{"timeout":"7000","width":"990"}
  • శబ్దము యొక్క శక్తి
  • ఛందము మరియు క్రతువు
  • నిశ్శబ్దమును వినుట

శబ్దము యొక్క శక్తి

శాంతి కొరకు ప్రదర్శనలు చేయుట కన్నా, బృందములుగా ఓంకార నాదోచ్చారణ చేయుట వలన సూక్ష్మ లోకముల పై మంచి ప్రభావము కలిగి ప్రపంచ శాంతి సిద్ధించును.

ఛందము మరియు క్రతువు

అన్నిలయాత్మక కార్యములు మరియూ క్రతువులూ మన శరీరధాతువులలో సహజముగా మార్పులు తీసుకువచ్చుటే లక్ష్యముగా చేసుకొని, మనము త్వరితగతిన అభివృద్ధి చెందడానికి తోడ్పడతాయి.

నిశ్శబ్దమును వినుట

నిశ్శబ్దమును విన్నప్పుడు మనకి ఝంకార నాదము వినిపిస్తుంది. ఇది హృదయ కేంద్రములో వినిపించే నిశ్శబ్దము యొక్క స్వరము మరియూ నిశ్శబ్దమైన ధ్వని.

స్వస్థతా మంత్రము

“ధ్యానము చేయునది కాదు, జరుగునది.”

ధ్యానములు, క్రతువులు | ధ్యానములు మరియు సూచనలు
స్వస్థత చేకూర్చుటకు ధ్యానము | మంత్రములు
పుస్తకము: Mantrams - Their Significance and Practice (English)
Download స్వస్థతా మంత్రము | వినండి స్వస్థతా మంత్రము (MP3, 10 MB)


Master KPK Healing Mantram ఓం హౌం ఓం జూం ఓం సః
ఓం భూః ఓం భువః ఓం స్వః

ఓం త్ర్యంబకం యజామహే
సుగంధిం పష్టివర్ధనమ్
ఉర్వారుకమివ బంధనాన్
మృత్యోర్ముక్షీయ మామృతాత్


ఓం స్వః ఓం భువః ఓం భూః
ఓం సః ఓం జూం ఓం హౌం
ఓం స్వాహా

ఈ మంత్రమును మానవజాతి శ్రేయస్సు కొరకు మరియు ఏదయినా వ్యాధి నుంచి రక్షణ కొరకు ఉచ్చరించవచ్చును. ఈ మంత్ర ఉచ్ఛారణకు ఏ విధమైన ఆంక్షలు లేవు. ఈ మంత్రమును ఏ సమయములో అయినా ఎన్ని మార్లు కుదిరితే అన్ని మార్లు ఉచ్చరించవచ్చును.

ఈ మంత్రము గురించి మాస్టర్ ఇ. కె. గారు “Sound and Colour - Overseas Messages Vol. 12”, p. 67, పుస్తకములో ఈ విధముగా వివరణ ఇచ్చారు:

“ధ్వని అనగా జీవుడిలోని జీవము. ఈ మంత్రము అతి ప్రాచీన భాషలనుంచి ప్రాచీన సంస్కృతములోనికి వచ్చినది. 'జూ' అన్న ధ్వనికి ఆధారము జీవుల గుంపు. ఆంగ్లములోని జూవాలజీ అన్న పదము ఈ ధ్వని నుంచే వచ్చినది. ఈ ఏకాక్షరము సెన్జార్ అనే భాషలోనిది. ఈ విధముగా ఉచ్చరించిన ఈ ధ్వనిని ప్రాణ రక్షకుడు అని పిలుస్తారు. మంత్ర శాస్త్రములో ఈ మంత్రమును మరణమును జయించు మంత్రము అని పిలుస్తారు. అనగా క్రింది మూడు స్థితులనుంచి ఊర్ధ్వ స్థితులను చేరుట.

స్వీయ మరియు ఇతరులకు దోషములనుంచి, రుగ్మతలనుంచి, మరియు వ్యాధులనుంచి స్వస్థత చేకూరడానికి మంత్ర శాస్త్రములో ఈ మంత్రము అత్యున్నతమైనది. ప్రాచీన శాస్త్రజ్ఞుల స్వస్థతా మంత్రము ఇది. దీనికి మృత్యుంజయ అని నామము. మృత్యు అనగా మరణము. ఈ పదము ఈండో-జర్మనిక్ భాషలలో కూడా వాడుకలో ఉన్నది. ఆంగ్లములో మార్టిడం, మోర్ట్యురీ అను పదములు, ఫ్రెంచి భాషలో మోర్గ్ అను పదము మృత్యు నుంచి వచ్చినవి. ఈ పదము ప్రాచీన సంస్కృతమునుంచి వచ్చినది. జయ అనగా విజయము. మృత్యుంజయ అనగా మరణమును జయించుట. ఈ మంత్రమునుకు మృత్యుంజయ మంత్రము అని నామము.“