాయం సంధ్యలు, అనగా ఉదయం మరియు సాయంత్రము 6 గంటల సమయమును నియమించుకొనవచ్చును.
- 3 సార్లు కాని, 7 సార్లు గాని ఓం కారమును మృదువుగా, దీర్ఘముగా, సామాన్య వేగముతో ఉచ్చరించవలెను. ఓంకారము తప్పనిసరిగా తాను వినవలెను.
- మాస్టరు గారిని మనసులో దర్శిస్తూ – “నమస్కారమ్స్ మాస్టర్ సి. వి. వి.” అను మంత్రము ఉచ్చరించి, ధ్యానించవలెను.
- తరువాత 15 నిమిషములు మౌనము పాటిస్తూ, లో తట్టున ఏమి జరుగుతున్నదో గమనించవలెను (Dip Deep). అంతరంగమున ఆలోచనల పుట్టుక స్థానమును గమనించవలెను.
ఈ విధముగా శరీరములో సర్దుబాట్లు జరిగి, అవరోధములు తొలగును. ప్రాణశక్తి ధారాళముగా, అడ్డములు లేకుండా సాగును. ప్రాణశక్తి ప్రసరణ వలన శరీరములో జరుగవలసిన సర్దుబాట్లు, మరమ్మత్తులు జరిగి సూక్ష్మ శరీర నిర్మాణమునకు ఉపకరించును. శరీరమంతటా శక్తి ప్రసారము జరుగుటకు కనీసము 15 నిమిషముల సమయము కేటాయించవలెను.
పుస్తకములు

The word Master means one who has a complete mastery over the threefold personality. This fascinating book describes the work of the Master CVV and the work of senior disciples, Master M.N. and Master V.P.S., plus the founder of the World Teacher Trust, Master E.K. A section of the book is also devoted to the science of Yoga where Master CVV is described as “…the founder of the raja Yoga path in a form which is most suitable and practical in the modern age.” This is a book that gives a valuable perspective into the work of the Masters who serve the divine Plan for the evolution of humanity and our planet Earth.
more : Sample : PDF : Order

The Aquarian Energy is anchored on earth to quicken the evolutionary process relating to the planet and the planetary beings. The Aquarian Age promises deathless state of existence. It also promises the flight in air of humans. It dawns the etheric existence.
Master CVV is a grand initiate that steered the Aquarian energy into the planetary life and thus inaugurated the Aquarian Age. This book carries a detailed account of the work of Aquarius and enunciates the Yoga of Synthesis as propounded by Master CVV.
More : Sample : PDF | AZW3 | EPUB | Kindle : Order

Yoga is as ancient as the creation itself. The Yoga of Master CVV is no different from the path of Yoga propounded by the ancient most scriptures such as the Bhagavad Gita and the Yoga Sutras of Patanjali. Master CVV gave out a new Yoga, which gave a new impetus for the evolution of life. It works to hasten the process of evolution. Master KPK (Dr K. Parvathi Kumar) continued the work, striving relentlessly for over four decades, to reach out the Yoga of Master CVV in its true sense to the sincere seekers all over the globe
More : Sample : PDF : Order

The Yoga of Master CVV is no different from the path of yoga propounded by the ancient most scriptures such as the Bhagavad Gita and the Yoga Sutras of Patanjali. Master CVV gave out a new yoga which gave a new impetus for the evolution of Life. It works to hasten the process of evolution.
More : Sample : PDF : Order

The teachings of Master CVV, which he had originally received and recorded as MTA instructions, were given out once again in a fresh form by Master K. Parvathi Kumar in Telugu. Several teachings coming from Master CVV were given afresh, through which the groups derived necessary inspiration and knowledge for further practice. They were translated into English and the aphorisms were published in seriatim in the monthly newsletter ‘Vaisakh Newsletter' under the caption ‘Aphorisms to Disciples'.
More : Sample : PDF : Order

The Avatar of Synthesis is none other than the energy of Love coming from Sirius. Christ is the Grand Master to the humanity. But to the Christ himself the Sirius energy of Love is a Grand Master. Master Djwhal Khul says, What the Christ is to us, the Avatar of Synthesis is to the Christ. That is the grand energy which is descending upon us through all the sun signs. And Master CVV has been a channel to it. When we say, ‘The Master’, we are referring to the energies of Love coming from Sirius. We are also referring to the first channel who is responsible for the visit of the energies to us.
More : Sample : PDF : Order

Master CVV, the Aquarian Master, gave out Saturn regulations to his followers, to enable rectification of personality limitations. He proposes to round up the personality, which would enable the soul to manifest the purpose of life. Master KPK gives in this book the original regulations coming from Master CVV, followed by the revised and commented ones coming through him. Master KPK spoke out these regulations for the first time during the 2008 December Call at Bangalore, South India. The complete commentary is now given in brief for all those who are practising yoga in various parts of the globe.
More : Sample : PDF : Order

Inclusion is the Path of Synthesis. Include to get included. If we reject, we get rejected. If we neglect someone, we are neglected. As we try to include and reconsider others, people consider and include us. That is why the fundamental teaching of Master CVV is “Learn to include”.
Master KPK has been transmitting the Energies of Master CVV and the Path of Synthesis in the West on the MAY CALL Days since 1988. The May Call messages of Master KPK represent the teachings of Master CVV. They are briefly given here as a first step of His teachings. Multilingual Edition 2006: English / German / Spanish
More : Sample : PDF : Order

There is a way to understand the synthesis of Existence, when Existence is recollected and we speak in awareness of Existence, in awareness of Existence we work, in awareness of Existence we sleep, and then there is One continuous Existence experienced through all. We shall have to remember that there is only Existence and nothing else. Master KPK has been transmitting the Energies of Master CVV and the Path of Synthesis in the West on the MAY CALL Days since 1988. The May Call messages of Master KPK represent the teachings of Master CVV. They are briefly given here as a first step of His teachings. Edition 2007: English
More : Sample : PDF : Order