{"timeout":"7000","width":"990"}
  • శబ్దము యొక్క శక్తి
  • ఛందము మరియు క్రతువు
  • నిశ్శబ్దమును వినుట

శబ్దము యొక్క శక్తి

శాంతి కొరకు ప్రదర్శనలు చేయుట కన్నా, బృందములుగా ఓంకార నాదోచ్చారణ చేయుట వలన సూక్ష్మ లోకముల పై మంచి ప్రభావము కలిగి ప్రపంచ శాంతి సిద్ధించును.

ఛందము మరియు క్రతువు

అన్నిలయాత్మక కార్యములు మరియూ క్రతువులూ మన శరీరధాతువులలో సహజముగా మార్పులు తీసుకువచ్చుటే లక్ష్యముగా చేసుకొని, మనము త్వరితగతిన అభివృద్ధి చెందడానికి తోడ్పడతాయి.

నిశ్శబ్దమును వినుట

నిశ్శబ్దమును విన్నప్పుడు మనకి ఝంకార నాదము వినిపిస్తుంది. ఇది హృదయ కేంద్రములో వినిపించే నిశ్శబ్దము యొక్క స్వరము మరియూ నిశ్శబ్దమైన ధ్వని.

ప్రార్థనలు

“ధ్యానము చేయునది కాదు, జరుగునది.”

ధ్యానములు, క్రతువులు | ప్రార్థనలు మరియు అంశంసనములు
పుస్తకము: Prayers (English)

ప్రార్థనలు

ఆధ్యాత్మిక మార్గమున ప్రార్థనలు అనివార్యము. అవి దైవముతో అనుసంధానము చెందుటకు ఉపయోగపడును. ఇవి సాధన మొదలు పెట్టినవారి నుండి తమపై స్వామిత్వము పొందిన వారివరకు ఉపయోగపడును.

ప్రార్థనలు మనస్సుకు చెందినవి కావు, హృదయానికి చెందినవి. ఇవి ఆర్ద్రతతో, హృదయపూర్వకముగా ఉన్నచో వాటిని ఆత్మయొక్క పిలుపుగా చెప్పవచ్చును. ఇవి దైవముతో స్నేహభావమును వృద్ధిచేసి అనుసంధాన పరచును. అనుసంధానము శ్రేష్ఠమైనది. ఈ అనుసంధానము ద్వారా దైవము మనలను చేరును.

ఆర్ద్రతతో కూడిన ప్రార్థన యొక్క అత్యున్నత స్థితి ధ్యానము. ఇది ఆత్మను పరమాత్మతో కలుపును.

ప్రార్థనలు దైవముపై లోతైన ప్రేమ మరియు ఇష్టమును చూపును. ప్రార్థన యందలి ప్రతి వాక్యము దేనికదే సంపూర్ణము. అది సమన్వయమునకు దారితీయును. లోతైన ప్రార్థనల ద్వారా చివరకు జీవుడు అంతర్యామిలో లీనమై దైవముతో ఐక్యము చెందును.

ప్రార్థనలు సూటిగా మనలను ఉన్నత స్థితికి తీసుకొనిపోయి, హృదయమును, ఆత్మను స్పృశించి మనలను అయస్కాంతీకరించును. అది పవిత్రమైన ఆత్మ యొక్క మంద్రగానము వినునట్లుగా ఉండును. మనము శ్రద్ధ, భక్తులతో తగు సమయమును కేటాయించి ప్రార్థనలు గావించినచో, మనము ప్రార్థన యొక్క వెలుగు, ఆనందము, అయస్కాంత క్షేత్రములోనికి ప్రవేశించుటకు అనుమతి లభించును.

ఉదాహరణ


5

We cannot stand up
to the standards of scriptures.
We fall short in our disciplines.
But we pray
that we may be strengthened.
We pray
that we may be allowed to pray!
If not allowed,
we cannot even pray.
Allow us to pray.


11

We are infants for
we are in fancy.
We fancy that we pray,
that we worship,
that we meditate,
that we study
and that we serve.
We build our fancies around You.
We move around as Your messengers!
Do you need messengers?
Can’t You reach us if You wish?
Lift us up at once.
We pray!


54

As we pray we realise:
You are our life.
You are our love.
You are our dream.
You are our inspiration.
You are our respiration.
You are our heartthrob.
Verily, You are the essence of our life!