{"timeout":"7000","width":"990"}
  • శబ్దము యొక్క శక్తి
  • ఛందము మరియు క్రతువు
  • నిశ్శబ్దమును వినుట

శబ్దము యొక్క శక్తి

శాంతి కొరకు ప్రదర్శనలు చేయుట కన్నా, బృందములుగా ఓంకార నాదోచ్చారణ చేయుట వలన సూక్ష్మ లోకముల పై మంచి ప్రభావము కలిగి ప్రపంచ శాంతి సిద్ధించును.

ఛందము మరియు క్రతువు

అన్నిలయాత్మక కార్యములు మరియూ క్రతువులూ మన శరీరధాతువులలో సహజముగా మార్పులు తీసుకువచ్చుటే లక్ష్యముగా చేసుకొని, మనము త్వరితగతిన అభివృద్ధి చెందడానికి తోడ్పడతాయి.

నిశ్శబ్దమును వినుట

నిశ్శబ్దమును విన్నప్పుడు మనకి ఝంకార నాదము వినిపిస్తుంది. ఇది హృదయ కేంద్రములో వినిపించే నిశ్శబ్దము యొక్క స్వరము మరియూ నిశ్శబ్దమైన ధ్వని.

గణపతి పూజ

“ధ్యానము చేయునది కాదు, జరుగునది.”

ధ్యానములు, క్రతువులు | క్రతువులు
Download గణపతి పూజ PDF (189 KB)
Download/వినండి గణపతి పూజ (MP3, 518 KB)

జ్ఞానము కలిగిన వారు ఎందరో కలరు, కాని ఆ జ్ఞానము దైవముతో అనుసంధానము చెందినపుడు అది ప్రయోజనకరమైన జ్ఞానము అగును. అంత వరకు ఆ జ్ఞానము ఉపయోగము లేక అహంకారమునకు దారితీయును. భక్తి లేని జ్ఞానము మాయను కలిగించి ప్రమాదకరమగును. భక్తి స్థిరపడుటకు దైవమును పూజించుట ఎంతో అవసరము. ఏ రూపము నందైననూ దైవమును పూజించవచ్చును.

దైవీ తత్త్వములన్నియు ఒకచోట కేంద్రీకృతమైన తత్త్వమును గణపతి అందురు. త్రిమూర్తి తత్త్వములు, వారి పత్నులతో కూడి గణపతియందు కలరు. సృష్టియందలి సమస్త ప్రజ్ఞలు గణపతి ద్వారా అనుగ్రహించెదరు. 16 + 2 గణపతి నామములు కలవు.

నామము
ఓం సుముఖాయ నమః
ఓం ఏకదంతాయ నమః
ఓం కపిలాయ నమః
ఓం గజకర్ణకాయ నమః
ఓం లంబోదరాయ నమః
ఓం వికటాయ నమః
ఓం విఘ్నరాజాయ నమః
ఓం గణాధిపతయే నమః
ఓం ధూమకేతవే నమః
ఓం గణాధ్యక్షాయ నమః
ఓం ఫాలచంద్రాయ నమః
ఓం గజాననాయ నమః
ఓం వక్రతుండాయ నమః
ఓం శూర్పకర్ణాయ నమః
ఓం హేరంబాయ నమః
ఓం స్కంధపూర్వజాయ నమః
ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః

గణపతి అనుగ్రహించినచో మన భావము, భాష మరియు ప్రవర్తన సరళీకృతమగును. మనకు సరియైన ఆలోచన సరియైన సమయమునకు వచ్చును. జీవితమునందు క్రమబద్ధత కలిగినచో ప్రజ్ఞావికాసము కలుగును. గణపతి సృష్టిలోనికి అవతరించిన తరువాతనే సృష్టికి స్థిరత్వము ఏర్పడినది అని చెప్పబడినది.

16 ఉపచారములతో గణపతి షోడశోపచార పూజ కలదు. ఎటువంటి పూజ చేయవలెను అని శ్రీకృష్ణ భగవానుని అడిగినపుడు, షోడశ ఉపచార పూజ చాలును అని చెప్పి ఉన్నాడు.

16 ఉపచారములు ఈ విధముగా ఉన్నవి:

ఉపచారము వివరణ
1 ఆవాహన దిగి వచ్చుటకు ఆహ్వానము
2 ఆసనము కూర్చొండుటకు ఆసనము చూపించుట
3 హస్తప్రక్షాళన కాళ్ళు కడుగుట
4 పాదప్రక్షాళన చేతులు కడుగుట
5 ఆచమనము త్రాగుటకు నీరు ఇచ్చుట
6 స్నానము స్నానము చేయించుట
7 వస్త్రము వస్త్రములను సమర్పించుట
8 యజ్ఞోపవీతము యజ్ఞోపవీతమును సమర్పించుట
9 గంధము గంధమును సమర్పించుట
10 పుష్పము పుష్పములను సమర్పించుట
గణపతికి పుష్పముల కంటే గరిక ఇష్టము
11 ధూపము ధూపమును సమర్పించుట (అగరువత్తి చూపించుట)
12 దీపము దీపమును చూపించుట
13 నైవేద్యము నైవేద్యము (ఆహారము) సమర్పించుట
14 తాంబూలము తాంబూలము సమర్పించుట
15 నీరాజనము కర్పూరహారతి సమర్పించుట
16 మంత్రపుష్పము మంత్రముతో పుష్పములు సమర్పించుట