{"timeout":"7000","width":"990"}
  • శబ్దము యొక్క శక్తి
  • ఛందము మరియు క్రతువు
  • నిశ్శబ్దమును వినుట

శబ్దము యొక్క శక్తి

శాంతి కొరకు ప్రదర్శనలు చేయుట కన్నా, బృందములుగా ఓంకార నాదోచ్చారణ చేయుట వలన సూక్ష్మ లోకముల పై మంచి ప్రభావము కలిగి ప్రపంచ శాంతి సిద్ధించును.

ఛందము మరియు క్రతువు

అన్నిలయాత్మక కార్యములు మరియూ క్రతువులూ మన శరీరధాతువులలో సహజముగా మార్పులు తీసుకువచ్చుటే లక్ష్యముగా చేసుకొని, మనము త్వరితగతిన అభివృద్ధి చెందడానికి తోడ్పడతాయి.

నిశ్శబ్దమును వినుట

నిశ్శబ్దమును విన్నప్పుడు మనకి ఝంకార నాదము వినిపిస్తుంది. ఇది హృదయ కేంద్రములో వినిపించే నిశ్శబ్దము యొక్క స్వరము మరియూ నిశ్శబ్దమైన ధ్వని.

మేధాం మే ఇంద్రో దధాతు

ధ్యానము చేయునది కాదు, జరుగునది.”

ధ్యానములు, క్రతువులు | ధ్యానములు మరియు సూచనలు
ఉదయము, సాయంకాలము ప్రార్థన | ధ్యానము యొక్క అవగాహన
మేధాం మే ఇంద్రో దధాతు (MP3, 2.0 MB) | Download ధ్యానము యొక్క PDF (270 KB)

ఈ ప్రార్థన విశ్వవ్యాప్తమైన ఒకే ఒక చైతన్యశక్తిని మనలోనికి ఆవాహన చేసి దేహమునందలి ప్రజ్ఞలన్నింటిని మన యందలి “నేను” అను ప్రజ్ఞతో కూడి యుంచి, దానిని (నేనును) ఎప్పుడూ తిరస్కరించకుండా, నిర్లక్ష్యము చేయకుండా మరియు త్రోసిపుచ్చకుండా యుండేటట్లు చేయును. ఇది మనయందలి ప్రజ్ఞలన్నిటిని ఏకత్వము చెందించి, “నేను” అను ఒకే ఒక ప్రజ్ఞతో అనుసంధానము చెందించు పద్ధతి. దీనిని ప్రతి బోధనకు ముందు గానము చేసినచో మన మనోవైఖరి ననుసరించి గాక, దివ్యప్రణాళిక ప్రకారము బోధన సాగును.

మేధాం మే ఇంద్రో దధాతు

I మేధాం మే ఇంద్రో దధాతు
నాకు ఇంద్రుడు మేధస్సును ప్రసాదించు గాక!
II మేధాం దేవీ సరస్వతి
మేధస్సుకు అధిదేవత యైన సరస్వతి నాయందు ప్రసన్నమై యుండు గాక!
IIIమేధాం మే అశ్వినా ఉభౌ
కుడి ఎడమల (మెదడు)గా ఉండు విశ్వేదేవతలయిన అశ్వినులు, వారి ఆశీర్వచనమును నాకు అందించు గాక!
IV ఆధత్తాం పుష్కర స్రజాః
పుష్కర మాల (సహస్రారదళ పద్మము మరియు మిగిలిన ఆరు పద్మములు) దృఢమై ఉండు గాక!
V ఆప్యాయంతు మమాంగాని
నా దేహమునందలి అన్ని అవయవములు దృఢముగా మేధస్సు వైపునకు మరియు ఆరు పద్మములమాలిక (శక్తి కేంద్రముల) వైపునకు ఉన్ముఖమై ఉండు గాక!
VI వాక్ ప్రాణ శ్చక్షుః శ్రోత్ర మథో బల మింద్రియాణి చ సర్వాణి
నా వాక్కు, ప్రాణములు, కన్నులు, చెవి, మూలాధార శక్తి, ఇతర ఇంద్రియములు మరియు మిగిలిన అవయవము లన్నియు
VII సర్వం బ్రహ్మోప నిషదం
బ్రహ్మము యొక్క సాన్నిధ్యము యందు ఉండు గాక!
VIII మాఽహం బ్రహ్మ నిరాకుర్యాం
నేను ఎన్నడును బ్రహ్మమును నిరాకరింపకుండెదను గాక!
IX మా మా బ్రహ్మ నిరాకరోతు
బ్రహ్మము నన్ను నిరాకరింపకుండు గాక!
X అనిరాకరణమస్తు
నా నిరాకరణము బ్రహ్మమునందు లేకుండా ఉండు గాక!
XI అనిరాకరణమ ఽస్తు
బ్రహ్మము యొక్క నిరాకరణము నా యందు ఉండకుండు గాక!
XII తదాత్మని నిరతే య ఉపనిషత్సు ధర్మా:
ఉపనిషత్తులలో చెప్పబడిన ధర్మములు నా ఆత్మ యందు నిలచు గాక!
XIII తే మయిసంతు
అవి నాయందు నిలచు గాక!
XIV తే మయిసంతు
అవి నాయందు నిలచు గాక!
ఓమ్ శాంతిశ్శాంతిశ్శాంతిః

వివరణ

నాకు ఇంద్రుడు మేధస్సును ప్రసాదించు గాక! మేధస్సుకు అధిదేవత యైన సరస్వతి నాయందు ప్రసన్నమై యుండు గాక! కుడి ఎడమలుగా ఉండు విశ్వేదేవతలయిన అశ్వినులు, వారి ఆశీర్వచనమును నాకు అందింతురు గాక! పుష్కర మాల (సహస్రారదళ పద్మము మరియు మిగిలిన ఆరు పద్మములు) దృఢమై ఉండు గాక! నా దేహమునందలి అన్ని అవయములు దృఢముగా మేధస్సునకు మరియు ఆరు కేంద్రముల వైపునకు ఉన్ముఖమై ఉండును గాక! నా వాక్కు, ప్రాణములు, కన్నులు, చెవి, మూలాధార శక్తి, ఇతర ఇంద్రియములు మరియు మిగిలిన అవయవము లన్నియు బ్రహ్మము యొక్క సాన్నిధ్యము యందు ఉండు గాక! నేను ఎన్నడును బ్రహ్మమును నిరాకరింపకుండెదను గాక! బ్రహ్మము నన్ను నిరాకరింపకుండు గాక! నా నిరాకరణము బ్రహ్మమునందు లేకుండా ఉండు గాక! బ్రహ్మము యొక్క నిరాకరణము నా యందు ఉండకుండు గాక! ఉపనిషత్తులలో చెప్పబడిన ధర్మములు నా ఆత్మ యందు నిలచు గాక! అవి నాయందు నిలచు గాక! అవి నాయందు నిలచు గాక! ప్రజ్ఞ, శక్తి మరియు పదార్థ లోకముల యందు శాంతి నిండుగాక.