డా. కె. పార్వతి కుమార్ పరివర్తన
మాస్టర్ కంభంపాటి పార్వతీకుమార్, గారు తన 77వ ఏట 1వ నవంబర్ 2022 న, మంగళవారం రాత్రి విశాఖలోని తమ స్వగృహం రాధామాధవం నందు భౌతిక దేహాన్ని విడిచి పెట్టారు. పరమ గురువులు అందించిన ఆధ్యాత్మిక మార్గంలో ఈ 5 దశాబ్దాలలో యోగము, ఆధ్యాత్మికము, సనాతన ధర్మము, ప్రాచీన విజ్ఞానం తదితర అంశాలపై బోధన, గ్రంథ రచన, వైద్యం మరియు, ఆధ్యాత్మిక మార్గాన్వేషకులకు మరియు కోరిన అందరికీ సలహా సంప్రదింపులు ఇస్తూ, ఎన్నో జీవితాలను దివ్య ప్రణాళికకు అనుగుణంగా తీర్చి దిద్దే మహాయజ్ఞంగా తమ జీవితమును కొనసాగించి తనువు చాలించారు. డా. కె. పార్వతి కుమార్ గురించి మరింత
జగద్గురు పీఠము
దివ్య జ్ఞానమును బోధించిన పరమ గురువుల బోధనల యందు రుచి కలిగి, స్ఫూర్తిని పొందిన మానవాళి ఉద్ధరణకు ఆవిర్భవించినది జగద్గురు పీఠము (The World Teacher Trust). జగద్గురు పీఠము గురించి వివరములు ఎలా ప్రారంభించాలి? కొన్ని సూచనలు
జగద్గురు పీఠము బృందములు
జగద్గురు పీఠము సభ్యుల సంఘము
ధ్యానములు మరియు క్రతువులు
అంతరంగములో పెరుగుటకు ధ్యానమే ఆధారము. ఆత్మ యొక్క నిశ్శబ్దమైన వృద్ధి మౌనము నందు జరుగును. అనేక రకములైన ధ్యానములు కలవు.
ముఖ్యాంశములు
స్వస్థతా మంత్రము: ఓం హౌం ఓం జూం ఓం సః: ఈ మంత్రమును మానవజాతి శ్రేయస్సు కొరకు మరియు ఏదయినా వ్యాధి నుంచి రక్షణ కొరకు ఉచ్చరించవచ్చును. ఈ మంత్ర ఉచ్ఛారణకు ఏ విధమైన ఆంక్షలు లేవు. ఈ మంత్రమును ఏ సమయములో అయినా ఎన్ని మార్లు కుదిరితే అన్ని మార్లు ఉచ్చరించవచ్చును.
ప్రపంచ శాంతి కొరకు ప్రార్థన:
దీని యందు నమ్మకము కలవారు సద్భావన - సేవగా ఈ ప్రార్థన చేయవలెను.
ప్రపంచ శాంతి కొరకు ప్రార్థన గురించి వివరములు
ప్రతిజ్ఞ: ఈ ప్రతిజ్ఞ, మార్పుకొరకు సిద్దపడిన సద్భావనా బృంద సభ్యుల కొరకు చెప్పబడినది. మన సహాయము ఇసుక రేణువంతే అయిననూ, అదికూడా అంగీకరించటమైనది.
స్వస్థతా ప్రార్థన: మనము ప్రపంచ వైద్యుల బృందముగా ఏర్పడదాము…
WTT వీడియో ఛానల్: జగద్గురు పీఠము కార్యక్రమముల వీడియోలు
WTT వీడియో ఛానల్ గురించి వివరములు
youtube.com/@WTT-Global
WTT పాడ్కాస్ట్ లు: డా. పార్వతీకుమార్ గారి ప్రవచనములు పాడ్కాస్ట్ (podcast)రూపములో లభ్యమవుతున్నాయి. WTT పాడ్కాస్ట్ ల గురించి వివరములు
సేవ
ధ్యానము, అధ్యయనము, మరియు సేవ అనునవి జీవితమునకు మూడు కోణముల వంటివి.
కనుక జగద్గురు పీఠము మానవులకే కాక జంతువులకు, వృక్షములకు మరియు ఖనిజములకు కూడా సేవ చేయవలెనని సూచించుచున్నది.
డా. కె. పార్వతీకుమార్, గారు ఇలా చెప్పారు:
“సేవ అనునది ఊర్థ్వ చైతన్యముతో అనుసంధానము చెందుటకు వంతెన అగును. కనుక ఆధ్యాత్మిక సాధనతో పాటు సేవా కార్యక్రమములు కూడా చేయవలెనని జగద్గురు పీఠము గట్టిగా ఉద్ఘాటించుచున్నది.”
సేవా కార్యక్రమములు:
ప్రబోధములు
డా. ఎక్కిరాల కృష్ణమాచార్య గారు మరియు డా. కె. పార్వతీకుమార్ గారు బహుముఖమైన జ్ఞాన బోధలు చేస్తున్నారు. వీరి బోధనలలోని కొన్ని అంశములు సంక్షిప్తముగా ఇవ్వబడినవి. ప్రబోధముల గురించి వివరములు (English)
నావాణి మాసపత్రిక
చందాదారులుగా చేరండి నావాణి మాసపత్రిక
వైశాఖ మాసపత్రిక
చందాదారులుగా చేరండి వైశాఖ మాసపత్రిక (en)
మాసములో ముఖ్య దినములు
కాలమనే తాళము చెవితో ఆధ్యాత్మిక సాధన:
వీడియో
"మంద్రజాలము": కుంభ యుగపు చైతన్యమును ఆపాదించుకొని, భూమి, భూమి జీవులలో గ్రహగతుల ప్రభావము చక్క జేసి, వారి సూక్ష్మ దేహములకు అమరత్వము ప్రసాదించు రాజయోగ మార్గము నిచ్చుటకు అవతరించిన గురు పరంపర జీవన విశేషాలు, ప్రబోధనలు తెలియజెప్పు ఈ దృశ్య శ్రవణ మాలిక (వీడియో డాక్యుమెంటరీ) ను జగద్గురు పీఠము అందించుచున్నది.