{"timeout":"7000","width":"990"}
  • శబ్దము యొక్క శక్తి
  • ఛందము మరియు క్రతువు
  • నిశ్శబ్దమును వినుట

శబ్దము యొక్క శక్తి

శాంతి కొరకు ప్రదర్శనలు చేయుట కన్నా, బృందములుగా ఓంకార నాదోచ్చారణ చేయుట వలన సూక్ష్మ లోకముల పై మంచి ప్రభావము కలిగి ప్రపంచ శాంతి సిద్ధించును.

ఛందము మరియు క్రతువు

అన్నిలయాత్మక కార్యములు మరియూ క్రతువులూ మన శరీరధాతువులలో సహజముగా మార్పులు తీసుకువచ్చుటే లక్ష్యముగా చేసుకొని, మనము త్వరితగతిన అభివృద్ధి చెందడానికి తోడ్పడతాయి.

నిశ్శబ్దమును వినుట

నిశ్శబ్దమును విన్నప్పుడు మనకి ఝంకార నాదము వినిపిస్తుంది. ఇది హృదయ కేంద్రములో వినిపించే నిశ్శబ్దము యొక్క స్వరము మరియూ నిశ్శబ్దమైన ధ్వని.

దక్షిణ విషువత్

“ధ్యానము అనగా చేయునది కాదు, జరుగునది”

విషువత్ దినములలో పగలు, రాత్రులు సమానముగా ఉంటాయి మరియు ప్రకృతిలో ప్రజ్ఞ, పదార్థముల సమతుల్యత ఉంటుంది. ఈ సమయములలో యోగపరమైన శక్తులు అత్యుత్తమముగా లభిస్తాయి, మరియు యోగ సాధనకు విశేషముగా అనుకూలముగా ఉంటాయి. సంవత్సరపు అర్థరాత్రము అయిన దక్షిణ విషువత్ దినమునందు వెలుగుతో అనుసంధానము చెందడము అతి ముఖ్యమైనది.


ధ్యానములు, క్రతువులు | పండుగలు
విషువత్ ప్రార్థన యొక్క PDF
విషువత్-దర్శనము యొక్క PDF

చతుర్భుజము

దక్షిణ విషువత్

మేడమ్ బ్లావెట్స్కీ కు సనాతన జ్ఞానమును పరిచయము చెయ్యడానికి ఆమెకు మధ్యలో బిందువుతో ఉన్న ఒక వెండి చక్రము చూపించబడినది. తర్వాత అడ్డముగా భాగించబడిన ఒక వెండి చక్రము, ఆ తర్వాత నిలువుగా భాగించబడిన ఒక వెండి చక్రము చూపింపబడినవి. వాటిని ఆమె ధ్యానము చేసినప్పుడు జ్ఞానము ఆమెలో ఆవిర్భవించినది. ఆ తర్వాత ఆమె సనాతన జ్ఞానమునకు ఒక నూతన వ్యాఖ్యానము ఇవ్వగలిగినది.

కేంద్రములో బిందువుతో ఉన్న వృత్తము భగవంతునికి సంకేతము. అతను సృష్టిలోని తన ప్రకృతి అయిన విరాట్ పురుషుని ద్వారా వ్యక్తమవుతాడు. అడ్డముగా ఉన్నవ్యాసముతో కూడిన వృత్తము పగలుకి, రాత్రికి, తత్సంబంధిత ఉదయపు మరియు సాయంకాలపు సంధ్యా సమయములకు సంకేతము. ఒక వ్యక్తికి ఇవి చోటులో అతని తూర్పు మరియు పడమరలుగా ఏర్పడతాయి. వృత్తములో నిలువుగా ఉన్న వ్యాసము వ్యక్తి యొక్క మధ్యాహ్నము మరియు అర్థరాత్రములకు సంకేతము. ఈ విధముగా ఒక దినము చతుర్భుజముగను, ఆరు గంటల సమాన వ్యవధిగల నాలుగు సమానమైన భాగములుగను విభజింపబడుతుంది. ఏమీ లేనట్టు కనపడు స్థితి నుంచి స్థూలలోకముల వరకూ సృష్టి కార్యము యొక్క నాలుగు సోపానములకు కూడా చతర్భుజము సంకేతము: శుద్ధ ఆస్తిత్త్వము, చైతన్యము, భావము, మరియు క్రియ.

వేదములు “సర్వము నాలుగు విభాగములు” అని చెప్తుంది: దినములోని ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము, మరియు అర్థరాత్రము; మాసములోని పూర్ణిమ, అమావాస్య, మరియు రెండు అష్టమి తిథులు; సంవత్సరములోని రెండు సంక్రమణ దినములు మరియు రెండు విషువత్ దినములు; అలాగే మానవ జీవితములోని బాల్యము, యౌవనము, నడి వయస్సు, మరియు ముసలితనము. పెద్ద కాల చక్రములలో కూడా నాలుగు యుగములు ఉన్నాయి: కృత, త్రేతా, ద్వాపర, మరియు కలియుగములు.

జ్ఞానము కూడా నాలుగు విధములుగా నాలుగు వేదములుగా ఉన్నది. దీనిని అనుసరించి ఏసు యొక్క శిష్యులు కూడా కొత్త నిబంధనను నాలుగు గాస్పెల్లుగా ఏర్పాటు చేసారు. ఆ విధముగా, చతుర్భుజుడైన విష్ణువు లేక విశ్వ క్రీస్తు యొక్క సందేశము ఒకటే: కేంద్రములో నిలుచుంటే, నాలుగు విధములుగా నున్న సృష్టిని మనము తెలుసుకొనగలము.

ముఖ్య దినములతో అనుసంధానము చెందడము

మన జీవితము దినములోని, మాసములోని, మరియు సంవత్సరములోని ముఖ్యమైన సమయములతో అనుసంధానము చెందగలిగేలా మన కార్యక్రమములను ఏర్పాటు చేసుకొనవలెను. ఎంత ఎక్కువగా మనము ఈ ముఖ్య దినములతో అనుసంధానము చెందితే, అంత ఎక్కువగా మనము సత్యముతోను మరియు వెలుగుతోను అనుసంధానము చెందగలము. మనము సరైన రీతిలో అనుసంధానము చెందితే మన స్థూలవ్యవస్థ సూక్ష్మవ్యవస్థతో శృతి చెందగలదు. మనలో శక్తులను పునర్వ్యవస్థీకరించుకుని ఆత్మతోను, సృష్టితోను లయము కాగలము. దాని వలన మనము స్పష్టతతోను, సమతుల్యతతోను – సంయమనముతో – జీవించగలము.

మనము ఖచ్చితముగా ఈ శక్తులతో అనుసంధానము చెందడము వలన సప్తమ కిరణము యొక్క క్రమబద్ధతను మరియు క్రమశిక్షణను మనపై ఆపాదించుకుంటాము. ఆ విధముగా మనము సూక్ష్మ లోకములలో ప్రవేశించి, మనలను గ్రహ మరియు సౌర వ్యవస్థలతో కలుపుకుంటాము.

అనాదిగా పరమగురువులు ఈ ముఖ్య సమయములో బృంద జీవనములను ఏర్పాటు చేసారు. భూగోళము, మరియు భూగోళపు జీవులు సూర్యుని శక్తులను అందుకుని, దాని ద్వారా అయస్కాంతీకరణము చెందవలెనన్న ఉద్దేశ్యముతో ఈ ఏర్పాటు చేసారు. మాస్టర్ సి. వి. వి. గారు తమ శిష్యులను సంక్రమణము మరియు విషువత్ దినములలో తప్పనిసరిగా బృందములుగా కలిసి ప్రార్థనలు, ధ్యానములు చేయమని చెప్పారు. ఈ విధముగా ఆయన ప్రాచీనమైన ఈ క్రతువులను పునరుద్ధరించారు. ఈ సమయములో మాస్టరును/ఈశ్వరుని ప్రార్థించి ఆయన సన్నిధిని మనము అనుభూతి చెందితే, ఆయన స్పర్శ లభించి, ఆయనతో మన సంబంధము పదిలపడుతుంది.

సమతుల్యము మరియు సంధానము

సూర్యుడు విషువత్ దినములలో భూమధ్య రేఖను దాటినప్పుడు, భూమధ్య రేఖ దగ్గర పగలు, రాత్రులు సమానముగా ఉంటాయి. ఉత్తరాయణములో ఇది 21 మార్చిన, దక్షిణాయనములో ఇది 22 సెప్టెంబరున జరుగుతుంది. పగలు, రాత్రి సమానముగా ఉన్న సమయము ప్రజ్ఞ, పదార్థము సమానముగా ఉన్న యోగ స్థితికి సంబంధించినది. ఏ ఒక్కటీ తిరస్కరించడము లేక నిర్లక్ష్యము చెయ్యడము ఉండదు. “యోగమంటే సమతుల్యత” అని శ్రీకృష్ణుడు చెప్పాడు. మన ప్రేరణములోను, భావములలోను ఉన్న అసమానతలు సర్దుబాటు జరిగినప్పుడు, చైతన్యము జీవ చైతన్య స్రవంతిలో కలుస్తుంది.

భౌతిక, భావ, మరియు మనో లోకముల వ్యతిరేక శక్తుల సమతుల్యము బుద్ధి లోకములలో జరుగుతుంది. ఆ లోకములో సంకల్పము, ప్రేమ, మరియు వెలుగు వ్యాప్తి చెంది ఉంటాయి. మనము ఈ బుద్ధి లోకములతో సంబంధము పెట్టుకుంటే, ఈ సమతుల్య శక్తిని మనము క్రింది లోకములకు తీసుకురావచ్చును. దివ్య లోకములలో ఉండే మహాత్ములను స్మరించడము వలనకూడా వారి సాన్నిధ్యము పొంది మనము ఉద్ధరింపబడతాము. ఈ విధముగా వారి జీవితములు మరియు వారి బోధనలను అధ్యయనము చెయ్యడము ద్వారా వారి సాన్నిధ్యము మనకు కలిగి, మనలోని సమతుల్యత ప్రేరణమవుతుంది.

వెన్నెముక మధ్యలో ఉన్న సుషుమ్నలో పదార్థమయ శక్తులు (ఇడ) మరియు ఆధ్యాత్మిక శక్తులు (పింగళ) సమతుల్యము చెందుతాయి. అప్పుడు మన అస్తిత్త్వము యొక్క ఎరుకలో మనము ఉంటాము. సుషుమ్నను ధ్యానము చెయ్యడము ద్వారా మనలోని పురుష మరియు స్త్రీ తత్త్వములు సమతుల్యమయి, పరిపూర్ణమవుతాయి. సుషుమ్న వజ్ర కాంతితో ఉంటుంది, దీని నుంచే వజ్ర శరీరము తయారవుతుంది. అక్కడినుంచి చైతన్యము ప్రకాశిస్తుంది.

ఈ కాంతిలో నిలబడి, జీవుడితో సంధానము చెందడము వలన మనము సూర్యునితో అనుసంధానమును అనుభూతి చెందవచ్చును. సూర్యుడు ఏ విధముగా ఈ సౌరమండలానికి రాజుగా ఉన్నాడో, అదే విధముగా సనత్కుమారుడు ఈ భూగోళానికి రాజుగా ఉన్నాడు. విషువత్ సమయములో అతను సూర్యునితోను, సవితృనితోను, మరియు ఆదిత్యునితోను అనుసంధానము చెంది గాఢమైన ధ్యానములో ఉంటాడు. మన అంతరంగములో వారితో అనుసంధానము వలన అతనిని సమీపింపవచ్చును. మనలోని నిలువు రేఖను నిర్మించుకుని అన్ని లోకముల అస్తిత్త్వములలోను సమతుల్యతను పొందవచ్చును. సరైన సన్నాహముల వలన సూటిగా సూర్యుని వద్దనుంచే విషువత్ దినము నందు మనము ఉపదేశమును అందుకోగలము. వెలుగును అందుకొని పరిసరములకు ప్రసరింపజేయడము ఒక మంచి సేవా కార్యము. దీని వలన ఇతరులు కూడా వెలుగును చేరుకోవడానికి మనము సహాయము అందించగలుగుతాము.

విరామమునకు సన్నాహములు

సంక్రమణము నుంచి సన్నాహములు ప్రారంభమయిన తదుపరి 90 దినములపాటు కొనసాగవలెను. అప్పుడు రెండు నుంచి మూడు దినములపాటు ఉపదేశమునకు సమయ ద్వారము తెరువబడుతుంది. విషువత్ ముందు కనీసము మూడు దినములపాటు మనము అంతర్ముఖముగా అనుసంధానము చెంది ఉండవలెను. అప్పుడే మనము శక్తులను గ్రహించగలుగుతాము మరియు సూక్ష్మజ్ఞానములో వికాసము చెందగలుగుతాము.

విషువత్ ఒక విరామము - ఇది రెండు శ్వాసల మధ్య విరామము లాంటిది. ఈ విరామము ద్వారా మనము సులభముగా సూక్ష్మ మరియు ఇహ (supermundane)లోకములలోకి ప్రవేశించగలుగుతాము.

చాలా మందికి సంక్రమణములు మరియు విషువత్ దినముల గురించి తెలియదు, అందువలన వాటి నుంచి ప్రయోజనము పొందరు. ప్రజ్ఞ యొక్క స్థితిని బట్టి వారి వారి అవగాహన ఉంటుంది. ఎవరికయితే ఈ పెద్ద వ్యవస్థ యొక్క శక్తుల ఎరుక ఉండక, అనుసంధానము చెందరో వారు అవగాహనలను కోల్పోతారు. ఆధ్యాత్మిక విద్యార్థులుగా మనము ఈ సమయములలో అప్రమత్తతతో ఉండి, ప్రకృతి యొక్క ఈ పండుగలను అనుసరించడము మరియు వాటిని ఖచ్చితంగా గమనించడము చెయ్యవలెను. ఈ పండుగలు విందు భోజనములకు మరియు సంభాషణలకు కాదు – జీవుడు నిశ్శబ్దముగా వేడుక చేసుకోవడము కోసము.

ఈ విషువత్ దినములను మనము చాలా పనులతోను లేక సమావేశములతోను నింపుకోకూడదు. కుదిరితే సెలవు తీసుకొని, దృఢ నిశ్చయముతో ధ్యానము చేసుకొనవలెను – బృందములుగా ధ్యానము చేసుకుంటే ఎక్కువ మంచిది. ఈ దినములలో బృంద జీవనమును నిర్వర్తించుకొని పరమగురువుల పరంపర యొక్క శక్తులను ఆశంసనము చేసుకోవడము చాలా ఉత్తమమైనది. ఈ శక్తికి పుష్పములను అర్పించి దాని సాన్నిధ్యము కొరకు ప్రార్థన చేయవచ్చును.

వెలుగును జ్ఞప్తికి తెచ్చుకోవడము

తులా రాశి మొదటిలో వచ్చే విషువత్ దినములో ఒక గంభీరత మరియు సూక్ష్మత ఉంటుంది. ఇది మేష రాశిలో వచ్చే విషువత్ దినమునకు సమ సప్తకము అనగా సరిగ్గా 180°లలో ఉంటుంది. ఈ రెండిటి సంబంధము ఒక ముఖ్యమైన అక్షముగా ఏర్పడుతుంది. మేష రాశిలో మనము తండ్రిని, ప్రజ్ఞను, తారసిల్లుతాము; తులా రాశిలో తల్లిని, పదార్థమును, తారసిల్లుతాము. తండ్రి ఎల్లప్పుడూ ఉంటాడు, కాని తులా రాశిలో మాత్రం అతను తల్లిలో ఇమిడిపోతాడు. దక్షిణ విషువత్ సమయములో అర్థరాత్రము వంటిది. అందులో ప్రవేశము అంటే అంధకారములో ప్రవేశము. అప్పుడు తల్లి లేక పదార్థము యొక్క మాయను దాటడము మిక్కిలి కష్టముగా ఉంటుంది. తులా రాశిలో ఆమెను “దుర్గమమైన తల్లి” అని కూడా పిలుస్తారు. తూర్పు దేశములలో ఆమెను “దుర్గ” అని పిలుస్తారు. ఆమె సత్యము మరియు మాయల మధ్య ఉండడము వలన ఆ తల్లి మాయగా కనుపించు మన జీవితము యొక్క ద్వారము వద్ద ఉంటుంది.

పదార్థము యొక్క మాయ తారసిల్లినప్పుడు వెలుగును గుర్తుతెచ్చుకోవడము ముఖ్యము. అప్పుడు “చీకటిలోని వెలుగును” తల్లి మనకు అందిస్తుంది. ఈ వెలుగు వలన మనము మానవజాతిని లక్షల సంవత్సరముల నుంచీ బందీలుగా చేసిన మోహమనే ప్రమాదములలో పడకుండా ఉంటాము. అతిపెద్ద మోహములలో కామము ఒకటి. ఈ చీకటి యుగములో స్త్రీత్వము మరియు స్త్రీ స్వభావములపై అవగాహన లేకపోవడము వలన తీవ్రమైన అసమతుల్యతలకు దారి తీసింది. పురుష ఆధిక్యత చాలా బాధలను కలిగిస్తున్నది – స్త్రీలకే కాదు, పురుషులకు కూడా.

ఆరోహణ మార్గము

పురుష, స్త్రీ విభాగముల మరియు సూక్ష్మ, స్థూల అస్తిత్వముల సమతుల్యతకు దుర్గగా ఉన్న తల్లి మూల సూత్రము. జీవ చక్ర కేంద్రమునకు ఆమె ఆధారము. ఆమె ప్రసారణ శక్తిగను మరియు మిశ్రణము చేయు శక్తిగను పని చేస్తుంది. సూక్ష్మ మరియు స్థూల లోకముల మధ్య ఉన్న రహస్య మార్గమును తెరవమని మనము తులా రాశిలో దుర్గాదేవిని ప్రార్థన చేస్తాము. తల్లి సహాయము వలన మనము తండ్రికి మార్గమును తెలుసుకొనగలుగుతాము – దానికి అంతరంగమునకు మరలి వెన్నెముక ద్వారా ఊర్ధ్వముగా ఆరోహణము చెందవలెను – ఆ విధముగా మనము వికాసము చెందగలము.