{"timeout":"7000","width":"990"}
  • శబ్దము యొక్క శక్తి
  • ఛందము మరియు క్రతువు
  • నిశ్శబ్దమును వినుట

శబ్దము యొక్క శక్తి

శాంతి కొరకు ప్రదర్శనలు చేయుట కన్నా, బృందములుగా ఓంకార నాదోచ్చారణ చేయుట వలన సూక్ష్మ లోకముల పై మంచి ప్రభావము కలిగి ప్రపంచ శాంతి సిద్ధించును.

ఛందము మరియు క్రతువు

అన్నిలయాత్మక కార్యములు మరియూ క్రతువులూ మన శరీరధాతువులలో సహజముగా మార్పులు తీసుకువచ్చుటే లక్ష్యముగా చేసుకొని, మనము త్వరితగతిన అభివృద్ధి చెందడానికి తోడ్పడతాయి.

నిశ్శబ్దమును వినుట

నిశ్శబ్దమును విన్నప్పుడు మనకి ఝంకార నాదము వినిపిస్తుంది. ఇది హృదయ కేంద్రములో వినిపించే నిశ్శబ్దము యొక్క స్వరము మరియూ నిశ్శబ్దమైన ధ్వని.

ప్రతిజ్ఞ ప్రపంచ సేవకుల కొత్త బృందముల చేత

“ ధ్యానము చేయునది కాదు, జరుగునది.”
ఈ ప్రతిజ్ఞ, పరిణామమునకు సిద్దపడిన సద్భావనా బృంద సభ్యుల కొరకు చెప్పబడినది. అమావాస్య రోజున ఒంటరిగా లేదా బృందముగా ఈ ప్రతిజ్ఞ చెప్పుటకు అనుకూలమని చెప్పడమైనది.

ధ్యానములు, క్రతువులు | ప్రార్థనలు మరియు అంశంసనములు
Download ప్రతిజ్ఞ PDF

మేము, మానవజాతి,
సమన్వయము నందు ఏకకాలములో జరుగు
ఉభయ కదలికలను గ్రహించెదము గాక.

మేము, మానవజాతి,
అహితమైన విషయముల నిర్మూలనమును అంగీకరించి
తద్వారా వాటిని తొలగించెదము గాక.

మేము, మానవజాతి,
సమన్వయాత్మక శక్తిని ఆహ్వానించి అదే సమయములో
ప్రపంచములోని ప్రభుత్వములలోకి కురిపింతుము గాక.

మేము, మానవజాతి,
సూక్ష్మము నుండి స్థూలములోనికి నిష్కళంకమైన
ప్రపంచ పరిపాలనా భావమును ఆహ్వానించి
విభజన శక్తులను స్థూలము నుండి సూక్ష్మము లోనికి తరలించెదము గాక.

మేము, మానవజాతి,
హృదయపూర్వకముగా గురుపరంపరతో ఆత్మానుసంధానము కలిగి
ప్రపంచము నందు నూతన వ్యవస్థను నిర్మించెదము గాక.

వెలుగు, ప్రేమ మరియు శక్తి అను దేవతలు దైవ ప్రణాళికను భూమిపై పునరుద్ధరించెదరు గాక.

ఓమ్ శాంతి - శాంతి - శాంతి


Symbol of Synthesis

వ్యాఖ్యానము:

ఈ ప్రతిజ్ఞ, మార్పుకొరకు సిద్దపడిన సద్భావనా బృంద సభ్యుల కొరకు చెప్పబడినది. అహితమైన విషయములను రూపుమాపి, హితమైన విషయములను స్వీకరించి, గురుపరంపర యొక్క ప్రణాళికకు అనుగుణముగా సహకరించుటకు మేము సిద్ధముగా ఉన్నామని ప్రకటించుచున్నాము.

అమావాస్య రోజున ఒంటరిగా లేదా బృందముగా ఈ ప్రతిజ్ఞ చెప్పుటకు అనుకూలమని చెప్పడమైనది. ప్రతి అమావాస్యను సమీపించుట యనగా వర్తమానమును రూపుమాపి, ఏదో ఒక నూతమైన విషయమును రూపొందించుటయే. మనము చాలా క్లిష్ట సమయములో ఉన్నాము. ఆసక్తి యున్నచో మనము కూడా సద్భావనతో తోడ్పాటు గావింతుము.

మన సహాయము ఇసుక రేణువంతే అయిననూ, అదికూడా అంగీకారమే. దీనిని మించి చేయగలమని మనము ఆశించకూడదు. మనము వాస్తవములను గ్రహించి, వినయము కలిగియుండవలెను. చేయు పనిని ఉన్నతమైనదిగా భావించరాదు. మనోలోకములో మనము మంచి భావన నిర్మించినపుడు, సమయానుకూలముగా అది వ్యక్తమగును.

సమన్వయాత్మక చిహ్నములో అర్ధచంద్రాకృతి వృత్తము క్రిందివైపుకు తెరచి యుండును. అందు V అనునది దిగివచ్చు శక్తిని సూచించును. మరియొక V యొక్క మొన పైకి తిరిగి అది వృత్తము నందు పొదగబడినది. ఈ రెండును ఒకటి పైకి, మరియొకటి క్రిందకు ఉండును. క్రిందకు అవతరించు చిహ్నము సమన్వయాత్మక శక్తిని సూచించును. ఒక కదలిక క్రిందకు వర్షించు సమన్వయాత్మక శక్తికిని, మరియొకటి మానవజాతిని ఉన్నతికి చేర్చునదిగను గమనించవచ్చును. ఇవియే పైన చెప్పిన ఉభయ కదలికలు.