ఋక్కులు మరియు సూక్తములు
“ధ్యానము చేయునది కాదు, జరుగునది.”
ధ్యానములు, క్రతువులు
పుస్తకము: Lessons on Vedic Hymns (English)
పురుష సూక్తము
వేద ఋక్కులలో పురుష సూక్తము అత్యుత్తమమైనదిగా చెప్పబడినది. ఇందు పరబ్రహ్మము, విరాట్ పురుషుడు లేక అప్రతర్క్యము, అచింత్యము, అనిర్వచనీయము, గుణాతీతము అయిన తత్త్వమును గురించి చెప్పబడినది. ఈ తత్త్వమే అన్ని రూపముల సారముగను, సమస్త సృష్టికి మూలమై ఉన్నది.
Download పురుష సూక్తము PDF
Download/వినండి పురుష సూక్తము (MP3, 4.3 MB)
పుస్తకము: Lessons on Purusha Sooktam (English)
శ్రీసూక్తము
వేద ఋక్కులలో శ్రీసూక్తము రెండవ ముఖ్యమైన సూక్తముగా చెప్పబడినది. శ్రీసూక్తము విశ్వాత్మక చైతన్యము గురించి చెప్పును. మనము దేనినైనా గ్రహించునపుడు మనము దాని మూలమై ఉందుము. మనము తత్త్వముగా ఉండుట వలన దాని గురించి ఆలోచించలేము. గ్రహించు స్థితిలో మనము చైతన్య స్వరూపులమై ఉందుము.
Download శ్రీసూక్తము PDF
Download/వినండి శ్రీసూక్తము (MP3, 2 MB)
పుస్తకము: Sri Suktam (English)
సరస్వతీ సూక్తము
వేద ఋక్కులలో సరస్వతీ సూక్తము మూడవ ముఖ్యమైన సూక్తముగా చెప్పబడినది. చైతన్యము మాతా-పితరుల తత్త్వమును సూచించుచూ, అది సృష్టి యందు దైవమై, వాక్కును వెలువరించుచున్నది.
మన ప్రాచీనులు వాక్కు యొక్క ప్రాముఖ్యతను గుర్తించి, అది సృష్టి వికసించుటకైననూ, తిరోధానము చెందుటకైననూ ఎంతో ముఖ్యమైనదని వేదముల యందును, ఉపనిషత్తుల యందును వర్ణించిరి. వాక్ నియమములను పాటించుట ద్వారా మనము సత్యమును అనుభూతి చెందవచ్చును.
Download సరస్వతీ సూక్తము PDF
Download/వినండి సరస్వతీ సూక్తము (MP3, 2 MB)
పుస్తకము: Saraswathi - The Word (English)