{"timeout":"7000","width":"990"}
  • శబ్దము యొక్క శక్తి
  • ఛందము మరియు క్రతువు
  • నిశ్శబ్దమును వినుట

శబ్దము యొక్క శక్తి

శాంతి కొరకు ప్రదర్శనలు చేయుట కన్నా, బృందములుగా ఓంకార నాదోచ్చారణ చేయుట వలన సూక్ష్మ లోకముల పై మంచి ప్రభావము కలిగి ప్రపంచ శాంతి సిద్ధించును.

ఛందము మరియు క్రతువు

అన్నిలయాత్మక కార్యములు మరియూ క్రతువులూ మన శరీరధాతువులలో సహజముగా మార్పులు తీసుకువచ్చుటే లక్ష్యముగా చేసుకొని, మనము త్వరితగతిన అభివృద్ధి చెందడానికి తోడ్పడతాయి.

నిశ్శబ్దమును వినుట

నిశ్శబ్దమును విన్నప్పుడు మనకి ఝంకార నాదము వినిపిస్తుంది. ఇది హృదయ కేంద్రములో వినిపించే నిశ్శబ్దము యొక్క స్వరము మరియూ నిశ్శబ్దమైన ధ్వని.

ఆశంసనము

“ధ్యానము చేయునది కాదు, జరుగునది.”

ధ్యానములు, క్రతువులు | ప్రార్థనలు మరియు అంశంసనములు
Download పూర్తి పాఠము యొక్క PDF (41 KB)

ఆశంసనము యొక్క పూర్తి పాఠము

From the point of Light within the Mind of God
Let light stream forth into the minds of men.
Let light descend on Earth.

From the point of Love within the Heart of God
Let love stream forth into the hearts of men.
May the Lord return to Earth.

From the centre where the Will of God is known
Let purpose guide the little wills of men,
The purpose, which the Masters know and serve.

From the centre which we call the race of men
Let the Plan of Love and Light work out
And may it seal the door where evil dwells.

From the Avatar of Synthesis
Who is around
Let His energy pour down in all kingdoms.
May He lift up the Earth to the Kings of Beauty.

Let Light and Love and Power restore the Plan on Earth.

* * * * * * *

వివరణము


ఈ ఆశంసనము 1937 సంవత్సరమున అలిస్ ఎ. బెయిలీ (Alice A. Bailey) ద్వారా జ్వాలాకూల మహర్షిచే అనుగ్రహించబడినది. ఇది ప్రపంచానికి సంబంధించిన ప్రార్థన, దాదాపు 70 భాషలలోనికి అనువదించబడినది. ఈ ఆశంసనము యొక్క సౌందర్యము మరియు శక్తి, దాని యొక్క సరళత యందును మరియు ఇందు వ్యక్తపరచిన ముఖ్య సూత్రముల యందును కలవు. ఈ ముఖ్యసూత్రములు మానవజాతిలో సహజంగా అందరిచేతా అంగీకరించబడినవి.

ఈ ఆశంసనమునకు లూసిస్ ట్రస్ట్ (Lucis Trust) కొన్ని సవరణలను ముద్రించెను. ఇందలి “man” అనుదానిని “human” గాను, మరియు “My Christ return to Earth” ను “May the Coming One return to Earth” గాను సవరించిరి.

కానీ, “Man” అనునది ఆత్మలను సూచించుటకు వాడబడినది కనుక “Man” ను “human”గా మార్చవలసిన అవసరము లేదు. ఆధ్యాత్మిక దృష్టితో చూచినచో వేరుగా చెప్పనంతవరకు “man” అను దానిలో “woman” కలసి యున్నది. “human” అనుపదమునకు మూలము humus, అనగా మట్టి అని అర్థము. “Human” అను పదము వేరొక అర్థమునిచ్చును, మనిషి మట్టినుండి వచ్చెనని వేరొక అర్థము నిచ్చును. “Man” అనుపదమునకు మూలము “మనుష్య”, అనగా చైతన్యమైన ఆత్మ స్వరూపుడు.

“May the Lord return to Earth” అనునది “May the Coming One return to the Earth” కంటే సరియైనదిగా డా. కె. పార్వతీకుమార్ గారు చెప్పియున్నారు.

చాలా బృందములు “the Avatar of Synthesis who is to come” అను వాక్యమును మార్చమని కోరినారు, ఎందుకనగా ఆయన ఇంతకు ముందే వచ్చి ఉన్నారు కనుక. అందుకని, ఆ వాక్యము ఈ విధముగా ఉన్నది: “From the Avatar of Synthesis Who is around Let His energy pour down in all kingdoms. May He lift up the Earth to the Kings of Beauty”