జగద్గురు పీఠము యొక్క చిహ్నము
“కూడవలసినది తలలు కాదు, హృదయములు”
జగద్గురు పీఠము
జగద్గురు పీఠములో ప్రవేశము | సంప్రదించుటకు
జగద్గురు పీఠము యొక్క చిహ్నము పరిపూర్ణతకు చిహ్నము. డా. కె. పార్వతీ కుమార్ గారిచే దీనియొక్క వివరణ ఈ విధముగా ఇవ్వబడినది.
వేదమునందు ఇవ్వబడిన అనేక చిహ్నములలో పరిపూర్ణతా చిహ్నము ఎంతో మహత్తరమైనది. ఈ చిహ్నమును ధ్యానము చేసినచో పూర్ణత్వము చేకూరును. భారతదేశము, ఈజిప్టు, గ్రీసు మరియు చాల్డియా దేశములందలి ప్రాచీనులకు వారి సత్యాన్వేషణలో ఎన్నో పురాతనమైన చిహ్నములు గోచరించినాయి. ఈ పరిపూర్ణతా చిహ్నము ప్రతి ప్రాచీన నాగరికతలోనూ ఎదో ఒక రూపములో ఉన్నది. దీనిని మొదటిసారిగా ఇది గోచరించి అనుభూతి పొందినప్పుడు మొదటి చిత్రములో చూపిన విధముగా ఉండెను.
సంస్కృతము నందు ఇదియే “సుదర్శన చక్రము” అని పిలువబడెను. ఇందలి వృత్తము సంపూర్ణతను సూచించును. ఇందలి చతుర్భుజము (cross)చతుర్వ్యూహములకును, మరియు ఆ భుజములను కలుపు చతురస్రము చతుర్వ్యూహముల సమన్వయమును సూచించును.
కాలక్రమములో ఈ ప్రాచీనమైన చిహ్నము రెండవ చిత్రములో చూపిన విధముగా వికారము చెందినది.
వృత్తము మరియు చతురస్రము కూడా మాయమై అది చివరకు స్వస్తిక గా మూడవ చిత్రములో చూపిన విధముగా రూపాంతరము చెందినది.
భౌతిక పదార్థము యొక్క ఉనికి ప్రధాన మగుట వలన నిలువు గీత క్రిందకు లాగబడి నాల్గవ చిత్రములో చూపబడిన విధముగా అయినది.
ఈ చిహ్నము ప్రస్తుత విధముగా వికారము చెందుటను కాలక్రమములో మనిషి పతనము చెందుటగా చెప్పవచ్చును.
ఇది “పరిపూర్ణ చిహ్నము”గా ఎందుకు చెప్పబడినదంటే దీనినుండి సృష్టి ప్రకటితమైననూ ఇది పరిపూర్ణముగానే ఉండును. ఏవిధముగా అంటే.. సున్న నుండి సున్న తీసివేసినట్లుగా. సున్నాను దేనితో గుణించిననూ సున్నాగానే ఎట్లు ఉండునో, అట్లే సృష్టియందు ఎన్ని సూర్యమండలములు లెక్కకు మిక్కిలిగా వ్యక్తమైననూ అది పరిపూర్ణముగానే ఉంటుంది. పరిపూర్ణత, పరిపూర్ణత నుండే వ్యక్తమగును. దీనిని దేనితో కలిపిననూ, దానినుండి తీసివేసిననూ, భాగించిననూ లేక గుణించిననూ పూర్ణము పూర్ణముగానే ఉండును.
గురువు శిష్యునకు జ్ఞానమును బోధించినచో, అతడు జ్ఞానమును నష్టపోడు. శిష్యులు ఎంతమంది పెరిగిననూ, జ్ఞానము కొనసాగునే కానీ పలుచబడదు మరియు పంచుట వలన తరుగదు. గురుశిష్యులు మూలములోనికి అంతర్హితమైననూ పరిపూర్ణతకు చెందిన జ్ఞానము మిగిలియుండును.
వృత్తాకారములు మరియు గోళాకారములు పరిపూర్ణతకు చిహ్నములు. కాలము వృత్తముగను మరియు చోటు గోళముగను ఉండును. కాలచక్రము చోటు గోళమును చుట్టి యుండును.
జ్ఞానము పరిపూర్ణము. కాలము మరియు చోటు దానినుండి ఉద్భవించును. 360 డిగ్రీలు కలిగి యున్నది చోటు, కానీ చోటు యందలి గోళములు 365 డిగ్రీలు కలిగి యున్నవి, అందువలన ఇవి మూలము వలే పరిపూర్ణతను కలిగి యుండలేదు. చోటు యందలి గోళములను చోటు అండములు అందురు. (చిత్రము 5).
చోటు గోళము - చోటు యందలి గోళములు
ఆ ప్రకారముగా పరిపూర్ణతా చిహ్నము సృష్టి, స్థితి మరియు లయములకు మూలమై ఉన్నది. ఇది శాశ్వతత్వమును గుర్తుచేయును.
అదేవిధముగా సృష్టిలోని జీవులందరూ మొదట పరిపూర్ణులే, కాని చోటుయందలి గోళములతో అనుసంధానము చెందుట చేత అపరిపూర్ణతను పొందిరి. తిరిగి చోటుతో అనుసంధానము చెందుట చేత పరిపూర్ణతను పొందగలరు.
చోటు అండము ద్వైతము చెంది రెండుగా విడిపోయెను. ఇది వెలుగు పుట్టుట (అప్పటికే అది స్త్రీ తత్త్వము), మరియు స్త్రీ, పురుష తత్త్వములుగా విడిపోవుటకు సమానము. ఈ రెండు తత్త్వములు మిథునరాశి మరియు తులారాశుల తత్త్వములుగా తెలియబడును. మిథునరాశి ♊ నిలువుగా చేయు విభాగము మరియు తులారాశి ♎ అడ్డముగా చేయు విభాగము.
ఈ విధముగా పరిపూర్ణత మూడుమార్లు వికారము చెందినది.