{"timeout":"7000","width":"990"}
  • సుహృద్భావ సంబంధము
  • సరళత్వము మరియూ నిశ్శబ్దము యందుండి సేవ చేయాలి
  • సేవ యందు అభిలాష
  • బృందములకు సేవ

సుహృద్భావ సంబంధము

ఇతరుల అవసరములను గుర్తించి సహాయము అందించడమే, సుహృద్భావ సంబంధము ఏర్పరచుకొనుటకు ఆధారము.

సరళత్వము మరియూ నిశ్శబ్దము యందుండి సేవ చేయాలి

మనము, ఫలితము కోరని ఏదో ఒక సేవ, సరళత్వము మరియూ నిశ్శబ్దము యందుండి చేయాలి. దాని వలన ఆనందము కలగడమే కాక వ్యక్తిగత కర్మయందు గల ఋణముల నుంచి విముక్తి కలుగుతుంది.

సేవ యందు అభిలాష

అన్ని వేళలా సేవ చేయుటకు ఇచ్ఛ కలిగి, సేవ చెయ్యడానికి తగు అవకాశములను గమనించుకుంటూ ఉండడమనే వైఖరి నే సత్సంకల్పమందురు.

బృందములకు సేవ

బృందమునకు మనము ఏమి చేశాము అన్నది ఒక్కటే సేవకి కొలమానము. మన ఇంటి దగ్గర లేక మనము పని చేసే దగ్గర సహజ బృందములు వాటంతట అవే తయారవుతాయి. 'బృందము' అను పదమును మనము సంకుచితముగా నిర్వచించరాదు.

సేవ

“నిశ్శబ్దముగా పనిచేయుట వలన మంచి సేవ జరుగును. దాని పరిమళము అది కలిగి ఉంటుంది.”

ధ్యానము, అధ్యయనము, సేవ

ధ్యానము, అధ్యయనము మరియు సేవ అనునవి జీవితమునకు మూడు కోణముల వంటివి.

కనుక జగద్గురు పీఠము మానవులకే కాక జంతువులకు, వృక్షములకు మరియు ఖనిజములకు కూడా సేవ చేయవలెనని సూచించుచున్నది.

ఆత్మ-పరివర్తన

మాస్టర్ కె. పి. కె. డా. కె. పార్వతీకుమార్ గారు ఇలా చెప్పారు:

“ఏ మనిషి ఆత్మ-పరివర్తన కోరుకుంటాడో అతడు తోటి జీవులకు సేవ చేయుటను లక్ష్యముగా పెట్టుకొనవలెను. దానివలన ఇంద్రియములు మరియు మనస్సు పరిశుద్ధి చెంది ఉన్నత భావములు మనోఫలకముపై ప్రతిబింబిస్తాయి.
సేవ అనునది ఊర్థ్వ చైతన్యముతో అనుసంధానము చెందుటకు వంతెన అగును. కనుక ఆధ్యాత్మిక సాధనతో పాటు సేవా కార్యక్రమములు కూడా చేయవలెనని జగద్గురు పీఠము గట్టిగా ఉద్ఘాటించుచున్నది.”

యోగ్యత

ప్రతి సేవా తగిన యోగ్యత కలిగి ఉండాలి.

సేవ చేయాలన్న కోరిక ఒక్కటే చాలదు. సేవ ఎలా చేయాలి అన్న జ్ఞానమును పొంది దానికి తగిన ఉపకరణములను పొంది వుండాలి.

జ్ఞానముతో చేసిన సేవ వలన వికాసము కలిగి జ్ఞాన వృద్ధి కలుగును. సేవ మరియు జ్ఞానము యొక్క విలువ వ్యక్తిత్వ స్వభావమును ఆత్మతో సర్దుబాటు చేయుటవలన ఉంటుంది.

బృంద సేవ

జగద్గురు పీఠ బృంద సభ్యులు అనేక సేవారంగాలలో ముఖ్యముగా స్వస్థత మరియు సామాజిక సేవ కార్యక్రమములలో పాల్గొనుచున్నారు.

సేవా బృందములు:

సేవారంగములు

బృంద సభ్యులు ఇంకా సంగీతము, కళలు మరియు సంస్కృతి లేదా సాంఘిక మరియు పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు వంటి ఇతర సేవారంగాలలో కూడా చురుకుగా పాల్గొంటాయి. ఇక్కడ పేర్కొన్నవి మాత్రమే కాక, సేవ జీవితము యొక్క అన్ని సందర్భములలో చేయవచ్చును.

సేవా పథకములు

సమాజ శ్రేయస్సు కొరకు జగద్గురు పీఠ బృందములు అనేక సేవా కార్యక్రమములను చేయుచున్నారు. జగద్గురు పీఠ సేవా పథకములు (English)

  • సత్సంకల్ప బృందము భారత దేశములో పేదలకు, అవసరమైన వారికి అనేక విధములుగా సేవలను అందించు సంస్థ.
  • ధనిష్ఠ సంస్థ భారత దేశములోని ఒక స్వచ్ఛంద సేవా సంస్థ. ప్రచురణలు మరియు సరియైన అవసరమున్న చోట సేవలను అందించును.
  • బాలభాను విద్యాలయములు సాధారణ విద్యతో పాటు, ఆధ్యాత్మిక, నైతిక మరియు సామాజిక విలువలు అందజేయుచున్న విద్యాలయములు.
  • Buena Voluntad en Acción (English) బార్సిలోనా లోని NGO సంస్థ. సమగ్ర రక్షణ సహాయక కార్యక్రమముల ద్వారా పేదరికం తొలగించటానికి మరియు సాంఘిక బహిష్కరణలను అధిగమించడానికి ప్రయత్నించును.