{"timeout":"7000","width":"990"}
  • శబ్దము యొక్క శక్తి
  • ఛందము మరియు క్రతువు
  • నిశ్శబ్దమును వినుట

శబ్దము యొక్క శక్తి

శాంతి కొరకు ప్రదర్శనలు చేయుట కన్నా, బృందములుగా ఓంకార నాదోచ్చారణ చేయుట వలన సూక్ష్మ లోకముల పై మంచి ప్రభావము కలిగి ప్రపంచ శాంతి సిద్ధించును.

ఛందము మరియు క్రతువు

అన్నిలయాత్మక కార్యములు మరియూ క్రతువులూ మన శరీరధాతువులలో సహజముగా మార్పులు తీసుకువచ్చుటే లక్ష్యముగా చేసుకొని, మనము త్వరితగతిన అభివృద్ధి చెందడానికి తోడ్పడతాయి.

నిశ్శబ్దమును వినుట

నిశ్శబ్దమును విన్నప్పుడు మనకి ఝంకార నాదము వినిపిస్తుంది. ఇది హృదయ కేంద్రములో వినిపించే నిశ్శబ్దము యొక్క స్వరము మరియూ నిశ్శబ్దమైన ధ్వని.

బృందము నందు సమన్వయము కొరకు ప్రార్థన


“ధ్యానము చేయునది కాదు, జరుగునది.”

ధ్యానములు, క్రతువులు | ప్రార్థనలు మరియు అంశంసనములు
Download పూర్తి ప్రార్థన PDF (183 KB)
Download/వినండి సహనావవతు మంత్రము (MP3, 2.3 MB)
పుస్తకము: Mantrams - Their Significance and Practice (English)

ఓం సహ నావవతు
సహ నౌ భునక్తు
సహ వీర్యం కరవావహై
తేజస్వినావధీతమస్తు
మా విద్విషావహై
ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః


తాత్పర్యము:

మేమందరము కలసి రక్షించబడెదము గాక!
మేమందరము కలసి పోషించబడెదము గాక!
మేమందరము కలసి సమర్థతతో పనిచేయుదము గాక!
మా యందు జ్ఞానము వికసించుటకు ఆటంకములు ఉండకుండు గాక!
అసూయ, ద్వేషములు లేకుండుగాక!
మాయందలి మూడు లోకములందు శాంతి నిండుగాక!

వివరణ

బృంద సమన్వయము

ఇది “గురువు-శిష్యుడు” కలసి ఇద్దరి ప్రయోజనము కొరకు, అనుగ్రహము కొరకు మరియు వృద్ధి కొరకు చేయు ప్రార్థన. దివ్యమైన వెలుగు మార్గములో కలసి జట్టుగా ఉండి పయనించుటకు దీవెనగా ఉచ్చరించబడినది. “మా మధ్య అసూయా ద్వేషములు లేకుండు గాక!” అన్నది అద్వితీయమైనది. ఈ శాంతి పాఠము సద్భావనను ఏర్పరచి, చెడు భావనలను తొలగించును. ఈ ప్రార్థన గురు-శిష్య సంబంధమును బలపరచును. ఇది జ్ఞానోదయము యొక్క సాఫల్యము కొరకు చెప్పబడినది.

జ్ఞానము కలవాడు గురువు. శిష్యుడు ఆ జ్ఞానము పొందగోరువాడు. జ్ఞానోదయము ఒక్కటే లక్ష్యముగా కలవాడు శిష్యుడు. వెలుగు యందు వృద్ధి పొందుట మాత్రమే వారి పరస్పర ప్రయోజనము. అట్టి ఒకే ఒక లక్ష్యము కొరకు వారు కలసి పనిచేయుదురు.

యజ్ఞార్థ జీవనము, సేవయే పనిగా చెప్పబడినది. అట్టి పని ఆనందమును ఇచ్చును. అట్టి ఆనందమును ఇద్దరును కలసి పంచుకొందురు. ఎప్పుడైతే ఇద్దరునూ వెలుగు నందు జీవించుచుందురో వారి మధ్య అసుయా ద్వేషములు తొలగి శాంతి నెలకొని రక్షణ కలుగును.

ఇటువంటి దివ్యమైన ప్రార్థన ప్రతి ఒక సద్భావనా బృందము లన్నియు వారికొరకు, వారి గురువు కొరకు ఉచ్చరించవలెనని సూచించటమైనది.